‘THUGS’ Movie music rights bought at high price by Sony Music ! రా యాక్షన్ ఫిల్మ్ ‘థగ్స్’ మ్యూజిక్ ఆల్బమ్ దక్కించుకొన్న సోనీ మ్యూజిక్

thugs music release by sony music

ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో హిందీ సహా పలు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం థగ్స్. రా యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్న థగ్స్ చిత్రాన్ని రియా షిబు నిర్మాతగా హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఆర్ ఆర్ ఆర్, విక్రమ్, డాన్, వీటికే వంటి పలు బ్లాక్బస్టర్స్ ను డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు, హిందీ చిత్రం ముంబైకర్ తో పాటూ పులి, ఇంకొక్కడు, ఏబీసీడి, సామి స్క్వేర్ వంటి భారీ చిత్రాలు నిర్మించిన శిబు తమీన్స్ కుమార్తె రియా షిబు.

థగ్స్ చిత్రంలో బాబీ సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.
ప్రామిసింగ్ యంగ్ హీరో హ్రిదు హరూన్ లీడ్ రోల్ లో వెండి తెరకు పరిచయం అవుతున్నారు.

thugs movie audio bought by sony music

అమెజాన్ లో వచ్చిన క్రాష్ కోర్స్ సీరీస్ లో తన నటనతో అటు విమర్శకులను ఇటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. త్వరలో విడుదల కానున్న హిందీ చిత్రం మంబైకర్ లో కూడా నటించి, నార్త్, సౌత్ అగ్ర నిర్మాత, దర్శకుల చిత్రాలు చేస్తున్నారు.

థగ్స్ చిత్రం మ్యూజిక్, ప్రోమో కంటెంట్ ను తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో మార్కెటింగ్ చేయడానికి సోనీ మ్యూజిక్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

thugs poster

ఈ మధ్యన విడుదలైన థగ్స్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ వీడియో మంచి బజ్ క్రియేట్ చేసి అందరి ప్రశంసలు అందుకుంది. ఆ వీడియో చిత్రం పై అంచనాలు రెట్టింపు చేసింది.

శామ్ సి ఎస్ సంగీతం, బి జి ఎం అందిస్తుండగా, టాప్ ఎడిటర్, ఈ మధ్య ఆర్ ఆర్ ఆర్ చిత్ర ప్రోమో ఎడిటర్ గా బాగా పాపులర్ అయిన ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. ప్రీయేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

thugs tittle

థగ్స్ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషలలో డిసెంబర్, 2022 లో భారీ స్థాయిలో విడుదలకు సిద్దం అవుతోంది.

నటీనటులు:
హ్రిదు హరూన్, సింహ, ఆర్ కె సురేష్, మునిష్ కాంత్, అనస్వర రంజన్, శరత్ అప్పని మరియు తదితరులు

సాంకేతిక నిపుణులు:

దర్శకత్వం బృంద
నిర్మాణం హెచ్ ఆర్ పిక్చర్స్ – రియా శిబు
సంగీతం – శామ్ సి ఎస్
డీ వో పి – ప్రీయేష్ గురుస్వామి
ప్రాజెక్ట్ డిజైనర్ – జోసెఫ్ నెళ్లికల్
ఎడిటర్ – ప్రవీణ్ ఆంటోనీ
యాక్షన్ – ఫీనిక్స్ ప్రభు, రాజశేఖర్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – ముత్తు కురుప్పయ్య
కాస్ట్యూమ్స్ – మాలిని కార్తికేయన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – యువరాజ్
కో డైరెక్టర్ – హరిహరకృష్ణన్ రామలింగం
డిజైనర్ – కబిలన్
పి ఆర్ ఓ – బి ఏ రాజు’స్ టీం (తెలుగు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *