త్రిముఖ మూవీ మోషన్ పోస్టర్ ఆవిష్కరించిన హీరో సాయి దుర్గా తేజ్ !

Trimukha movie postar launch e1728995420741

అకిరా డ్రీమ్ క్రియేషన్స్ పతాకంపై యోగేష్, ఆకృతి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా రాజేష్ నాయుడు దర్శకత్వంలో నాజర్ ,సన్నిలియోన్, ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం “త్రిముఖ.” కాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను హీరో సాయిధరమ్ తేజ్ నేడు హైదరాబాద్ లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ: – ఈ డైరెక్టర్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఈ మోషన్ పోస్టర్ ఈరోజు నా చేతుల మీదుగా విడుదల చేయటం సంతోషంగా ఉంది. హీరో యోగేష్ మంచి పట్టుదల ఉన్న వ్యక్తి ఆయన హీరోగా చేస్తున్న ఈ చిత్రం డెఫినెట్ గా కొత్త వరవడి సృష్టిస్తుంది. అని అన్నారు.

Trimukha movie postar launch 1

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాజేష్ నాయుడు మాట్లాడుతూ:- ఈరోజు మా సినిమా పోస్టర్ను మెగా బ్లడ్ అయినా సాయి దరం తేజ్ గారు ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది మేము ఊహించని విషయం . పెద్దమనసు తో పుట్టినరోజు సందర్భంగా సాయిధరమ్ తేజ్ గారు మా పోస్ట్ ఆవిష్కరణ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అని అన్నారు.

Trimukha movie postar launch 3

హీరో యోగేష్ మాట్లాడుతూ:- ఈ సినిమాలో నేను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. కథ చాలా మంచి నటన స్కోప్‌తో అద్భుతమైన ఉత్కంఠభరితమైన సబ్జెక్ట్. నా మొదటి ప్రాజెక్ట్‌గా త్రిముఖలో నటించడం సంతోషంగా ఉంది. సినిమా భారీ బ్లాక్‌బస్టర్ అవుతుందని చాలా నమ్మకంగా ఉన్నాను”. అన్నారు.

నటి నటులు: 

అశురెడ్డి, సీఐడీ శ్రీవాస్తవ,యోగేష్, ఆకృతి అగర్వాల్, సన్నీ లియోన్, అషు రెడ్డి, నాజర్, ముట్టా రాజేందర్, సీఐడీ శ్రీ వాస్తవ్, జీవా, ప్రవీణ్, షకలక శంకర్, సూర్య, సమ్మెట గాంధీ, జెమిని సురేష్ తదితరులు..,

Trimukha movie postar launch 2

సాంకేతిక వర్గం : 

సమర్పణ:కృష్ణమోహన్, శ్రీవల్లి, డి ఓ పి:ప్రభాకరరెడ్డి, సంగీతం: వినోద్ యాజమాన్య, ఆర్ట్: సుమిత్ పటేల్, పి ఆర్ ఓ: బి. వీరబాబు, ప్రొడ్యూసర్: శ్రీదేవి మద్ధాలి, హర్ష కల్లె,దర్శకత్వం: రాజేష్ నాయుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *