Trisha Movie started with Song recording: సుమన్ ప్రధాన పాత్రలో పాటల రికార్డింగ్ తో శ్రీకారం చుట్టుకున్న  ఆర్.కె గాంధీ “త్రిష”

IMG 20231109 WA0089 e1699523654390

 

పాటల రికార్డింగ్ తో సినిమాకు శ్రీకారం చుట్టడం అనే సంప్రదాయాన్ని ఇటివల మెగాస్టార్ చిరంజీవి జీవం పోయడం తెలిసిందే. తాను నటిస్తున్న 156వ చిత్రాన్ని కీరవాణి సారద్యంలో పాటల రికార్డింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు మెగాస్టార్ చిరంజీవి. అదే బాటలో యువ దర్శకుడు ఆర్.కె గాంధీ తన తాజా చిత్రాన్ని ప్రారంబించారు.

సీనియర్ ఎన్టీఆర్ తరువాత దేవుళ్ళ పాత్రలు పోషించడంలో తనకు తానే సాటి అని నిరుపించుకున్న సీనియర్ హీరో సుమన్ ప్రధానపాత్రలో ‘త్రిష’ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు యువ ప్రతిభాశాలి ఆర్.కె గాంధీ. ‘సంభవామి యుగే యుగే’ అన్నది ఈ చిత్రం ఉపశీర్షిక!!

IMG 20231109 WA0091

స్నేహాలయం క్రియేషన్స్- బి.ఆర్ మూవీస్ పతకాలపై రవీంద్ర బూసం – ఈశ్వర్ నాగనాధ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: కిరణ్ కుమార్ గుడిపల్లి. హంనుమంత రాయప్ప లైన్ ప్రొడ్యూసర్. యువ సంగీత సంచలనం ఎం.ఎల్.రాజా సంగీతంతోపాటు సాహిత్యం సైతం సమకూర్చుతున్నారు. “త్రిష” చిత్రం కోసం యువగాయకుడు సాయి చరణ్ ఆలపించిన గీతాన్ని అభేరి స్టుడియోలో ఈరోజు (08-11-2023) రికార్డింగ్ చేశారు. ఈ నెల 14 నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ‘త్రిష ‘ కర్ణాటకలోను కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకోనుంది!!

IMG 20231109 WA0090

ఒక దివ్యాంశ సంభూతుడు దుష్టశక్తులను, దుష్టపన్నాగాలను ఎలా అరికట్టాడు అనే కథాంశంతో తెరకెక్కుతన్న ఈ చిత్రంలో కాలకేయ ప్రభాకర్, సురేష్ సూర్య, ఖుషీ గౌడ్, యువీన, కృష్ణేంద్ర, ధీరజ్ అప్పాజీ, ఆనంద్ మట్ట ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

 

 ఈ చిత్రానికి పి.ఆర్,ఓ: ధీరజ్ అప్పాజీ, కెమెరా: ప్రమోద్ భారతీయ, నృత్యాలు: సూర్య కిరణ్, ఆర్ట్ : ప్రసాద్, సాహిత్యం-సంగీతం: ఎం.ఎల్.రాజా, లైన్ ప్రొడ్యూసర్: హనుమంత్ రాయప్ప, సమర్పణ: కిరణ్ కుమార్ గుడిపల్లి, నిర్మాతలు: రవీంద్ర బూసం – ఈశ్వర్ నాగనాధ్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే – దర్శకత్వం: ఆర్.కె.గాంధి!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *