IMG 20230807 WA0047

 

యోగ లక్ష్మీ ఆర్ట్స్ క్రయేషన్స్ పతాకం పై ఈశ్వర్ నయన సర్వార్ హీరో హీరోయిన్స్ గా అభిమన్యు సింగ్ ముఖ్య పాత్రలో అర్.ఎక్స్ 100 ఫేమ్ పూజా ఐటమ్ సాంగ్ లో చేస్తున్న చిత్రం “సూర్యాపేట్ జంక్షన్” . చిత్ర యూనిట్ ఈ సినిమా లోని మూడవ సాంగ్ నీ సౌత్ ఇండియ స్టార్ ప్రొడ్యూసర్ సి. కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిధి

IMG 20230807 WA0046

సి.కళ్యాణ్ మాట్లాడుతూ… “చెంగు చెంగు అంటూ సాయిచరణ్ పాడిన టీజింగ్ సాంగ్ చాలా బాగుంది హీరో ఈశ్వర్, హీరోయిన్ నయన సర్వార్ ఈ పాటకు డాన్స్ బాగా చేశారు. డైరెక్టర్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా స్టోరీ ఎంచుకుని చాలా బాగా తీశారు కొరియోగరాఫర్ ఈశ్వర్ చేత డాన్స్ స్టెప్స్ బాగా చేయించాడు . రోషన్ సాలూరి మ్యూజిక్ కూడా బాగుంది అని చెప్తూ మా ఈశ్వర్ కి ఈ చిత్రం తో మంచి హిట్ రావాలి అని కోరుకుంటున్నాను అని చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియచేసారు.

హీరో ఈశ్వర్ మాట్లాడుతూ….. సూర్యాపెట్ జంక్షన్ లోని రెండవ పాటని సి. కళ్యాణ్ గారి చేతుల మీదుగా విడుదల చెయ్యడం ఆనందంగా ఉంది. ఆయన బిజీ టైమ్ లో కూడా అడిగిన వెంటనే సాంగ్ విడుదల చేయడానికి ఒప్పుకుని మూవీ కంటెంట్ చూసి సూర్యాపెట్ జంక్షన్ మంచి సినిమా అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారన్నారు. మూడవ సాంగ్ విడుదల చేసినందుకు మా టీమ్ తరపున నా తరపున కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు .

IMG 20230807 WA0048

డైరెక్టర్ రాజేష్ నాదెండ్ల మాట్లాడుతూ….. ఇప్పటికే టీజర్ ఐటమ్ సాంగ్ విడుదలయ్యి వాటికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. హీరో ఈశ్వర్ హీరోయిన్ని టీజింగ్ చేసే ఈ మాస్ సాంగ్ అందరికీ నచ్చుతుందిఅన్నారు.

రచయిత రాజేంద్ర భరద్వాజ్ మాట్లాడుతూ….. వ్యవస్తను సరిదిద్దే బాధ్యత యువత పై ఉంటుంది, కొత్తతరం ఓటరులు తప్పకుండా చూడవలిసిన చిత్రం ‘సూర్యాపెట్ జంక్షన్’ అన్నారు.

IMG 20230807 WA0049

నిర్మాతలు మాట్లాడుతూ….. మా చిత్రాన్ని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాము మిగిలిన అప్డేట్స్ త్వరలో తెలియజేస్తాము అన్నారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

నటీనటులు:

ఈశ్వర్, నైనా సర్వర్, అభిమన్యు సింగ్, లక్ష్మణ్, బాషా, సూర్య,హరీష్, చలాకీ చంటి,మున్న వేణు, చమ్మక్ చంద్ర, కోటేశ్వర రావు,

సాంకేతిక నిపుణులు :

బ్యానర్ : యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్

టైటిల్ : సూర్యాపేట జంక్షన్

నిర్మాతలు : అనిల్ కుమార్ కత్ర గోడ, ఎన్.శ్రీనివాసరావు,

డైరెక్టర్ : నాదెండ్ల రాజేష్

స్టోరీ : ఈశ్వర్

మ్యూజిక్ : రోషన్ సాలూరి, గౌర హరి

డి.ఓ.పి : అరుణ్ ప్రసాద్

ఎడిటర్ : ఎం.ఆర్.వర్మ

కో డైరెక్టర్ : శ్రీనివాస్

లిరిక్స్ : ఎ.రహమాన్

పోస్టర్ డిజైనర్ : ధనియేలె

రైటర్స్ : రాజేంద్ర భరద్వాజ్ , సత్య రిషి

పి. ఆర్. ఓ : కడలి రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *