ఇళయదళపతి విజయ్, రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘వరిసు‘ అదే ‘వారసుడు’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో బై లింగ్వల్ గా తెరెకెక్కుతున ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదల వచ్చేసింది.
‘రంజితమే రంజితమే’ అంటూ విజయ్ తనదైన మాస్ స్టెప్స్ తో ప్రోమోలో కనిపించాడు.
మాస్ స్టెప్పులతో అదరగొట్టిన విజయ్.. ఆకట్టుకుంటున్న ‘వారసుడు’ సాంగ్ ప్రోమో!
దళపతి విజయ్, రష్మిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా సినిమా ‘వరిసు’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్ ప్రోమో విడుదలైంది
https://www.youtube.com/watch?v=Io-rU-T27bs
ఈ సినిమాకి సంగీతం తమన్ అందిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, ఖుష్బు, స్నేహ, జయసుధ, యోగి బాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.