Thika Maka Thanda Movie Trailer out: తికమకతాండ సినిమా ట్రైలర్ లాంచ్ చేసిన విక్రమ్ కె కుమార్

IMG 20231204 WA0188 e1701798935959

 

దర్శకుడు విక్రమ్ కె కుమార్ గారి చేతుల మీదగా తికమకతాండ సినిమా ట్రైలర్ లాంచ్ అయ్యింది. తికమక తండా దర్శకుడు వెంకట్ హీరోలు హరికృష్ణ, రామకృష్ణ హీరోయిన్లు యాని, రేఖ నిరోష విక్రమ్ కె కుమార్ గారిని కలిసి ట్రైలర్ చూపించి ట్రైలర్ లాంచ్ చేయించారు. ట్రైలర్ చూసిన విక్రమ్ కె కుమార్ గారు మూవీ టీం ని అభినందించారు.

IMG 20231204 WA0169

ఈ తిక మక తండ మూవీ నుంచి ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్ మరియు టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అతి త్వరలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించడానికి మూవీ టీం సిద్ధమయ్యారు. తికమకతాండ సినిమా ను డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

IMG 20231201 WA0091

విక్రమ్ కె కుమార్ గారు మాట్లాడుతూ : ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వెంకట్ ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. హరికృష్ణ, రామకృష్ణ, యాని మరియు రేఖ నిరోష లకు ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలి. అలాగే వెంకట్ కి సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

IMG 20231204 WA0047

తారాగణం :

హరికృష్ణ, రామకృష్ణ , యాని , రేఖ నిరోష,

సాంకేతిక వర్గం:

 

నిర్మాత : తిరుపతి శ్రీనివాసరావు,దర్శకుడు : వెంకట్,నిర్మాణం: టి ఎస్ ఆర్ మూవీమేకర్స్,కథ : నిరూప్‌కుమార్‌,డి ఓ పి : హరికృష్ణన్,ఎడిటర్ : కుమార్ నిర్మలాసృజన్,సంగీత దర్శకుడు : సురేష్ బొబిల్లి,పి ఆర్ ఓ : మధు వి ఆర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *