The Trail Movie Trailer Review: శ్రీవిష్ణు చేతుల మీదుగా “ది ట్రయల్” సినిమా ట్రైలర్ లాంఛ్,  మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

IMG 20231119 WA0099 e1700381336467

 

స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా “ది ట్రయల్”. ఈ సినిమాను ఎస్ఎస్ ఫిలింస్, కామన్ మ్యాన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “ది ట్రయల్” చిత్రాన్ని టాలీవుడ్ ఫస్ట్ ఇంటరాగేటివ్ ఫిల్మ్ గా దర్శకుడు రామ్ గన్ని రూపొందించారు. స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించారు. సుదర్శన్ రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.

ఇప్పటిదాకా తెలుగు తెరపై చూడని కంప్లీట్ ఇంటరాగేటివ్ కథతో ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇవ్వబోతున్న “ది ట్రయల్” సినిమాను ఈ నెల 24న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.ఇవాళ చిత్ర ట్రైలర్ ను హీరో శ్రీ విష్ణు విడుదల చేశారు.

ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ – “ది ట్రయల్” మూవీ ట్రైలర్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్ గా, ఎంగేజింగ్ గా ఉంది. థ్రిల్లర్ జానర్ సినిమా ఇది. డైరెక్టర్ రామ్ బాగా కథను డీల్ చేశారని ట్రైలర్ తో తెలుస్తోంది. ఈ నెల 24న సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. “ది ట్రయల్” మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. టీమ్ అందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. “ది ట్రయల్” చిత్ర బృందానికి నా బెస్ట్ విశెస్ చెబుతున్నా అని అన్నారు.

Trailer Review:

“ది ట్రయల్” ట్రైలర్ ఎలా ఉందో చూస్తే…సబ్ ఇన్ స్పెక్టర్ మిసెస్ రూప, ఆమె భర్త అజయ్ వాళ్ళ మొదటి మేరేజ్ ఆనివర్సరీ ఒక అపార్ట్మెంట్ మెడపైన ఏకాంతంగా జరుపుకుంటున్నప్పుడు అనుకోని సమయంలో అజయ్ కాలు జారి బిల్డింగ్ పై నుంచి పడి చనిపోతాడు. ఇది మీడియాలో పెద్ద న్యూస్ అవుతుంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్.. రూప తన భర్తను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తుందని అనుమానిస్తాడు. ఆమెను ఇంటరాగేట్ చేస్తాడు. రూప మాత్రం తన భర్తది ఆత్మహత్యేనని గట్టిగా చెబుతుంది. ఇంతకీ అజయ్ ది హత్యా?, ఆత్మహత్యా?, హత్యే అయితే పోలీస్ ఆఫీసర్ అయిన రూప తన భర్తనే ఎందుకు చంపింది అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తి కలిగించింది.

IMG 20231119 WA0098

ట్రైలర్ కలిగించిన క్యూరియాసిటీ థియేటర్స్ కు ప్రేక్షకుల్ని రప్పిస్తుందని “ది ట్రయల్” మూవీ టీమ్ ఆశిస్తోంది. అలాగే ముఖ్యంగా స్పందన పల్లి, యుగ్ రామ్ మరియు వంశీ కోటుల యొక్క నటన చాలా అద్భుతంగా చేశారు. విజువల్స్ పరంగా శ్రీ సాయికుమార్ దార తన కెమెరా యొక్క పనితనాన్ని చాలా అద్భుతంగా చూపించారు.

అదే విధంగా ట్రైలర్ లో వినిపించిన మ్యూజిక్ ను మ్యూజిక్ డైరెక్టర్ శరవణ వాసుదేవన్ చాలా బాగా కంపోజ్ చేస్తూ సినిమాలో ఉండే నేపధ్యగానం పై మరింత ఆసక్తిని పెంచుతున్నారు. ఈ సినిమా యొక్క ట్రైలర్ కి ముఖ్యంగా ఎడిటింగ్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక డైరెక్టర్ రామ్ గన్ని అయితే బయట నిజంగానే జైలర్ అంట. మరి సినిమాల్లోనికి రావాలని ఎందుకు అనిపించిందో గాని, నిజంగానే ఇలాంటి ప్రొఫెషనల్స్ ఇండస్ట్రి కి రావాలి, అప్పుడు సినిమాల్లో వాస్తవికత చాలా బాగుంటుంది.

IMG 20231119 WA0100

నటీనటులు:-

స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు, తదితరులు

టెక్నికల్ టీమ్:

సినిమాటోగ్రఫీ – శ్రీ సాయికుమార్ దారా ,ఎడిటర్ – శ్రీకాంత్ పట్నాయక్. ఆర్,సంగీతం – శరవణ వాసుదేవన్,బ్యానర్స్ – ఎస్ఎస్ ఫిలింస్, కామన్ మ్యాన్ ప్రొడక్షన్స్,కో ప్రొడ్యూసర్ – సుదర్శన్ రెడ్డి,ప్రొడ్యూసర్స్ – స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ,కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం – రామ్ గన్ని,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *