The GirlFriend Movie Opening: నేషనల్ క్రష్ రశ్మిక మందన్న లీడ్ రోల్ లో “ది గర్ల్ ఫ్రెండ్” మూవీ ప్రారంభం!

IMG 20231128 WA0066 e1701153745934

 

అనౌన్స్ మెంట్ నుంచే సినీ ప్రియుల్లో ఆసక్తిని కలిగించింది నేషనల్ క్రష్ రశ్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

IMG 20231128 WA0068

చి.ల.సౌ, మన్మథుడు 2 చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుతున్న రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మాతలు. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ఇవాళ కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది.

IMG 20231128 WA0060

“ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా, స్టార్ డైరెక్టర్ మారుతి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. సెన్సేషనల్ డైరెక్టర్ సాయి రాజేశ్ ఫస్ట్ షాట్ కు దర్శకత్వం వహించారు. వైవిధ్యమైన ప్రేమ కథతో తెరకెక్కనున్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది.

 

నటీనటులు :

రశ్మిక మందన్న, తదితరులు

టెక్నికల్ టీమ్: 

సినిమాటోగ్రఫీ – కృష్ణన్ వసంత్, సంగీతం – హేషమ్ అబ్దుల్ వాహబ్, కాస్ట్యూమ్స్ – శ్రావ్య వర్మ, ప్రొడక్షన్ డిజైన్ – ఎస్ రామకృష్ణ, మౌనిక నిగోత్రి, పీఆర్ఓ – వంశీ కాక, జీఎస్ కే మీడియా, మార్కెటింగ్ – ఫస్ట్ షో, సమర్పణ – అల్లు అరవింద్,బ్యానర్స్ – గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్, నిర్మాతలు – విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని,రచన -దర్శకత్వం – రాహుల్ రవీంద్రన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *