చిత్రం: The Goat Life (ఆడు జీవితం)
విడుదల తేదీ : మార్చి 28, 2024,
నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, అమలా పాల్, జిమ్మీ జీన్-లూయిస్, KR గోకుల్, తాలిబ్ అల్ బలూషి మరియు రిక్ అబీ తదితరులు..,
దర్శకుడు: బ్లెస్సీ,
నిర్మాతలు: బ్లెస్సీ, జిమ్మీ జీన్-లూయిస్, స్టీవెన్ ఆడమ్స్,
సంగీత దర్శకులు: ఏ ఆర్ రెహమాన్,
సినిమాటోగ్రాఫర్: సునీల్ కె.ఎస్,
ఎడిటింగ్: ఎ. శ్రీకర్ ప్రసాద్
మూవీ: ఆడు జీవితం రివ్యూ ( The Goat Life Movie Review)
మళయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బ్లేస్సి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ The Goat Life (ఆడు జీవితం). తెలుగులో ఈ సినిమా మైత్రి మూవీస్ ద్వారా ఈ రోజు విడుదలైంది.
మరి ఈ చిత్రం, తెలుగు ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో మా 18F మూవీస్ టీమ్ సమీక్ష చదివి తెలుసుకుందామా!.
కధ పరిశీలిస్తే (Story Line):
నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) పెద్దగా చదువు కొకపోయినా మట్టి చేస్తూ తన తల్లి, భార్య సైను (అమలా పాల్)తో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. ఈ జీవితం కంటే ఇంకా మంచి జీవితం గడపాలని తన ఫ్రెండ్ సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించుకుని రావాలని నిర్ణయించుకుంటాడు.
ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగవీసా మీద దుబాయ్ వెళ్తాడు. దీంతో, అక్కడ నజీబ్ ఓ ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు.
నజీబ్ ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారిలో తీసుకువెళ్ళి పడేస్తారు.
ఆ ఎడారి లొ నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు?,
అక్కడి ఖలిఫ్ లు మనుషులను ఎలా వాడుకుంటారు?
నజీబ్ తన కుటుంబం దగ్గరకి చేరుకోవడానికి ఎన్ని అవరోధాలు దాటాడు ?,
అక్కడ ఉన్న కాలంలో నజీబ్ ఎలా మారిపోయాడు?,
అతని శరీర ఆకృతి ఎలా అయిపోయింది ?
గొర్రెలు, ఒంటుల మధ్య మనిషి జీవితం ఎలా ఉంటుంది ?
మనుషులు లేని ఎడారిలో జంతువుల మద్య జీవితం ఎలా?
చివరకు నజీబ్ తన ఫ్యామిలీ నీ కలిసాడా? లేదా?
అనేది మిగిలిన కథ. ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. తప్పక బిగ్ స్క్రీన్ మీద చూడవలసిన సర్వ్వేవల్ స్టోరీ.
కధనం పరిశీలిస్తే (Screen – Play):
ఆడు జీవితం నిజంగా జరిగిన చరిత్ర. నజీబ్ అనే వలస కార్మికుడు కేరళ నుండి సౌదీ వెళ్ళి అక్కడ ఎడారిలో చిక్కుకొని, కొన్ని సంవత్సరాలు ఎడారిలో దారి తప్పి తిరుగుతూ క్షేమంగా సొంత ఇంటి కి చేరుకొన్న కార్మికుడి కథను ఒక నవలా రచిత నవలగా వ్రాస్తే కొన్ని రోజులలోనే కేరళ అంత పాపులర్ అయ్యింది. కొన్ని వేల కాపీలు అమ్ముడయ్యాయి.
ఆ ఆడు జీవితం (The Goat Life) నవల ను సినిమా కధ గా మార్చిన థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో అద్భుత మైన కథనం (స్క్రీన్ ప్లే) తో దర్శకుడు ఆకట్టుకున్నాడు. కొన్ని సన్నివేశాల్లో మాత్రం కథకు తగినట్టుగా నెమ్మదిగా సాగింది.
దర్శకుడు బ్లెస్సీ స్లో గా సాగే ఎడారి ప్రాంతంలో ఉన్న సీన్స్ తగ్గించి ఇతర మనుషుల స్ట్రగుల్స్ కూడ యాడ్ చేసి ఉంటే ఎంతో హుద్రేకంగా సాగేది. అలాగే సినిమా లోనీ ఎక్కువ సీన్స్ నజీబ్ పాత్ర తోనే ట్రావెల్ చేయడం వలన ఎక్కువ సీన్స్ స్లో గా డ్రైవ్ చేశాడు అనిపిస్తుంది. దర్శకుడు ఎక్కువగా నవల నీ ఫాలో అయినట్టు ఉంది..
పైగా సినిమాలోని మెయిన్ ఎమోషన్ని కూడా అంతే ఎఫెక్టివ్ గా ఎలివేట్ చేయలేక పోయాడు. పైగా ఈ ఆడు జీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకోవు. ఓవరాల్ గా కీలక సీన్స్ బాగానే ఉన్నా కథనాన్ని మాత్రం ముందుకు నడిపించవు.
కొన్ని స్లో సీన్స్ వలన సినిమా లెంగ్త్ కూడా పెరిగి సినిమాకి మరో మైనస్ పాయింట్ గా నిలుస్తోంది. మొత్తానికి పృధ్వీరాజ్ సుకుమార్ అద్భుత నటనతో ఈ కధ నీ అద్భుత దృశ్య కావ్యం గా మలచినట్టు ఉంది.
దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
దర్శకుడు బ్లెస్సీ మంచి సోషల్ మెసేజ్ ఉన్న అద్భుత కధ నీ చక్కగా తెరకెక్కించాడు అని చెప్పవచ్చు. చదువ, అవగాహన లేకుండా దొంగ వీసాల పై దుబాయ్ వెళ్లేవారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ?, ఎంత దయనీయ స్థితిలో వారి బతుకులు మారిపోతాయి? లాంటి వాస్తవ పరిస్థితులను వెండితెరపై ఆవిష్కృతం చేయడానికి దర్శకుడు బ్లెస్స తీసుకున్న జాగ్రత్తలు..
ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గరనుంచీ.. అక్కడ పాత్రల వేష భాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం దర్శకుడి మేదో సంపత్తికి నిదర్శనంగా నిలుస్తోంది.
అలాగే హీరోహీరోయిన్ల మధ్య ఏమోషన్ని.. ఇలా ప్రతిది దర్శకుడిగా బ్లెస్సీ చాల చక్కాగా చుపించగలిగాడు
పృథ్వీరాజ్ సుకుమారన్ తన సహజ నటనతో ఆకట్టుకొనే ప్రయత్నం చేసాడు. తన పాత్ర తాలూకు జర్నీ సన్నివేశాలు, అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి.
ఇక ఎడారి నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్.. అదే విధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్ గా బాగానే కనెక్ట్ అవుతాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది. తన హావభావాలతో ఆయన చక్కగా నటించాడు.
హీరోయిన్ గా అమలా పాల్ ఆకట్టుకుంది. అలాగే ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించిన జిమ్మీ జీన్-లూయిస్, KR గోకుల్, తాలిబ్ అల్ బలూషి మరియు రిక్ అబీ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు
సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
ఏ ఆర్ రెహమాన్ అందించిన సంగీతం బాగుంది.
తనదైన స్టైల్ BGM తో కొన్ని స్లో సీన్లు కూడా ఎంతో అద్భుతంగా మలిచారు. సిట్యువేసనల్ సాంగ్స్ కూడా స్క్రీన్ మీద బాగున్నాయి.
సునీల్ కె.ఎస్ సినిమాటోగ్రఫీ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు.
ఎడిటర్ ఎ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగున్నా, సినిమాలోని కొన్ని సీన్లు సాగతీత తగ్గించి ఉంటే.. సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. సినిమా నిడివి ఎక్కువ అయినట్టు ఉంది.
విజువల్ రొమాన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.
18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
గల్ఫ్ లో ఉద్యోగాలు ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనీ దొంగ ఏజెంట్ల ద్వారా దుబాయ్ కి వెళ్లి మోసపోయిన నజీబ్, ఎడారిలో ఎన్నో కష్టాలు అనుభవించి తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగిన జర్నీ నే ఈ ఆడు జీవితం కధ.
ఎమోషనల్ గా కొన్ని చోట్ల బాగానే ఆకట్టుకుంది. అలాగే సినిమాలోని టేకింగ్, నటీనటుల నటన బాగున్నాయి. అయితే, స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగడం, ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం, కొన్ని చోట్ల పేలవమైన కథనం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.
కానీ, పృథ్వీరాజ్ సుకుమారన్ తన నటనతో చాలా బాగా మెప్పించాడు. కాకపోతే, సినిమా మాత్రం పూర్తి స్థాయిలో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది అనీ చెప్పలేము.
సినిమా అనేది ఆర్ట్ ఫామ్ గా చూస్తే మాత్రం, ఈ ఆడు జీవితం నిజంగా గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సినిమా స్టార్ట్ అయిన 15, 20 నిముషాలలో మనల్ని ఎడారి ప్రాంతంలో కి తీసుకుపోతుంది. నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చె నటనతో పృధ్వీరాజ్ సుకుమార్ నటించి జీవించాడు అనీ చెప్పవచ్చు.
చివరి మాట: తప్పక బిగ్ స్క్రీన్ మీద చూడవలసిన చిత్రం.!
18F RATING: 3.5 / 5
* కృష్ణ ప్రగడ.