Tantiram; Chapter 1 Tales of Shivakasi Movie Review: మైథాలాజీ తో సైకాలజీకల్ యాక్షన్ థ్రిల్లర్ !

InShot 20231015 203127444 e1697382209893

మూవీ: తంతిరం

విడుదల తేది: 13-10-2023,

నటీనటులు: శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ, అవినాష్ ఎలందూరు తదితరులు.,

దర్శకుడు : ముత్యాల మెహర్ దీపక్,

నిర్మాత: శ్రీకాంత్ కాండ్రాగుల

సంగీతం: అజయ్ అరసాడ

సినిమాటోగ్రఫీ: ఎస్. వంశీ శ్రీనివాస్

ఎడిటర్: ఎస్. వంశీ శ్రీనివాస్,

ప్రొడక్షన్ హౌస్: సినిమాబండి ప్రొడక్షన్స్,

మూవీ రివ్యూ: తంతీరం ( thanthiram)

సినీమా బండి ప్రొడక్షన్ హౌజ్ నిర్మాణం లో తంతిరం – టేల్స్ ఆఫ్ శివకాశి చాప్టర్ 1 అనే యాక్షన్ థ్రిల్లర్  మూవీ తాజాగా ఆడియన్స్ ముందుకి వచ్చింది. శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని ముత్యాల మెహర్ దీపక్ తెరకెక్కించారు. మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ యొక్క  సమీక్ష ను మా 18F మూవీస్ టీమ్ సమీక్ష లో  చదివి తెలుసుకుందామా!.

కధ పరిశీలిస్తే:

విజయ్ తన దొస్టులతో కలిసి మందు తాగుతూ  ఒక కథని చెప్తాడు.  మందు గుండు సమన్లు తయారు చేసే  బాలచంద్రన్ (శ్రీకాంత్ గుర్రం) అనే వ్యక్తి యొక్క కథని వారికి వినిపిస్తాడు. తన తల్లి ఇంటినుండి పారిపోవడం తో బాలచంద్రన్ కి ఆడవారి పట్ల చిన్నప్పటి నుండి అయిష్టత ఏర్పడుతుంది. అయితే తన తండ్రి యొక్క బలవంతం మేరకు అలగిని (ప్రియాంక శర్మ) అనే అమ్మాయిని వివాహం చేసుకుంటాడు బాలచంద్రన్.

కానీ ఆమె పట్ల ఎప్పుడూ అయిష్టత చూపుతూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఒక అద్భుత శక్తి (జెనీ) అతడిని అతడి జీవితాన్ని ఒక్కసారిగా మార్చేస్తుంది.

బాలచంద్రన్ అమ్మ ఇంటినుండి ఎందుకు పోయింది?.

తల్లి చేసిన తప్పుకి తన భార్యని ఎందుకు దూరం పెడుతున్నాడు ?

బాలచంద్రన్ జీవితాన్ని మార్చిన సంఘటన ఏంటి?

జెన్నీ ఎవరు? ఎందుకు బాల చంద్రన్ కి వినిపిస్తాది?.

తన కు జెన్నీ కి మధ్య సంబంధం ఏమిటి?

మరి ఇది ఎలా జరిగింది ఆ పైన ఏమైంది అనేది, పైన ప్రశ్నలకు సమాధానం కావాలంటే  సినిమా దియేటర్ కి వెళ్ళి  చూడాల్సిందే.

IMG 20230927 WA01561

కథనం (Screen -Play) పరిశీలిస్తే:

దర్శకుడు మొదటి భాగం కంటే  రెండవ చాప్టర్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టిడం వలన మొదటి  చాప్టర్ లో చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు. జెనీ కి సంబంధించిన మిస్టరీ అంశాన్ని ఫస్ట్ చాప్టర్ లో రివీల్ చేయలేదు.

అది ఆడియన్స్ ని ఒకింత డిజప్పాయింట్ చేస్తుంది. నిజానికి చాప్టర్ 1 లో గల చిన్న పాయింట్ ని దాదాపుగా 110 నిమిషాలకు పైగా చెప్పాల్సిన అవసరం లేదనే అనాలి. ఆ విధంగా ఆడియన్స్ యొక్క సహనానికి పరీక్ష పెట్టాడు దర్శకుడు.  ఈ కథ యొక్క గమనాన్ని బట్టి దీనిని ఒకే చాప్టర్ గా చెప్పవచ్చు.  కానీ దర్శకుడు  దీనిని రెండు చాప్టర్స్ గా తీయాలని  ఎందుకు అనిపించిందో తెలియదు. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఒక రకంగా కామన్  ఆడియెన్స్ నీ డిజప్పాయింట్మెంట్ చేసింది అని  చెప్పవచ్చ.

కధ ఇంట్రెస్టింగ్ నోట్ లో స్టార్ట్ అయినా, కథనం (స్క్రీన్ – ప్లే) కొంచెం గందరగోళంగా ఉండటం వలన కన్ఫ్యూజ్ అవ్వక తప్పదు.

దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశీలిస్తే:

సినీమా కధనం  మైథలాజికల్ స్టొరీ అయిన అహల్య రాయిగా మారిన సీన్ తొ మూవీ ఇంట్రెస్టింగ్ పాయింట్ తొ  ప్రారంభం చెయ్యడం దర్శకుడు ముత్యాల మెహెర్ ప్రతిభ  అనీ చెప్పవచ్చు. . అయితే  జెనీ ఎవరు అనేది మనకు మంచి స్క్రీన్  రైటింగ్ తో పరిచయం చేయడం తొ పాటు కథ పై ఆసక్తిని కలిగించడం లో దర్శకుడు చాప్టర్ – 1 లో ఫెయిల్ అయినట్టే.

ఈ మూవీలో బాలచంద్రన్ ( శ్రీకాంత్ గుర్రం), అలగని (ప్రియాంక శర్మ ) మాత్రమే ప్రధాన పాత్రలు. ఇద్దరి పాత్రలు తొ పాటు వారి నటన కూడా ఆకట్టుకుంటుంది.

ఇంకా చిన్న పాత్రలో కనిపించిన అవినాష్ ఎలందూర్ అలరిస్తారు. అటు ప్రియాంక, ఇటు శ్రీకాంత్ ఇద్దరూ కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేసారు ఆని చెప్పవచ్చు.

IMG 20230922 WA00751

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:

అజయ్ అరాసాడ సాంగ్స్ పర్వాలేదు, మరియు బీజీఎమ్ అయితే బాగానే ఉంది.

ఎస్ వంశీ శ్రీనివాస్ అందించిన సినిమాటోగ్రఫీ బాగున్నప్పటికీ ఎడిటింగ్ ఏమాత్రం బాగోలేదు.రెండు గంటలకు తక్కువగానే నిడివి ఉన్నప్పటికీ సాగతీత సినిమా చూసిన ఫీలింగ్ మనకు కలుగుతుంది.

సినిమా బండి వారి  ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. నిజానికి దర్శకుడు ముత్యాల మెహర్ దీపక్ ఇటువంటి ఫాంటసీ కథని తీయాలని భావించే ఆలోచన బాగుంది. అయితే ఈ కథని రెండు చాప్టర్స్ గా తీయాలనుకోవడం, అందుకోసం ఫస్ట్ చాప్టర్ ని బాగా సాగదీయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.

18F మూవీస్ టీమ్ ఒపీనియన్: 

తంతిరం అనే ఈ ఫాంటసీ డ్రామా సైకలాజికల్ యాక్షన్ మూవీ ఆరంభము లో ఆకట్టుకుంది.

రెండవ చాప్టర్ కొసం మొదటి చాప్టర్ నీ సాగదీసి నట్టు అనిపించింది. స్లో ఫేస్ వలన    ఆడియన్స్ యొక్క సహనానికి పరీక్ష పెడుతుంది.

శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ తమ తమ పాత్రలకు న్యాయం చేసారు. స్టోరీ ని రెండు చాప్టర్స్ గా విభజించి, ఫస్ట్ చాప్టర్ లో షార్ట్ స్టోరీ తీసుకుని దానిని సాగదీయడం నిజంగా ఇబ్బందికరం.

InShot 20231015 203127444

చివరి మాట: మైథాలజీ తో సైకాలజీ యాక్షన్ థ్రిల్లర్ చూడొచ్చు.

18F మూవీస్ రేటింగ్ : 2.5 / 5

*కృష్ణ ప్రగడ.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *