చిత్రం: టి ల్లు స్క్వేర్
విడుదల తేదీ : మార్చి 29, 2024,
నటీనటులు: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, మురళీ శర్మ, ప్రిన్స్, బ్రహ్మాజీ, మురళీధర్ గౌడ్ తదితరులు,
దర్శకుడు: మల్లిక్ రామ్,
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ & సాయి సౌజన్య,
సంగీత దర్శకులు: రామ్ మిరియాల, అచ్చు రాజమణి, భీమ్స్ సిసిరోలియో,
సినిమాటోగ్రాఫర్: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు,
ఎడిటింగ్: నవీన్ నూలి,
మూవీ: రివ్యూ (Tillu Square Movie Review)
స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ కి తెలుగు ఆడియన్స్ లో యమ క్రేజీ తెచ్చిన చిత్రం DJ టిల్లు. ఆలాంటి టిల్లు కి సీక్వెల్ గా వచ్చిన చిత్రమే “టిల్లు స్క్వేర్”. దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.
ప్రోమోసనల్ కంటెంట్ తో యూత్ టెంప రేచర్ పెంచేసిన ఈ టిల్లు స్క్వేర్ సినిమా ఈ శుక్ర వారమే విడుదల అయ్యింది. తెలుగు సినీ ప్రేక్షకుల అందరి అంచనాలు పెంచేసిన ఈ టి ల్లు స్క్వేర్ అందరి అంచనాలు అందుకుందో లేదో మా 18 F మూవీస్ సమీక్ష చదివి తెలుసుకొందామా !

కధ పరిశీలిస్తే (Story Line):
ఇక ఈ టిల్లు స్క్వేర్ సినిమా కథలోకి వస్తే రాధిక ప్రేమతో మోసపోయిన టిల్లు(సిద్ధు జొన్నలగడ్డ) కొంత కోలుకుని తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి టిల్లు ఈవెంట్స్ స్టార్ట్ చేసి అన్ని రకాల ఫ్యామిలీ ఈవెంట్స్ తో పాటు తన డీజే ఈవెంట్స్ చేస్తుంటాడు. అలా ఓ రోజు తన లైఫ్ లోకి లిల్లీ జోసెఫ్(అనుపమ పరమేశ్వరన్) ఎంటర్ అవుతుంది. లిల్లీ గ్లామర్ కి ఫీదా అయిన టిల్లు లిల్లీ ని ఫ్లర్ట్ చేస్తూ రొమాన్స్ గేర్ వేసి కార్ స్టార్ట్ చేస్తాడు.
ఆ తర్వాత మళ్లీ తన బర్త్ డే స్పెషల్ గా ఫ్రెష్ ప్రాబ్లమ్ తో లిల్లీ తనని సాయం కోరుతుంది. ఆ సహాయం ఏంటా అని చూస్తే కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి కోసం చేస్తున్న ఈవెంట్ కి, లిల్లీ ప్రాబ్లం కి ఒకటే పరిస్కారం కావడం తో తప్పక ఒప్పుకొంటాడు. ఇలా అనుకోని ట్విస్టులు, థ్రిల్స్ తో కధ అనేక మలుపులు తిరుగుతూ క్లైమాక్స్ కి చేరుతుంది.

బర్త్డే రోజు రాధిక వల్ల దెబ్బ తిన్న టిల్లు మళ్ళీ లిల్లీ కోసం ఏం చేస్తాడు?
పేరుమోసిన మాఫియా డాన్ మెహబూబ్ అలీ(మురళీ శర్మ) కి టిల్లు – లిల్లీ లకు ఉన్న లింక్ ఏంటి?
రాధిక(నేహా శెట్టి) టి ల్లు స్క్వేర్ లో ఉందా లేదా?
లిల్లీ (అనుపమ పరమేశ్వరన్) ప్రెగ్నెన్సీకి కారణమేంటి?
మళ్లీ టిల్లు జీవితంలోకి రాధిక (నేహాశెట్టి) ఎలా వచ్చింది?
రాధిక – లిల్లీ ల మద్య సంబంధం ఏమిటి ?
టిల్లు జీవితంలోకి లిల్లీ (అనుపమ పరమేశ్వరన్) వచ్చిన తర్వాత టిల్లు లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది?,
జైలుకు వెళ్లకుండా ఉండాలంటే లిల్లీ అప్పగించిన మిషన్‌ను టిల్లు పూర్తి చేశాడా?
ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నుంచి టిల్లు ఎలా బయటపడ్డాడు ?
వంటి ప్రశ్నలు ఇంటరెస్టింగ్ గా ఉంటే వెంటనే మీకు దగ్గరలో ఉన్న టాకిసు కి వెళ్ళి టిల్లు స్క్వేర్ చూసేయండి.

కధనం పరిశీలిస్తే (Screen – Play):
ఈ చిత్రంలో డెఫినెట్ గా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది కానీ కాన్సెప్ట్ మాత్రం రొటీన్ గానే ఉందని చెప్పాలి. గత పార్ట్ 1 DJ టిల్లు లానే ఈ టి ల్లు స్క్వేర్ సినిమా చాలా తిన్ లైన్ తో సాగుతుంది. కధ గా చెప్పుకొంటే చిన్న పాయింట్ లా ఉన్నా కధనం (స్క్రీన్ – ప్లే తో మ్యాజిక్ చేశారు. కొన్ని సీన్స్ అయితే DJ టిల్లు చూస్తున్న ఫీల్ తో రొటీన్ లైన్ తోనే కొనసాగుతుంది.
చిత్ర క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా ఒకింత రొటీన్ గానే త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ కధనం (స్క్రీన్ -ప్లే) తో ముగిస్తుంది. ఇక్కడ ఇంచకంటే ఎక్కువ కధ- కధనం గురించి వ్రాస్తే, మేకర్స్ కధ మొత్తం వ్రాసేసమని అంటారు కాబట్టి కొన్ని రోజులు తర్వాత ఇంకా వివరంగా వ్రాస్తాము. అప్పుడు మా విశ్లేషణ చదివిదిరిగాని.
ఇంకా కధనం లోకి డీప్ గా వెళ్తే ఓక సీన్ లో అనుపమ రోల్ పై ఇచ్చిన ట్విస్ట్ సినిమాటిక్ గా రొటీన్ గా ఉంది అందరిప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. అలాగే సెకండాఫ్ లో మురళీ శర్మ పాత్ర సంభందం ఉన్న కొన్ని ఎపిసోడ్స్ లో లాజిక్స్ మిస్ అయ్యి రొటీన్ సినినాటిక్ ఫార్మెట్ లోనే ఉంది.
మా లాంటి టెక్నికల్ రివ్యూ రైటర్స్ వ్రాసే లూప్స్, మైనస్ లు పక్కన పెట్టి టాకీసులో కుర్చీని టిల్లు స్క్వేర్ సినిమా చూస్తే మాత్రం అన్ని మార్చిపోయి హాయిగా ఎంటర్టైన్ అవుతారు.

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
దర్శకుడు మల్లిక్ రామ్ విషయానికి వస్తే తను ఈ సినిమాకి ఇంప్రెసివ్ వర్క్ చేశాడు అని చెప్పాలి. ప్రతి సీన్ లోను ఫన్ & హ్యూమర్ మిస్ అవ్వకుండా ఎక్కడ టెంపో తగ్గకుండా పర్ఫెక్ట్ బలన్స్ తో చేశాడు. మల్లిక్ తో పాటుగా సిద్ధూ కూడా ఈ చిత్రానికి రచనలో తన పనితనం చూపించాడు. స్టోరీ పరంగా కొన్ని సీన్లు రొటీన్ గానే ఉన్నాయి కానీ కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మాత్రం ప్రతి సీన్ లోను అందించాడు.
మొదటి పార్ట్ డీజే టిల్లు సినిమా సక్సెస్ కావడానికి కారణమైన స్క్రీన్ ప్లేతోనే టిల్లు స్క్వేర్ సినిమాను కూడా డైరెక్టర్ మల్లిక్ మొదలుపెట్టినప్పటికీ, కొత్త సీన్లు, డైలాగ్స్‌తో మూవీకి కనెక్ట్ అయ్యేలా చేయడంలో డైరెక్టర్ అనుసరించిన విదానం బాగుంది. మెయిన్ గా ఎంటర్టైనింగ్ పరంగా టిల్లు స్క్వేర్ DJ టిల్లు తో పోల్చుకొనే ప్రేక్షకుల అంచనాలు అందుకుంటుంది అని చెప్పవచ్చు.
సినిమా టైటిల్ కార్డ్స్ నుంచే మళ్లీ టిల్లు వైబ్స్ ని గుర్తు చేస్తూ సాలిడ్ ఎంటర్టైన్మెంట్ తో సినిమా సాగుతుంది.
స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ మరోసారి డీజే టిల్లు అద్భుత నటన, డైలాగ్ డెలివరీ తో బాగా ఇంప్రెస్ చేశాడు. తన మార్క్ టైమింగ్ కామెడీతో వన్ లైనర్ డైలాగ్స్ తో ప్రతి సీన్ ని హిలేరియోస్ గా నటించి మెప్పించాడు అని చెప్పాలి. కొన్ని సీన్స్ లో లడ్డు ఫేస్ తో మ్యాన్లీ లుక్స్ తో, సేటైరీకాల్ వాయిస్ మాడ్యులేసన్ తో మంచి ఎంటర్టైనర్ గా నిలిచాడు అని చెప్పవచ్చు.

లిల్లీ అనుపమ పరమేశ్వరన్ గురించి చెప్పాలి అంటే మొదటి పార్ట్ లొని రాధికకి అప్డేటెడ్ వెర్షన్ నా, లేక తనకి అక్క అంటూ సినిమాలో చూపించిన రేంజ్ లోనే అనుపమ సూపర్బ్ రోల్ లో నటించింది. తన గ్లామ్ షో ఒకెత్తు అయితే తన పెర్ఫామెన్స్ కూడా సినిమాలో అదరగొడుతుంది. అలాగే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ పలు కామెడీ సీన్స్ తో యూత్ కి ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునేవారికి ఫుల్ మీల్స్ అన్నట్టు నటించారు.
ఇక వీటితో పాటుగా రెండవ అంకం (సెకండాఫ్) లో ప్రి క్లైమాక్స్ లో ఓ సర్ప్రైజ్ పాత్ర కూడా మామూలుగా ఉండదు. ఆ పాత్ర గురించి ఇక్కడ వ్రాసే కంటే మీరు సినిమాలో చూస్తే ఇంకా థ్రిల్ ఫీల్ అవుతారు.
డాన్ గా కనిపించిన మురళీ శర్మ తన రోల్ కి న్యాయం చేకూర్చారు ఇంకా నటుడు మురళీధర్ గౌడ్ నటన ఆయన కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటాయి. ఇక వీరితో పాటుగా మిగతా తారాగణం అంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
టెక్నికల్ టీం లో రామ్ మిర్యాల, అచ్చు సాంగ్స్ మరియు భీమ్స్ నేపథ్య సంగీతం టిల్లు స్క్వేర్ సినిమా కి బాగా ప్లస్ అయ్యాయి. బీమ్స్ఇచ్చిన BGM అయితే కొన్ని సీన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్ళింది.
సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ మంచి కలర్ ఫుల్ గా బ్యూటిఫుల్ విజువల్స్ తో ఆకట్టుకునేలా ఉంది. మొదటి పార్ట్ DJ టిల్లు కినేయం కు కూడా సాయి ప్రకాష్ పనిచేశాడు కాబట్టి, కధనానికి తగ్గ విజువల్స్ అందించి సినిమా ను కలర్ఫుల్ గా మార్చారు.
నవీన్ నూలి ఎడిటింగ్ కూడా బాగుంది. సినిమా నిడివి మాత్రం బేలన్స్ గా చాలా షార్ప్ గా కట్ చేసిన విధానం బాగుంది. ఇంతకంటే లెంత్ ఎక్కువ అయినా ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారు.
ఈ సినిమాలో చిత్ర నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ అయినట్టు అనిపించదు. సితార ఎంటర్టైన్మెంట్ కి ఈ టిల్లు మంచి బ్రాండ్ వాల్యూ ని క్రియేట్ చేసింది అని చెప్పవచ్చు.

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
హిట్ మిషన్ డీజే టిల్లు కి సీక్వెల్ గా వచ్చిన క్రేజీ రైడ్ “టిల్లు స్క్వేర్” ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో మొదటి సినిమా ని మించి ఉంది అని చెప్పవచ్చు. టి ల్లు గా సిద్ధూ, లిల్లీ గా అనుపమ లు యాక్టింగ్ లో పోటీపడి నటించారు. టైటల్స్ దగ్గర నుండి ఎండ్ వరకూ మంచి కామెడీ డీసెంట్ నరేషన్ తో ఆడియెన్స్ ని ఎంగేజ్ చేసేరు కధ రచయితలు.
కాకపోతే కొన్ని సీన్స్ మితిమీరిని లిప్ లాక్స్ తో యూత్ కి కిక్ ఇచ్చేలా డిజైన్ చేసినా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సీన్స్ లో హిలారియస్ హ్యూమర్ మిక్స్ చేయడం వలన హాయగా నవ్వుకొన్నారు దియేటర్ లొని ఆడియన్స్. ఓవరాల్ గా DJ టిల్లు నుండి వచ్చిన రిపీట్ సీన్స్, స్క్రీన్ -ప్లే రొటీన్ గానే ఉన్నవి పక్కన పెడితే టి ల్లు స్క్వేర్ తో టిల్లు గాడు మంచి క్రేజీ రైడ్ తో కూడిన ఎంటర్టైన్మెంట్ ని థియేటర్స్ లో ఉన్న ఆడియన్స్ కి పంచుతున్నాడు. దియేటర్స్ లో తప్పక చూడవలసిన సినిమా గా ఉంది అని చెప్పవచ్చు.