Trailer Launch: బేబీ సినిమా దర్శకుడు సాయి రాజేష్‌ విడుదల చేసిన అష్టదిగ్బంధనం’ థియేట్రికల్ ట్రైలర్‌..!

IMG 20230913 WA0134

 

ఎం.కె.ఎ.కె.ఎ ఫిలిం ప్రొడక్షన్‌ సమర్పణలో బాబా పి.ఆర్‌. దర్శకత్వంలో మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌ నిర్మించిన చిత్రం ‘అష్టదిగ్బంధనం’. సూర్య, విషిక జంటగా నటించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ విడుదల కార్యక్రమం మంగళవారం ప్రసాద్‌ల్యాబ్‌లో ఘనంగా జరిగింది.

IMG 20230913 WA0139

ఈ కార్యక్రమానికి ‘బేబి’ చిత్రంతో 100 కోట్ల క్లబ్‌లో చేరిన దర్శకుడు సాయి రాజేష్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్‌ చేసి, అష్టదిగ్బంధనం సినిమా సెప్టెంబర్ 22న విడుదల కానుందని తెలిపారు.

IMG 20230913 WA0138

అనంతరం సాయి రాజేష్‌ మాట్లాడుతూ… సహజంగా నాకు ఫంక్షన్స్‌ అటెండ్‌ అవ్వడం అంటే ఇంట్రస్ట్‌ ఉండదు. ‘బేబి’ సూపర్‌హిట్‌ తర్వాత మరీ ఇబ్బందిగా ఉంది. కానీ సురేష్‌ కొండేటి అడగటంతో ఈ కార్యక్రమానికి రాక తప్పలేదు. నేను కూడా నా సినిమాలు హృదయకాలేయం, కొబ్బరిమట్టలకు ప్రమోషన్‌ విషయంలో చాలా కష్టపడాల్సి వచ్చింది.

IMG 20230913 WA0110

 

చిన్న సినిమాలకు ఎవరైనా పేరున్న గెస్ట్‌లు వస్తే మంచి ప్రమోషన్‌ దక్కుతుంది. ఇక అష్టదిగ్బంధనం అనేది చాలా పవర్‌ఫుల్‌ టైటిల్‌. ట్రైలర్‌ చూసిన తర్వాత ఇందులో ప్రేక్షకులను అష్టదిగ్బంధనం చేసే అంశాలు చాలానే ఉన్నాయి అనిపిస్తోంది. మంచి సస్పెన్స్‌ కనపడుతోంది.

ఈ చిత్రం ఘన విజయం సాధించి యూనిట్‌ అందరికీ మంచి పేరు, అవకాశాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను, సెప్టెంబర్ 22న విడుదల అవుతున్న అష్టదిగ్బధనం సినిమా థియేటర్లలో చూసి ప్రోతహించమని కోరారు.

IMG 20230913 WA0139

చిత్ర నిర్మాత మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ…దర్శకుడు బాబా పి.ఆర్ ఈ కథ చెప్పగానే నాకు ఇంట్రస్టింగ్‌ అనిపించింది. మంచి యాక్షన్‌, క్రైమ్‌ థిల్లర్‌. యూనిట్‌ అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. కథను నమ్మి సినిమాను నిర్మించాలని నిర్ణయించుకున్నాను. బాబాగారు ముందు చెప్పిన దానికన్నా అద్భుతంగా తీశారు. ఈనెల 22న థియేటర్స్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

IMG 20230913 WA0135

దర్శకుడు బాబా పి.ఆర్‌. మాట్లాడుతూ

థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసిన దర్శకులు సాయి రాజేష్‌ గారికి మా యూనిట్‌ అందరి తరపునా కృతజ్ఞతలు. దర్శకుడిగా నా మొదటి సినిమా ‘సైదులు’. అష్టదిగ్బంధనం దర్శకుడిగా నా రెండో చిత్రం. కథను నమ్మి నిర్మాత మనోజ్‌కుమార్‌ గారు నాతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు.

IMG 20230912 WA0133

ఇది ఒక క్రైమ్‌, యాక్షన్‌ థ్రిల్లర్‌. పజిల్‌ లాంటి సినిమా. ప్రేక్షకుణ్ణి ప్రతి సీన్‌ థ్రిల్‌కు గురి చేస్తుంది. స్క్రీన్‌ప్లే బేస్డ్‌ సినిమా. ఇందులోని క్యారెక్టర్‌లు సెల్ఫిష్‌నెస్‌తో కూడుకుని, ఒకరి నొకరు అష్టదిగ్బంధనం చేసుకోవాలని చూస్తుంటాయి. యాక్షన్‌ సినిమాలు ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. ఇందులో చాలామంది కొత్తవారు నటించారు. అందరూ అనుభవం ఉన్న వారిలా చేశారు.ఈ నెల 22న థియేటర్స్‌లోకి వస్తోంది. అందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా అన్నారు.

IMG 20230913 WA0109

హీరో సూర్య మాట్లాడుతూ… నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇందులో నాది ఇన్నోసెంట్‌ క్యారెక్టర్‌. పోను పోను అది అగ్రెసివ్‌గా మారిపోతుంది. టోటల్‌ అవుట్‌పుట్‌ చూస్తే సూపర్‌గా వచ్చింది. ఇది పక్కా సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ అని గట్టిగా నమ్ముతున్నాం. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం అన్నారు.

IMG 20230912 WA0123

హీరోయిన్‌ విషిక మాట్లాడుతూ...నేను చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు యాక్టింగ్‌ గురించి పెద్దగా తెలియదు. హీరోయిన్‌ అయిన తర్వాత ప్రతి సినిమా నుంచి ఎంతోకొంత నేర్చుకుంటూ వస్తున్నా. ఈ సినిమా నాకు గొప్ప ఎక్స్‌పీరియెన్స్‌. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. దర్శకులు బాబా గారు మా అందరినీ క్యారెక్టర్‌కు తగ్గట్టుగా చక్కగా మౌల్డ్‌ చేశారు. దర్శక, నిర్మాతలకు నా థ్యాంక్స్‌ అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కెమెరామెన్‌, ఎడిటర్‌, ఇతర ముఖ్యపాత్రలు వేసిన నటీనటులు సినిమా విజయం సాధించాలని కోరుకుంటూ ప్రసంగించారు.

IMG 20230912 WA0081

ఈ చిత్రానికి డీఓపీ: బాబు కొల్లాబత్తుల, ఎడిటర్‌: సత్య గిడుతూరి, ఫైట్స్‌: రామ్‌కృష్ణ, బాబా పి.ఆర్‌, శంకర్‌ ఉయ్యాల, లిరిక్స్‌ : పూర్ణాచారి, బాబా పి.ఆర్‌., ఆర్ట్‌ డైరెక్షన్‌ : వెంకట్‌ ఆరె, డాన్స్‌: అనీష్‌, మోయిన్‌, సంగీతం: జాక్సన్‌ విజయన్‌, నిర్మాత:మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌, రచన, దర్శకత్వం: బాబా పి.ఆర్‌.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *