ది సస్పెక్ట్ అంటూ సస్పెన్స్ నీ పెంచడానికి రెఢీ అయిన క్రైమ్ థ్రిల్లర్ ! 

IMG 20250310 WA0002 e1741568527943

ది సస్పెక్ట్ తెలుగు చిత్రం మార్చి 21న ప్రపంచ వ్యాప్తం గా రిలీజ్ కాబోతుంది, ఈ సందర్భం గా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టరు ను సూపర్ హిట్ డైరెక్టర్ *విఎన్ ఆదిత్య* చేతుల మీదగా లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా వి.ఎన్ ఆదిత్య మాట్లాడుతూ అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే తో సస్పెన్స్ థ్రిల్లర్ మరియు క్రైమ్ మూవీ అయినటువంటి ది సస్పెక్ట్ చిత్రం కచ్చితంగా మంచి హిట్ కొడుతుంది. కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కించడం చాలా ఆనందమని కొనియాడారు.

IMG 20250310 WA0001

క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం లో రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ తదితరులు నటించారు

ఈ సినిమాకి రాధాకృష్ణ గర్నెపూడి దర్శకత్వం వహించగా టెంపుల్ టౌన్ టాకీస్ బానర్ మీద నిర్మించారు .క్రైమ్ థ్రిల్లర్ లో విభిన్నమైనటువంటి కోణంలో ప్రత్యేక పరిశోధన బృందం ఒక క్రైమ్ ని ఎలా కనుక్కున్నారు అని దర్శకుడు తన ప్రతిభతో అద్భుతంగా తెరకెక్కించారు.

కిరణ్ కుమార్ నిర్మాతగా టెంపుల్  టౌన్ టాకీస్ సమర్పణలో రాబోతున్న
ది సస్పెక్ట్ చిత్రం ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుంది అని చిత్ర యూనిట్ తెలియచేసారు .

ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన కెమెరామెన్ రాఘవేంద్ర, మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల్ క్రిష్, ఎడిటర్ ప్రవీణ్ ప్రతిభ చిత్రంలో కనబడుతుంది.

ఈ చిత్రాన్ని ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర మరియు తెలంగాణలో గ్రాండ్ గా మార్చి 21న విడుదల చేయబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *