చిత్రం: ది ఫ్యామిలీ స్టార్
విడుదల తేదీ : ఏప్రిల్ 5, 2024,
నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, జగపతిబాబు, వెన్నెల కిషోర్, అభినయ, ప్రభాస్ శ్రీను…
దర్శకుడు: పరశురాం పెట్ల,
నిర్మాతలు: దిల్ రాజు,
సంగీత దర్శకులు: గోపీ సుందర్,
సినిమాటోగ్రాఫర్: కే యూ మోహనన్,
ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్
మూవీ: ది ఫ్యామిలీ స్టార్ రివ్యూ (The Family Star Movie Review)
టాలీవుడ్ లో గీత గోవిందం అనే సినిమా తో క్రేజీ కాంబినేషన్ అయిపోయిన విజయ్ దేవరకొండ – పరుశురామ్ పెట్ల తో దిల్ రాజు గారు చేసిన ఫ్యామిలీ మ్యాజిక్ నే ఈ ఫ్యామిలీ స్టార్ మూవీ. విజయ్ కి జోడీ గా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే “ది ఫ్యామిలీ స్టార్”.
ఈ వేసవి కానుకగా డీయేటర్స్ లో కుటుంబ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చిన ఈ ఫ్యామిలీ స్టార్ చిత్రం అంచనాలు అందుకుందో లేదో మా 18F మూవీస్ టీం సమీక్షలో చదివేద్దామా ! .
కధ పరిశీలిస్తే (Story Line):
ది ఫ్యామిలీ స్టార్ సినిమా కధ పరిశీలిస్తే సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) ఒక ఆర్కిటెక్ట్ ఇంజినీర్ చిన్నపాటి ఉద్యోగంతో తన కుటుంబ బండిని అదుపు పొదుపులతో పేరుకు తగ్గట్టుగానే ఆ బరువు భాద్యత లను మోస్తాడు.
మరి తన ఇంటి మిద్దీ మీద గదిలో అద్దెకి, ప్రేమ గా తన జీవితం లోకి వచ్చే ఓ అమ్మాయి ఇందు (మృణాల్ ఠాకూర్) రాకతో తన లైఫ్ ఎలా టర్న్ అవుతుంది?
అసలు ఆమె తన జీవితం లోకి ఎందుకు వచ్చింది?
ఇందు రాకతో గోవర్ధన్ కి ఎదురైన సవాళ్లు ఏంటి?
ఇందు – గోవర్ధన్ కి ముందే ‘పరిచయం ఉందా ?
వాళ్ళు ఇద్దరు ఎందుకు గొడవ పడతారు ? ఫైనల్ గా కలుస్తారా లేదా?
అసలు ఇందు ఎవరు?
ఇందు ప్రేమను పొందడం కోసం ఈ ఫ్యామిలీ స్టార్ ఏం చేస్తాడు?
అనే ప్రశ్నలు మీకు ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తే వెండితెరపై ఫ్యామిలీ స్టార్ సినిమా చూడాల్సిందే.
కధనం పరిశీలిస్తే (Screen – Play):
ఈ ఫ్యామిలీ స్టార్ చిత్రం ప్రస్తుత సినీ – ప్రేక్షకులను మెప్పించే అంశాలు కంటే నొప్పించే అంశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. సింపుల్ కధ తో ఉన్న కాన్సెప్ట్ అయినప్పటికీ సినిమా ఫ్లో కి తగ్గ కధనం (స్క్రీన్ – ప్లే )మిస్ అయ్యింది. సీన్స్ గా చూస్తే ఇలాంటి సీన్స్ సిరియల్స్ లోనో, మరేదో సినిమా లోనో చూసేసాం అన్నట్టే ఉండే సన్నివేశాలు తో కథనం మొదటి అంకం (ఫస్ట్ – ఆఫ్ ) లోనే కాకుండా రెండవ అంకం (సెకండ్ – ఆఫ్ ) కూడా రియల్ ఆడియెన్స్ సహనానికి పరీక్ష పెడతాయి.
