డిసెంబర్ 2 న గ్రాండ్ రిలీజ్ తో ప్రేక్షకుల ముందుకు “దోస్తాన్” సినిమా

dostan movie release date fixed e1669635536529

శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై సిద్ స్వరూప్ , కార్తికేయ , ఇందు ప్రియ, ప్రియ వల్లబి నటీనటులుగా సూర్య నారాయణ అక్కమ్మగారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “దోస్తాన్ “. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 2 న గగ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా

dostana ఫిల్మ్ poster release by హరీష్ రావు
చిత్ర దర్శక, నిర్మాత సూర్యనారాయణ అక్కమ్మగారు మాట్లాడుతూ..సిద్ స్వరూప్ అందించిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను. తుని, లంబసింగి, తలకోన, వరంగల్, హైదరాబాద్, వైజాగ్, కాకినాడ పోర్ట్ తదితర ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో ఫైట్స్ రియలిస్టిక్ గా ఉంటాయి.

dostana ఫైట్

అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా తెరకేక్కిన ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్ తో పాటు, లవ్, ఫ్రెండ్షిప్ ఇలా మూడు జోనర్స్ మీద తీసిన ఈ సినిమా చూసిన వారందరికీ తప్పకుండా నచ్చుతుంది.

dostana team

నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది. ఇంతకుముందు హరీష్ రావు విడుదల చేసిన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇండస్ట్రీలో పెద్దలందరూ కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేశారు.

dostan movie working stills 5

ఇప్పుడు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా త్వరలో చేయబోతున్నాము.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 2న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న మా సినిమాకు ఏపీ తెలంగాణ లలో మంచి థియేటర్లు దొరుకాయి.

dostan movie working stills 4

గతంలో మమ్మల్ని, మా సినిమాలను ఆదరించినట్లే ఇప్పుడు వస్తున్న మా “దోస్తాన్” సినిమా కూడా ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

dostan movie working stills 8
నటీ నటులు
సిద్ స్వరూప్ , కార్తికేయ, ఇందు ప్రియ, ప్రియ వల్లబి తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్
దర్శక, నిర్మాత సూర్యనారాయణ అక్కమ్మగారు
మ్యూజిక్ : ఏలెందర్ మహావీర్
డి. ఓ. పి : వెంకటేష్ కర్రి, రవి కుమార్
ఎడిటర్ : ప్రదీప్ చంద్ర
పి . ఆర్ ఓ : మధు వి. ఆర్
ఫైట్ మాస్టర్ : విక్కీ, అజయ్
అసిస్టెంట్ డైరెక్టర్ : కౌసిక్ కాయల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *