Thiruveer New Film concept poster out now: తిరువీర్ హీరోగా మూన్‌షైన్ పిక్చ‌ర్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.1 కాన్సెప్ట్ పోస్ట‌ర్ విడుద‌ల‌!

Tiruveer New movie opens e1700931806463

చ‌క్క‌టి హావ భావాలు, న‌ట‌న‌తో యాక్ట‌ర్‌గా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్న తిరువీర్.. ప‌రేషాన్‌, జార్జ్ రెడ్డి, ప‌లాస 1978, మ‌సూద వంటి వైవిధ్య‌మైన చిత్రాల్లో న‌టించి మెప్పించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాల్లో పెర్ఫామెన్స్ ప‌రంగా మెప్పించిన తిరువీర్ సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌శంస‌లు అందుకున్నారు.

Tiruveer New movie opens 2

ప్ర‌స్తుతం మ‌ల్టీపుల్ ప్రాజెక్ట్స్‌తో తిరువీర్ బిజీగా ఉన్నారు. మ‌రిన్ని డిఫ‌రెంట్ ప్రాజెక్ట్స్ పైప్‌లైన్‌లో ఉన్నాయి. ఈ క్ర‌మంలో తిరువీర్ కొత్త సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. మూన్ షైన్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై సాయి మ‌హేష్ చందు, సాయి శ‌శాంక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ్ విరాట్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. ద్రిష్టి త‌ల్వార్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Tiruveer New movie opens 1

రెండు వేర్వేరు ప్ర‌పంచాలు క‌ల‌యిక‌గా యూనిక్‌నెస్‌ తో కాన్సెప్ట్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. డార్క్ కామెడీ జోన‌ర్‌లో ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌ని నిర్మాత‌లు తెలిపారు. తిరువీర్ మ‌రో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో మెప్పించ‌నున్నారు. త్వ‌ర‌లోనే షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ స‌భ్యులు తెలిపారు. లియోన్ జేమ్స్ సంగీత సార‌థ్యం వ‌హించ‌నున్న ఈ చిత్రానికి సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఛోటా కె.ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేయ‌నున్నారు.

న‌టీన‌టులు:

తిరువీర్‌, ద్రిష్టి త‌ల్‌వార్‌

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్‌: ఏ మూన్‌షైన్ పిక్చ‌ర్స్ , నిర్మాత‌లు: మ‌హేష్ చందు, సాయి శ‌శాంక్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: రాజ్ విరాట్‌, మ్యూజిక్: లియోన్ జేమ్స్‌, సినిమాటోగ్ర‌ఫీ: సుజాత సిద్ధార్థ్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రామ్ అర‌స‌విల్లి, ఎడిట‌ర్‌: ఛోటా కె.ప్ర‌సాద్‌, కాస్ట్యూమ్స్‌: సంతోష్ కుమార్‌, పి.ఆర్‌.ఒ: వంశీ కాకా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *