సంక్రాంతి 2026 బరిలో దళపతి విజయ్ ‘జన నాయగన్’ !

IMG 20250324 WA0235 e1742832234598

దళపతి విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ జనవరి 9, 2026న విడుదల కాబోతోందని మేకర్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దళపతి విజయ్ సినీ ప్రయాణానికి నివాళిలా ఈ చిత్రం ఉంటుందని మేకర్లు ఇది వరకు చెప్పేశారు. తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించి మరింతగా హైప్ క్రియేట్ చేశారు.

దళపతి విజయ్ నటిస్తున్న ఈ జన నాయగన్ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దించుతున్నారు. సంక్రాంతి సందడి మొదలయ్యే కంటే ముందే బాక్సాఫీస్ వద్ద విజయ్ సందడి షురూ కానుంది. కోలీవుడ్‌లో పొంగల్ అంటే విజయ్ సాధించిన రికార్డులు, వసూళ్ల వర్షం అందరికీ గుర్తుకు వస్తుంటుంది.

ఇక చివరగా ఇలా సంక్రాంతి బరిలోకి విజయ్ వచ్చి రికార్డులు సునామీని సృష్టించ బోతోన్నారని అందరికీ అర్థమై ఉంటుంది.

IMG 20250324 WA0245

విజయ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. స్టైలీష్ లుక్‌లో విజయ్ తన ఫ్యాన్స్‌ను ఇట్టే కట్టిపడేశారు. ఫార్స్ ఫిల్మ్ ద్వారా ఓవర్సీస్‌లో ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఇక విజయ్ నటించే చివరి చిత్రం అవ్వడంతో చెన్నై నుంచి చికాగో.. ముంబై నుంచి మెల్‌బోర్న్‌ వరకు అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

ప్రస్తుతం కేవీఎన్ ప్రొడక్షన్స్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’, ‘జన నాయగన్’ వంటి భారీ చిత్రాల నిర్మాణంలో బిజీగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *