Thika Maka Thanda Movie Release update: తికమకతాండ సినిమా విడుదల ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడంటే !

thikamaka tanda movie review 4 e1702544219101

ఊరందరికీ మతిమరుపు అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తున్న సినిమా తికమకతాండ. ఆ ఊరికి ఒక అమ్మవారు ఉండడం అమ్మవారి విగ్రహం మాయమవడం తిరిగి ఊరు వారు ఆ విగ్రహాన్ని పట్టుకున్నారా లేదా అనే కథాంశం. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ ట్రైలర్ అన్నిటికీ మంచి స్పందన లభిస్తోంది.

thikamaka tanda movie review 2

నిర్మాత తిరుపతి శ్రీనివాస్ మాట్లాడుతూ : ట్విన్స్ రామ్ హరి హీరోలుగా ఒక కొత్త ప్రయోగంతో ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది. వేరే బిజినెస్ లు చేస్తున్న మా పిల్లలకి సినిమా పైన ఉన్న మక్కువతో వెంకట్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాని నిర్మించాం. ఊరందరికీ మతిమరుపు అనే ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకుని వచ్చాడు. మనందరికీ తెలుసు ఊరంతా మతిమరుపు ఉంటే ఎలా ఉంటుంది వాళ్ళు పడే ఇబ్బందులు బాధలు ఎలా ఉంటాయి.

thikamaka tanda movie review

ఈ సిన్మా కామెడీగా ఉంటూనే మంచి ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమా ఇది. చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యి రాజన్న సినిమాతో పేరు తెచ్చుకున్న యాని మరియు రేఖా నిరోష ఈ సినిమాలో హీరోయిన్ లు గా చేయడం జరిగింది. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరి నుండి డిఓపి హరికృష్ణన్ వర్క్ చాలా బాగుంది అన్న ప్రశంసలు వచ్చాయి. ధైర్యంగా మేము ముందడుగు వేసి డిస్ట్రిబ్యూటర్స్ కి సినిమా చూపించగా వారికి సినిమా చాలా నచ్చింది. టీ ఎస్ ఆర్ మూవీ మేకర్స్ చిత్రీకరించిన తికమక తండా సినిమాని డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము అన్నారు.

thikamaka tanda movie review 5

దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ : నన్ను నా కథని నమ్మి నాకు అవకాశం ఇచ్చిన తిరుపతి శ్రీనివాస్ రావు గారికి కృతజ్ఞతలు. హీరోలు హరికృష్ణ, రామకృష్ణ హీరోయిన్లు యాని, రేఖ చాలా బాగా నటించారు. మ్యూజిక్ చాలా బాగా వచ్చింది సిద్ శ్రీరామ్ పాడిన పాట సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. తెలంగాణలోని ఒక మంచి విలేజ్ నెట్వర్క్ లేని చోట అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సినిమాని చిత్రీకరించాం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి మంచి స్పందన వస్తుండడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ నెల 15న థియేటర్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న మా సినిమాని ప్రేక్షకులు అందరూ చూసే ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.

thikamaka tanda movie review 3

తిరుపతిసత్యం సమర్పించిన ఈ చిత్రానికి నిర్మాణం: టి ఎస్ ఆర్ మూవీమేకర్స్, నిర్మాత : తిరుపతి శ్రీనివాసరావు
దర్శకుడు : వెంకట్, తారాగణం : హరికృష్ణ, రామకృష్ణ , యాని , రేఖ నిరోష, శివన్నారాయణ, రాకెట్ రాఘవ, యాదమ రాజు, భాస్కర్, కథ : నిరూప్‌కుమార్‌, డి ఓ పి : హరికృష్ణన్, ఎడిటర్ : కుమార్ నిర్మలాసృజన్, సంగీత దర్శకుడు : సురేష్ బొబ్బిలి , పి ఆర్ ఓ : మధు వి ఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *