Tiruveer  Faria Abdullah’s New Movie Opens: రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా షూటింగ్ ప్రారంభం!

IMG 20231024 WA0162 e1698156498662

 

తిరువీర్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రారంభమైంది.కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఈ చిత్రం ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా నిర్మితమవుతోంది.

ప్రముఖ వ్యాపారవేత్త రవి పనస నిర్మాత. ఈ చిత్రంతో గోపి.జి దర్శకుడిగా పరిచయ మవుతున్నారు.  ఈ సినిమా మొదటి షాట్ ను దర్శకుడు వేణు ఉడుగుల డైరెక్ట్ చేయగా, బీ.ఆర్.ఎస్ నాయకులు దాసోజు శ్రావణ్ క్లాప్ కొట్టారు.నిర్మాత రవి పనస కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

IMG 20231024 WA0163

రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25వ తేదీ నుండి మొదలవనుంది. అత్యున్నత సాంకేతికి విలువలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగు తెరపై ఈ సినిమా ఒక గొప్ప ప్రయత్నంగా పేరు తెచ్చుకుంటుందని, ఆడియెన్స్ కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని మూవీ టీమ్ చెబుతున్నారు.

 నటీనటులు:

తిరువీర్, ఫరియా అబ్దుల్లా, రిషి, రవీందర్ విజయ్, షెల్లీ కిషోర్, కాలకేయ ప్రభాకర్, చిరాగ్ జానీ తదితరులు

IMG 20231024 WA0161

 టెక్నికల్ టీమ్:

 

సినిమాటోగ్రఫీ – రాజ్ తోట, మ్యూజిక్ – కె.పి, ప్రొడక్షన్ డిజైనర్ – గాంధీ, ఎడిటర్ – ప్రవీణ్ పూడి, పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా, సమర్పణ – ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ , బ్యానర్ – రవి పనస ఫిలిం కార్పొరేషన్, నిర్మాత – రవి పనస, రచన, దర్శకత్వం – గోపి.జి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *