చిత్రం: ది బర్త్ డే బాయ్ ,
రిలీజ్ డేట్: 2024-07-18,
నటీనటులు: రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్‌కనకాల, ప్రమోదిని, వాకా మని, రాజా అశోక్, వెంకటేష్, సాయి అరుణ్, రాహుల్ తదితరులు..,
దర్శకత్వం: విస్కి,
నిర్మాత: ఐ.భరత్,
డీఓపీ : సంకీర్త్ రాహుల్,
సంగీతం: ప్రశాంత్ శ్రీనివాస్,
ఎడిటర్: నరేష్ ఆడుపా,
బ్యానర్: బొమ్మ బొరుసా పతాకం
మూవీ: ది బర్త్ డే బాయ్ రివ్యూ (The Birthday Boy Movie Review)
ఉత్తర అమెరికా లో జరిగిన యదార్ధా సంఘటనల ఆధారంగా నూతన దర్శకుడు విస్కీ దర్శకత్వం లో వచ్చిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సినిమా ది బర్త్ డే బాయ్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఈ సినిమా దర్శక – నిర్మాతలు ఈ సినిమా ను రిలీజ్ కి ఒక రోజు ముందుగానే మీడియాకు, కొందరు ఫిల్మ్ ఇండస్ట్రి పెద్దలకు ప్రీమియర్ షో వేసి చూపించారు. మా 18F మూవీస్ టీం మూవీ ని చూసి, ప్రీమియర్ చూసిన కొందరు పెద్దల అభిప్రాయాలతో మా 18F మూవీస్ పాఠకుల కోసం ది బర్త్ డే బాయ్ రివ్యూ ఇక్కడ విడుదలకు ఒక్క రోజు ముందుగానే ప్రచురిస్తున్నాము.
కధ పరిశీలిస్తే (Story Line):
చిన్నప్పటినుండి ప్రాణ స్నేహితులుగా ఉన్న బాలు, అర్జున్, వెంకట్, సాయి, సత్తి (మణి, వెంకీ, రాజా అశోక్, అరుణ్,రాహుల్) అమెరికాలో చదువుకొనే స్టూడెంట్స్ ఒకే ఇంటిలో ఉంటుంటారు. ఒక రోజు బాలు బర్త్ డే కావడంతో సెలబ్రేట్ చేసుకోవాలని అందరూ ప్లాన్ చేస్తారు. ఆ బర్త్ డే పార్టీలో ఎక్కువగా తాగి, మత్తులో బాలుపై మిగిలిన నలుగురు స్నేహితులు శృతిమించి దాడి చేస్తారు.
ఆ నేపథ్యంలో బాలు (మణి) చనిపోతాడు. దాంతో నలుగురికి ఏం చేయాలో తెలియని స్థితిలో అర్జున్ (వెంకీ) సోదరుడైన లాయర్ భరత్ (రవికృష్ణ) కి కాల్ చేసి పిలిచి హెల్ప్ చేయమంటారు. ఈ క్రమంలో అందరూ కలిసి బాలు బాడీని పోలీస్ లకు తెలియకుండా మాయం చేసేందుకు ప్లాన్ చేస్తుండగా, తల్లి దండ్రుల వత్తిడి తో ప్లాన్ మార్చి, ఇండియా నుంచి బాలు తల్లిదండ్రులు (ప్రమోదిని, రాజీవ్ కనకాల) ఇద్దరి ని అమెరికాకు రప్పిస్తారు.
బాలు ఎలా చనిపోయాడు ?, స్నేహితుల దాడి వలన చనిపోయాడా?,
లేక ఇంకో కారణం ఏదైనా ఉందా ? బాలు ది హత్య లేక ఆక్సిడెంట్ నా ?,
బాలు డెడ్ బాడీని స్నేహితులు ఎలా మాయం చేయాలనుకొన్నారు?,
బాలు మరణాన్ని తెలుసుకొన్న తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అయ్యారు?,
అమెరికా వచ్చిన బాలు తండ్రి రియాక్షన్ ఏమిటి?,
బాలు శవాన్ని చివరకు స్నేహితుల ఏం చేశారు?
అర్జున్ సోదరుడు భరత్ ఎలాంటి వ్యూహాన్ని రచించాడు?
చివరకు బాలు శవాన్ని ఏం చేశారు అనే ప్రశ్నలు ఇంటరెస్ట్ గా ఉంది జవాబులు తెలుసుకోవాలి అంటే వెంటనే మీ దగ్గరలొని దియేటర్ కి వెళ్ళి ది బర్త్ డే బాయ్ సినిమా చూసేయండి.
కధనం పరిశీలిస్తే (Screen – Play):
ది బర్త్ డే బాయ్ సినిమా కథ యదార్ధ సంఘటనల ఆధారంగా రాసుకొన్నా దర్శకుడు కథనం తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. బర్త్ డే పార్టీకి సంబంధించిన ఎన్విరాన్ మెంట్‌ను ఓ పాటతో ఎస్టాబ్లిష్ చేసిన డైరెక్టర్ విస్కి ఎలాంటి దైవర్షన్స్ లేకుండా నేరుగా కథలోకి వెళ్లాడు.
బాలు క్యారెక్టర్‌ను డెడ్ బాడీగా మార్చిన తర్వాత కొన్ని సీన్స్ లొని డ్రామా, ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. మొదటి అంకం (ఫస్ట్ ఆఫ్) ఎంటర్టైన్మెంట్ వే లో సాగినా, రెండవ అంకం (సెకండ్ ఆఫ్) కధనం మాత్రం చాలా బరువైన సిస్టర్ సెంటిమెంట్ ఎపిసోడ్ తో మిస్టరీ ట్విస్టులతో ప్రి క్లైమాక్స్ నుండి ఎండ్ వరకూ బాగా సాగింది.
మొదటి అంకం (ఫస్ట్ ఆఫ్ ) రెండవ సగం లో భారత్ (రవి కృష్ణ) ప్రవీణ్ (సమీర్) పాత్రల ఎంట్రీ తర్వాత కధనం మర్డర్ ఇన్వెస్టిగేటివ్ జోన్లోకి వెళ్లడంతో సినిమా మీద మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఇక డెడ్ బాడీ చుట్టు కథనం నడిపించి, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ముఖ్యంగా అన్నా – చెల్లి, తండ్రి – కొడుకుల సెంటిమెంట్ డ్రామా తో నడిపిన తీరు బాగుంది.
రెండవ అంకం (సెకండాఫ్) లో కొన్ని ట్విస్టులు బాగా వర్కువుట్ అయ్యాయి. అయితే కొన్ని సీన్ల స్క్రీన్ ప్లే రొటీన్ గా, చాలా స్లోగా ఉండటంతో కథా వేగానికి కొంత బ్రేక్ పడినట్టు అనిపించింది. ఇక రెండవ అంకం (సెకండ్ ఆఫ్) లో ప్రమోదిని, రాజీవ్ కనకాల ఎంట్రీ తర్వాత సినిమా మరో జోన్లోకి వెళ్లిందనే చెప్పాలి.
ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే ట్వీస్టులు,ఎమోషన్ తో కూడిన ఫ్యామిలీ డ్రామా సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడిని కంటితడి పెట్టించేలా ఉన్నాయి. చివరి 20 నిమిషాలు కథను నడిపించిన తీరు డెబ్యూ దర్శకుడు కి క్రాఫ్ట్ మీద ఉన్న ప్రతిభను తెలియజేస్తుంది.
దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
దర్శకుడు విస్కీ స్క్రీన్ నేమ్ ), ది బర్త్ డే బాయ్ సినిమా తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రి లోకి వస్తున్న మరో మంచి దర్శకుడు అని చెప్పవచ్చు. తన లైఫ్ లో, తోటి స్నేహితుల మద్య జరిగిన యదార్ద సంఘటన ఆదారంగా కధ రాసుకొని, ట్విస్టులు తో కూడిన స్క్రీన్ ప్లే తో హానెస్ట్ గా కధ ని చెప్పే ప్రయత్నం చేశాడు.
బిగ్ బాస్ ఫేమ్ రవికృష్ణ, రాజీవ్ కనకాల మాత్రమే ఈ సినిమాలో తెలిసిన నటులు. మిగితా పాత్రల్లో అంతా కొత్త వాళ్లే అయినా అద్బుతంగా నటించారు. ప్రతి సీన్ లో తడబాటు లేకుండా మంచి ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. ఎవరి పాత్రలో వారు ఒదిగిపోయి సినిమాకు ప్లస్‌గా మారారు.
రవికృష్ట తన క్యారెక్టర్ కు పూర్తిస్థాయిలో నటించి మెప్పించాడు. సీరియస్, ఎమోషనల్ సీన్స్ లో ఒదిగిపోయాడు.
ఇక రాజీవ్ కనకాల కనిపించేది చాలా కొన్నిసీన్లే అయినా తన ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. ప్రతీ పాత్ర ఈ సినిమాకు స్సెషల్ ఎట్రాక్షన్ చెప్పాలి. మిగిలిన నటి నటులు తమ పాత్రల పరిది మేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
ప్రశాంత్ శ్రీనివాస్ తన మ్యూజిక్‌తో సన్నివేశాలను మరింత ఎమోషనల్‌గా మార్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ ఈ సినిమా కి స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా సింక్ సౌండ్ వాడడం వలన ప్రతి సన్నివేశం లొని ఎమోషన్ హృదయానికి అత్తు కొనేల ఉన్నాయి.
సంకీర్త్ రాహుల్ సినిమాటోగ్రఫి బాగుంది. ఒకే ఇంట్లో 95% సినిమా షూటింగ్ చేసినా ఎక్కడ బోర్ అనిపించదు. చాలా సీన్లను బాగా ఎలివేట్ చేస్తూ లైవ్ లో చేసినట్టు అనిపించింది.
ఎడిటర్ నరేష్ ఆడుపా ఎడిటింగ్ వర్క్ కూడా కరెక్ట్ గా సెట్ అయ్యింది. ఒకే రూమ్ లో ఎక్కువ సీన్స్ ఉండటం వలన కొన్ని షాట్స్ రీఫిట్ ఏయినట్టు అనిపిస్తుంది. కొన్ని సీన్స్ ని ఇంకా ట్రిమ్ చేసి ఉంటే డ్రామా లొని ఎమోషన్ కి ఇంకా బాగా ఇంపాక్ట్ ఉండేది.
నిర్మాత భరత్ కొత్త దర్శకుడిని నమ్మి ఎంచుకొన్న కథ, సినిమాను తెర మీద అందించిన విధాననికి హ్యాట్స్‌ప్ చెప్పాలి. బొమ్మ బొరుసా పతాకం పై నిర్మించిన ఈ ది బర్త్ డే బాయ్ సినిమా నిర్మాణానికి అనుసరించిన నిర్మాణ విలువలు పరవాలేదు. ఇంకా కొంత ఖర్చుపెట్టి ఉంటే సినిమా ఇంకా రిచ్ గా న్యాచురల్ గా ఉండేది.
18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
బర్త్ డే బాయ్ సినిమా కధకి ఉత్తర అమెరికా లో జరిగిన యధార్ధ సంఘటనల ఆదారంగా, యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటూ మర్డర్ మిస్టరి తో పాటూ రెండవ అంకం (2 nd Off ) లో వచ్చే ఇంటరెస్టింగ్ ట్విస్టులతో ఆకట్టుకొనే కధనం రాసుకొన్న దర్శకుడు ని అభినందించాలి .
ఈ సినిమా దర్శక రచయిత విస్కీ, పాత్రలను డిజైన్ చేసిన తీరు సినిమా కి చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఈ సినిమాకు సంబంధింనంత వరకు సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లిందనే చెప్పాలి.
పాత్రధారులు చాలా వరకూ కొత్త వారైనా తమ నటన తో ఆకట్టుకొన్నారు. ఈ ది బర్త్ డే బాయ్ సినిమా పక్కాగా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమా. ఈ చిత్రాన్ని సినిమా అభిమానులు థియేటర్లోనే చూస్తే మంచి ఎమోషనల్ డ్రామా చూసినట్టు ఉంటుంది.
చివరి మాట: రియల్ స్టోరీ రియాలిస్టిక్ అప్రోచ్ !