కధ – కధనం పేపర్ మీద వ్రాస్తే మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, తిక్కోడి ప్రేమ కధ, ఫ్యామిలీ పట్ల బాద్యత అంటూ చూసుకొన్నా, అవి తెరమీద చూస్తే మాత్రం బోరింగ్ స్క్రీన్ – ప్లే తో సరైన ఎంటర్టైన్మెంట్ లేక, కుటుంబ సబ్యులను భావోద్వేగ పరిచే ఎమోషన్స్ ఉన్నాయా అంటే అవి కూడా లేవు. ఈ లోపం సినిమా మొదలు నుంచి చివరి వరకు కనిపిస్తుంది.
ఇక వీటితో పాటుగా ఇందు ( మృణాల్ ) పాత్ర విజయ్ ని కలవడం కోసం MA లో తీసెస్ చేసి మరలా కన్స్‌స్ట్రక్షన్ చార్ట్స్ ఎక్స్పర్ట్ గా చూపించడం ఎంతో అర్దం కాలేదు. వారిద్దరి ప్రొఫెషన్స్ లో పొంతన కనిపించదు. అలాగే విజయ్ పై కొన్ని సన్నివేశాలు అతిగా అనిపిస్తాయి.
విజయ్ – పరశురాం ల కాంబో లో సూపర్ హిట్ అయిన గీతా గోవిందం లాంటి సాలిడ్ ఎంటర్టైనర్ చూసి ఈ సినిమా కూడా ఆ రేంజ్ లో ఉంటుంది అని అంచనాలు పెట్టుకొని చూసేవారు డిజప్పాయింట్ అవ్వొచ్చు. కొన్ని సీన్స్ మినహా సినిమా కధనం (స్క్రీన్ – ప్లే ) అంతా ఆర్టిఫీషియల్ డ్రామా గానే సాగుతుంది.
దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
దర్శకుడు పరశురాం పెట్ల గురించి మాట్లాడుకొంటే, ఈ ఫ్యామిలీ స్టార్ చిత్రం తన ఫిల్మో గ్రఫీ లో వీక్ ఫిల్మ్ అని చెప్పక తప్పదు. గోవర్ధన్ (విజయ్) పాత్రని ప్రతి మధ్య తరగతి కుటుంబంలో ఇలాంటి వాడు ఒకడు ఉండాలి అనేలా వ్రాసుకొన్నా, వెండి తెర మీద ఆవిష్కరించడంలో దర్శకుడిగా డిజప్పాయింట్ చేశారు.
పరశురామ సినిమా అంటేనే ఫుల్ గా ఎంటర్టైనమెంట్ తో పాటు ఎమోషనల్ నరేషన్ తో సాగుతాయి. కానీ ఈ ఫ్యామిలీ స్టార్ మాత్రం చాలా ఆర్టిఫీసియల్ సన్నివేశాలతో సాగింది. చాలా తక్కువ సీన్స్ మినహా సినిమాని కధనం మాత్రం బోర్ గానే నడిపించారు.
హీరో విజయ్ దేవరకొండ ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ గా అయితే ఈ సినిమాలో కనిపించాడు అని చెప్పవచ్చు. తన ఫెక్యులర్ నటనతో పాటు డైలాగ్ టైమింగ్ తో కొన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ని టచ్ చేసే సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే తన పాత్రలో వేరియేషన్స్ ని కూడా విజయ్ బాగా పండించాడు. అలాగే తనపై కొన్ని మాస్ మూమెంట్స్ తో కూడిన ఫైట్స్ ని మాత్రం ఫ్యాన్స్ కోసం పెట్టినట్టు అనిపించింది.
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన పాత్రలో డీసెంట్ పెర్ఫామెన్స్ తో మెప్పించింది. ఇద్దరి నడుమ కెమిస్ట్రీ కొన్ని సీన్స్ లో బాగుంది. అలాగే ఆమె తన డీసెంట్ లుక్స్ నేచురల్ పెర్ఫామెన్స్ బాగున్నాయి.
హీరో హీరోయిన్ తో పాటు జగపతిబాబు, వెన్నెల కిషోర్ ఇంకా సీనియర్ నటి రోహిణి హట్టంగడి, వాసుకి, అభినయ, ప్రభాస్ శ్రీను తదితరులు తమ పాత్రల పరిడి మేరకు నటించారు.
సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
గోపి సుందర్ మ్యూజిక్ చాలా యావరేజ్ గా ఉంది. వీరి కాంబో లో వచ్చిన గీత గోవిందం సినిమా మ్యూజిక్ వలనే అంత పెద్ద హిట్ అయ్యింది. ఈ ఫ్యామిలీ స్టార్ లో BGM తో గోవిందా అనిపించారు.
కే యూ మోహనన్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా కనిపించాయి. మృణాల్ & విజయ్ కూడా చాలా అందంగా న్యాచురల్ గా కనిపించారు.
మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ ఒకే అనేలా ఉంది. కధ ఫ్లో ని స్లో చేస్తున్న కొన్ని సీన్స్ లెన్త్ తగ్గించి ఉంటే బాగుణ్ణు అనిపిస్తుంద. స్లో మోషన్ కట్స్ తో ఫైట్స్ కూడా డ్రామటిక్ గా ఉన్నాయి.
దిల్ రాజు గారి శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ లో ఈ ఫ్యామిలీ స్టార్ చిత్ర నిర్మాణ బాగా చేశారు అని చెప్పవచ్చు. సినిమా కధ కి తగ్గట్టుగా ఖర్చు పెట్టి ఎంత రిచ్ గా నిర్మించారో.. అంతే హానెస్ట్ గా ఫ్యామిలీ స్టార్ సినిమా ని ఫామిలీలకు దగ్గర చేయాలని కష్టం తో పాటు ఖర్చుతో కూడిన అన్ని రకాల ప్రోమోసన్స్ చేశారు.
18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
విజయ్ దేవరకొండ – పరుశురామ్ పెట్ల హిట్ కాంబినేషన్ అనిపించిన గీత గోవిందం లాంటి అంచనాలతో “ది ఫ్యామిలీ స్టార్” చూస్తే ప్రేక్షకులు చాలా డిస్అపోయింట్ అవుతారు. జీరో ఎక్స్పెపెక్టేసన్స్ తో చూస్తే మాత్రం మంచి ఫ్యామిలీ తో మిక్స్ అయిన ఏమోసనల్ ప్రేమ కధ చూసినట్టు ఉంటుంది.
విజయ్ – మృణాల్ హీరో హీరోయిన్ గా మంచి నటన తో ఆకట్టుకొన్నా, కొన్ని ఆర్టిఫీషియల్ డ్రామా సీన్స్ తో టివి సీరియల్ చూసినట్టు అనిపిస్తుంది. అలాగే కొన్ని సీన్స్ కేవలం ఓకే అనిపిస్తాయి కానీ విజయ్ – పరశురాం హిట్ కాంబినేషన్ అంచనాలు అందుకునే రేంజ్ సినిమా అయితే ఇది కాదు.
చాలా చోట్ల సరైన స్ట్రాంగ్ కన్ఫ్లిక్ట్ లేక సీన్లు లో ఎమోషన్స్ వర్కవుట్ కాలేదు, కథనం (స్క్రీన్ – ప్లే ) అయితే బాగా నిరాశపరుస్తుంది. పరశురాం కధా రచయిత గా మంచి పాయింట్ టు కధ వ్రాసుకొన్నా కధనం – దర్శకుడు గా మాత్రం ఫెయిల్ అయినట్టే !. ఇంకా కథ, కథనాలు పై బాగా వర్క్ చేయాల్సింది.
విజయ్ – మృణాల్ ల నటన న్ పక్కన పెడితే, ఈ ఫ్యామిలీ స్టార్ సాదారణ సినిమా గా నిలిచిపోయింది. దిల్ రాజు ప్రొడక్షన్ అని, విజయ్ దేవరకొండ సినిమా అని మాత్రమే కొంత వరకూ రి కవరి అవుతుంది కానీ, హిట్ కాంబో ( విజయ్ – పరశురామ్) మరియు లక్కీ లేడి (మృణాల్ ఠాకూర్ ) ల స్థాయి మూవీ అయితే కాదు. విజయ్ ఫాన్స్ అండ్ సినిమా లవర్స్ ఒక్కసారీ చూస్తే ఎక్కువ !
చివరి మాట: తిక్కోడి ప్రేమ తో ఫ్యామిలీ డ్రామా !
18F RATING: 2.5 / 5