చిత్రం: ది షార్ట్ కట్,
విడుదల తేదీ : నవంబర్ 08, 2024,
నటీనటులు :అట సందీప్, షాజ్ఞ శ్రీ , ఈటీవీ ప్రభాకర్, హైదరాబాద్ నవాబ్ ఇస్మాయిల్, కాదంబరి కిరణ్, డిజె టిల్లు మురళి గౌడ్, బల్వీర్ సింగ్, రాకేష్ మాస్టర్, అభినవ్, వీరు తదితరులు,
డైరెక్టర్ : కంచి రామకృష్ణ,
ప్రొడ్యూసర్ : రంగారావు తోట, రజనీకాంత్ పున్నాపు ,
సినిమాటోగ్రఫీ : ఎస్ ఎన్ మీరా,
మ్యూజిక్ : ఆర్ఆర్ ధ్రువన్ ,
ఎడిటింగ్ : అమర్ రెడ్డి కుడుముల,
మూవీ: ది షార్ట్ కట్ రివ్యూ (The Shortcut Movie Review)
అట సందీప్, షాజ్ఞ శ్రీ హీరో హీరోయిన్లుగా శ్రీమతి కంచి షర్మిల సమర్పించు డిఎల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రంగారావు తోట, రజనీకాంత్ పున్నాపు నిర్మాతలుగా కంచి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ది షార్ట్ కట్’ విజయానికి అడ్డదారులు ఉండవు అనేది ఉప శీర్షిక.
ఆట సందీప్ ని వెండి తెరకు హీరో గా పరిచయం చేస్తూ చేసిన చక్కని కధ ఈ ది షార్ట్ కట్ మూవీ. సింపుల్ గా చెప్పాలి అంటే విజయానికి అడ్డదారులు ఉండవు అనే కాన్సెప్ట్ తో తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎదగాలనుకునే ఒక యువకుడి కథ ఈ ది షార్ట్ కట్ మూవీ. ఈ మూవీ ఎన్నో చిన్న చిత్రాల పోటీ మద్యలో ఈ శుక్రవారమే విడుదల అయ్యింది.

కధ పరిశీలిస్తే (Story Line):
సినిమా డైరెక్టర్ గా ఎదగాలి అన్న కోరికతో ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లను కలిసి కథలు చెబుతూ ఉంటాడు హీరో ప్రకాష్(ఆట సందీప్). హీరోయిన్ దివ్య (షాజ్ఞ శ్రీ) ని ప్రేమిస్తాడు. సినిమా, డైరెక్షన్ వర్కౌట్ అవ్వదు నువ్వు ఉద్యోగం చేస్తే తప్ప మనిద్దరికీ పెళ్లి అవ్వదు అంటూ ప్రకాష్ వెంటపడుతుంది దివ్య. కానీ కచ్చితంగా డైరెక్టర్ అయి తీరుతాను అనకసితో ఉంటాడు ప్రకాష్.
ప్రకాష్ తన స్నేహితుడు టెస్టర్(బల్వీర్ సింగ్) తో కలిసి ప్రొడ్యూసర్ల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా హైదరాబాదులో డ్రగ్స్ మాఫియా గురించి తెలుసుకున్న పోలీసులు ఆ మాఫియాని అంతం చేసే ప్రయత్నంలో ఉంటారు. అలాంటి తరుణంలో ఆ డ్రగ్స్ ఉన్న బ్యాగ్ ప్రకాష్ చేతికి అందుతుంది.
ఆ డ్రగ్స్ ని అమ్మి డబ్బు సంపాదించి తనే నిర్మాతగా సినిమా తీయాలనుకుంటాడు ప్రకాష్. కానీ అనుకోకుండా ఆ కేసులో డ్రగ్స్ మాఫియా డాన్ కు చిక్కుతాడు.
ఆ డాన్ చేతి నుంచి హీరో బయటపడ్డాడా లేదా?,
తను అనుకున్నట్టుగా సినిమా తీశాడా లేదా?,
అనే ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలి అంటే ‘ది షార్ట్ కట్’ సినిమా వెంటనే వెళ్ళి దియేటర్ లో చూడాల్సిందే. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమా లాగే ఈ సినిమా కూడా పార్ట్ 2 ని ప్లాన్ చేశారు.

కధనం పరిశీలిస్తే (Screen – Play):
చిన్న సినిమా అయినా ప్రొడ్యూసర్లు రంగారావు తోట మరియు రజినీకాంత్ పున్నాపు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి సినిమాని నిర్మించారు. మొదటిసారి అయినా మంచి కథ ఎంచుకుని కంచి రామకృష్ణ దర్శకత్వ ప్రతిభను చూపించారు.
దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
కంచి రామకృష్ణ దర్శకత్వ ప్రతిభ ఈ ది షార్ట్ కట్ మూవీ ద్వారా బయటపడింది. రామ కృష్ణ కి ఈ సినిమా దర్శకత్వం వహించడం మొదటిసారే అయినా ఎక్కడ తడబాటు లేకుండా చాలా చక్కగా తీశారు.
మనందరికీ మంచి డాన్సర్ గా తెలిసిన ఆట సందీప్ లోని నటుడు ఈ సినిమాలో కనిపిస్తాడు. డైరెక్టర్ అయ్యి తన ప్రేమను పొందాలి అనే తపన ఉన్న కుర్రాడిగా చాలా బాగా నటించాడు.
హీరోయిన్ షాజ్ఞ శ్రీ నటన క్యారెక్టర్జషన్ బాగున్నాయి. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈటీవీ ప్రభాకర్ గారి నటన అదే విధంగా డ్రగ్స్ మాఫియా కు సంబంధించి లోకల్ డాన్ క్యారెక్టర్ లో రాకేష్ మాస్టర్ నటన ప్రేక్షకులను అలరిస్తాయి.
ఈటీవీ ప్రభాకర్, హైదరాబాద్ నవాబ్ ఇస్మాయిల్, కాదంబరి కిరణ్, డిజె టిల్లు మురళి గౌడ్, బల్వీర్ సింగ్, రాకేష్ మాస్టర్, అభినవ్, వీరు ఇతర ముఖ్యపాత్రలో నటించారు.

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
ఆర్ఆర్ ద్రువన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలైట్. ఎస్ ఎన్ మీరా సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది.
శ్రీమతి కంచి షర్మిల సమర్పణలో డిఎల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రంగారావు తోట, రజనీకాంత్ పున్నాపు నిర్మాతలుగా మంచి సినిమా నే నిర్మించారు.
18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
సినిమా ఆద్యంతం మంచి థ్రిల్లర్ గా ప్రేక్షకులను అలరిస్తుంది. కథ కథనాలు నటీనటుల పాత్రలు ఎక్కడా బోర్ కొట్టకుండా బాగా డిజైన్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది.
నటీనటుల పాత్రలు, నటన చాలా బాగా వచ్చాయి. అక్కడక్కడ సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ అనిపించినా ఎక్కడ బోర్ కొట్టకుండా చూసుకున్నారు.