పహల్గాం లో ఉగ్ర‌దాడిని తీవ్రంగా ఖండించిన‌ హీరో కృష్ణ‌సాయి

IMG 20250423 WA0279 e1745422767698

జమ్మూ కశ్మీర్‌ పహల్గాంలో జరిగిన భీకర ఉగ్రదాడి దేశవ్యాప్తంగా విషాద ఛాయలను నింపింది. ఈ ఘటనలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌పై కృష్ణసాయి ఇంట‌ర్నేష‌న‌ల్ చారిట‌బుల్ ట్ర‌స్టు నిర్వ‌హ‌కులు, టాలీవుడ్ హీరో కృష్ణ‌సాయి చ‌లించిపోయారు.

ఈ ఘ‌ట‌న‌పై తీవ్రంగా ఖండించారు. ”అత్యంత క్రూరంగా వెంటాడి చంపారు. ఇండియ‌న్ పార‌మిట‌రీ ఫోర్స్ ఏదో సైలెంట్‌గా ఉంద‌ని ఉగ్ర‌వాదులు అనుకుంటే పొర‌పాటే, భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ గారు చెప్పిన‌ట్టు ప్ర‌పంచం ఆశ్చ‌ర‌పోయేలా భారత్‌ గట్టిబదులిస్తుంది. వారిని వెంటాడి ప్ర‌తీకార చ‌ర్య ఉంటుంది.

శాంతి కోరుకునే దేశాన్ని స‌హ‌నం ప‌రీక్షించేలా వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్దు. మున్ముందు ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా దేశ‌మంతా ఒక్క‌టిగా నిల‌వాలి” అని పిలుపునిచ్చారు.

పహల్గామ్‌ మంగళవారం ఒక్కసారిగా రక్తసిక్తంగా మారింది. పర్వతాల మధ్య ప్రశాంతతను చీల్చిన ఉగ్రవాద దాడి దేశాన్ని శోకసంద్రంలో ముంచింది. ఈ క్రమంలో పర్యాటకం కోసం వెళ్లిన అమాయకుల ప్రాణాలను ఉగ్రదాడి బలితీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *