Theppa Samudram Movie Song Out: చైతన్య రావు నటించిన ‘తెప్ప సముద్రం’ నుండి పెంచల్ దాస్ పాడిన పాట విడుదల !

IMG 20240324 WA0060 e1711281951430

చైతన్య రావు, అర్జున్ అంబటి హీరోలుగా, కిశోరి దాత్రక్ హీరోయిన్ గా రవిశంకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తెప్ప సముద్రం. సతీష్ రాపోలు దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి పి. ఆర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ చిత్రం నుండి పెంచల్ దాస్ రాసి, పాడిన “నా నల్లా కలువా పువ్వా” సాంగ్ MRT మ్యూజిక్ ద్వారా విడుదల చేసారు. కొంతమంది మృగాల చేతిలో అమ్మాయిలు ఎలా బలైపోతున్నారో వారికోసం కుటుంబం పడుతున్న బాధలు, రోదనలు ఈపాటలో మనసుని కదిలించేలా చూపించారు. సాంగ్ ఆద్యంతం చాలా ఎమోషనల్ గా సాగింది.

IMG 20240324 WA0059

నిర్మాత రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ… దర్శకుడు సతీష్ చెప్పిన కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా అవుట్ ఫుట్ చూసాను. చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు కూడా మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

దర్శకుడు సతీష్ రాపోలు మాట్లాడుతూ… తెప్ప సముద్రం చిత్రం చాలా బాగా వచ్చింది. మా నిర్మాత రాఘవేందర్ గారు ఎక్కడా కంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలో మీ ముందుకు వస్తుంది. ప్రేక్షకులు నచ్చే మంచి కమర్షియల్ చిత్రం అవుతుంది”అన్నారు

నటీనటులు:

చైతన్య రావు, అర్జున్ అంబటి, కిశోరి దాత్రక్, రవిశంకర్

టెక్నికల్ టీం: 

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సతీష్ రాపోలు, నిర్మాత: నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్, బ్యానర్: శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్, సంగీతం: : పి.ఆర్ , డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: శేఖర్ పోచంపల్లి, ఎడిటర్: సాయిబాబు తలారి, మాటలు : శ్రా 1 , పీఆర్వో: తేజస్వీ సజ్జా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *