The Marvels Spl Promo Launched by Samantha: సూపర్ స్టార్ సమంత అభిమానుల కోసం ‘ది మార్వెల్స్’తో జతకట్టింది ! 

IMG 20231103 WA0098 e1699009637203

 

ఈ దీపావళికి, ఈ పండుగ సీజన్లో గొప్ప యాక్షన్, అడ్వెంచర్ మరియు పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ను అందించడానికి సిద్ధంగా ఉన్న, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మార్వెల్ స్టూడియోస్ యొక్క ది మార్వెల్స్ నవంబర్ 10న విడుదల కానుండగా, మరింత ఉన్నతంగా పండుగను సెలెబ్రేట్ చేసుకునే సమయం వచ్చింది!

ఈ సంవత్సరం అతి పెద్ద దీపావళి చిత్రాలలో ఒకటైన దీని పై అంచనాలు ఎక్కువగా ఉండటంతో, సూపర్ స్టార్ సమంత హైదరాబాద్ లో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్లో భారతీయ అభిమానుల కోసం పత్ర్యేక వీడియోను విడుదల చేసి అభిమానులలో జోష్ పెంచారు.

IMG 20231103 WA0097

అలాగే దానికి సంబంధించి దేశవ్యాప్తంగా రేపు, నవంబర్ 4న అన్ని ఫార్మాట్లలో ముందస్తు బుకింగ్లు ప్రారంభమవుతాయని పక్రటించారు!

2019 బ్లాక బస్టర్ హిట్ ‘కెప్టెన్ మార్వెల్’ కోసం మార్వెల్ స్టూడియోస్ తో ఆమె చిరస్మరణీయ అనుబంధం తర్వాత, ఎల్లప్పుడూ నిజమైన బ్లూ సూపర్ హీరో అభిమాని అయిన సమంత, సినిమా కోసం తన ఉత్సాహాన్ని తన అసమానమైన శైలిలో ప్రేక్షకులతో పంచుకుని, వారిని స్వాగతించడానికి తిరిగి వచ్చింది.

IMG 20231103 WA0096

సమంత హైదరాబాద్ లో ‘ది మార్వెల్స్ ‘ కోసం పత్ర్యేక వీడియోను ఆవిష్కరించినప్పు డు, ఆమెతన సూపర్ హీరో గురించి తన ఎక్సైట్మెంట్ను తెలియజేసింది మరియు వారి సినిమా పై తమకున్న అభిమానాన్ని చాటుకోవడానికి సినిమా పాతల్ర గెటప్ లలో వచ్చిన పత్ర్యేక అభిమానుల తో పవర్-పోజ్ ఇచ్చింది!

ది మార్వెల్స్ గురించి మరియు కెప్టెన్ మార్వెల్ పట్ల తనకున్న ప్రేమను పంచుకుంటూ సమంత, “కెప్టెన్ మార్వెల్ ఎప్పుడూ నాకు అత్యంత ఇష్టమైన సూపర్ హీరో మరియు అవెంజర్, ఈ ఎపిక్ దీపావళి ఎంటర్టైనర్ కోసం మరోసారి మార్వెల్ ఇండియా తో జతకట్టడానికినేను థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నా ను. ఒకరు కాదు ముగ్గురు శక్తివంతమైన సూపర్ హీరోలు ఈసారి చెడుపై మంచి సాగించే అంతిమ యుద్ధంలో పోరాడుతున్నారు!

IMG 20231103 133152

మార్వెల్స్ సినిమా థియేటర్ లలో ఎపిక్ యాక్షన్-ప్యా క్డ్ ఎంటర్టైనింగ్ రైడ్ లాగా మనకు ముందుకు వస్తుంది మరియు ఈ దీపావళికి పెద్ద స్క్రీన్ పైనే చూడటానికి నేను ఉత్సహంగా ఎదురుచూస్తున్నా ను!” అని అన్నా రు.

 

మార్వెల్ స్టూడియోస్ యొక్క “దిమార్వెల్స్ ” ఈ దీపావళికి నవంబర్ 10న ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో భారతీయ థియేటర్ల లోకి వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *