చిత్రం: తల ,
రిలీజ్ డేట్: 14 th ఫిబ్రవరి 2025 ,
నటీనటులు: రాగిన్ రాజ్. అంకిత, రోహిత్, ఎస్తేర్ నోరోన్హా, విజ్జి చంద్రశేఖర్, అజయ్, సత్యం రాజేష్, ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల, ఇంద్రజ.. మిగిలిన నటీనటులు,
రచన, దర్శకత్వం: అమ్మ రాజశేఖర్,
నిర్మాతలు:శ్రీనివాస గౌడ్,దీప ఆర్ట్స్ బ్యానర్,
సంగీతం : ధర్మ తేజ, అస్లాం కేఈ,
సినిమాటోగ్రఫి: శ్యామ్ కె నాయుడు,
ఎడిటింగ్: శివ సామి,
మూవీ: తల మూవీ రివ్యూ ( Thala Movie Review) :
దీప ఆర్ట్స్ బ్యానర్ పై సుప్రసిద్ధ కొరియోగ్రాఫర్ మరియు దర్శకుడు అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో తన కొడుకు అమ్మ రాగిన్ రాజ్, అంకిత నస్కర్ ను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ తీసిన చిత్రం తల.
‘6 టీన్స్’ రోహిత్, ఎస్తేర్ నోరోన్హా, సత్యం రాజేష్, అజయ్, ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల, ఇంద్రజ తదితరులు కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకులు ముందుకు తీసుకుని వచ్చారు.
మరి ఈ తల చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకొందామా !
కధ పరిశీలిస్తే (Story Line):
హీరో తల్లి, తను ప్రేమించి పెళ్లాడిన వ్యక్తికి దూరమై అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా హీరో తన తల్లి పడుతున్న ఆవేదన చూడలేక తన తండ్రి కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. అలా వచ్చిన తరువాత..
తన తండ్రిని ఎలా ఎక్కడ వెతికి పట్టుకున్నాడు?
కుటుంబంలోకి ఎలా వెళ్తాడు?
అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి సంఘటనలు జరిగాయి?
తనకు పరిచయమైన అమ్మాయి హీరో చివరికి కలిసారా లేదా?
అలా వెతికి పట్టుకున్న తన తండ్రి కుటుంబం లో ఉన్న సమస్య ఏమిటి?
ఆ సమస్యను వారు ఎలా పరిష్కరించుకున్నారు?
అసలు చివరికి తన తల్లిదండ్రులు కలుస్తారా?
ఈ ప్రయాణంలో వారి జీవితాలు ఎటువంటి మలుపులు తిరుగుతాయి?
అనే ప్రశ్నలకు సమాధానం వెంటనే తెలియాలి అంటే మీ దగ్గరలొని థియేటర్ కి వెళ్ళి ఈ తల చిత్రం చూచేయండి.
కధనం పరిశీలిస్తే (Screen – Play):
ఇలాంటి కథను తెరపైకి తీసుకువెళ్లడం అంటే పెద్ద సాహసమే. దర్శకుడు అమ్మ రాజశేఖర్ పట్టుదలతో చక్కని సెంటిమెంట్ ఉన్న కధను రాసుకొని దానికి తగ్గ కధనం కూడా రాసుకొని విజయం సాధించారు.
ఈ కాలం కి తగినట్టుగా స్క్రీన్ ప్లే చాలా బాగా డిజైన్ చేసుకున్నారు దర్శకుడు అమ్మ రాజశేఖర్.
దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
అమ్మ రాజశేఖర్ కథ, దర్శకత్వం, నటీనటుల నటన ముఖ్యంగా కొత్తవాడైనా రాగిన్ రాజ్ నటన, సాంగ్స్, డిఓపి, ఎడిటింగ్ వర్క్ అన్ని బాగా శేట్ అయ్యాయి.
ఆమ్మ రాజశేఖర్ తనయుడు గా అమ్మ రాగిన్ రాజ్ నటించిన తొలి చిత్రం అయినా కూడా మంచి నటనను కనబరిచాడు. ప్రతి సీన్ లో ప్రతి ఎమోషన్, నటన లో పరిపక్వత ఎంతో స్పష్టంగా తనదైన శైలిలో తను నటిస్తూ మంచి నటుడు గా తొలి చిత్రంతోనే ప్రూవ్ చేసుకున్నాడు.
హీరోయిన్ అంకిత అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. అదేవిధంగా చాలాకాలం తర్వాత తెరపైకి వచ్చిన రోహిత్ హీరో తండ్రి పాత్రలో తనదైన శైలిలో నటించి ఆ పాత్రకు ప్రాణం పోశారు.
గ్లామర్ పాత్రలకే పరిమితం అయిన ఎస్తేర్ నోరోన్హా ఈ సినిమా లో తల్లి పాత్రలో వదిగిపోయింది. తన పాత్ర పరిధి మేరకు నటించి ఎమోషన్ ని పండించారు. ఈ సినిమాలో నటించిన మిగతా వారు అజయ్, సత్యం రాజేష్, ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల, ఇంద్రజ వంటి వారు ఈ చిత్రానికి మరొక ప్లస్ పాయింట్ గా నిలిచారు.
క్లైమాక్స్ లో ఇంద్రజ గారినటన, ఆమె పాత్ర బాగుంటాయి. తల సినిమాలో నటించిన ప్రతి పాత్రకి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఇలా ప్రతి పాత్రకి ప్రాముఖ్యత ఇవ్వడం దర్శకుడి గొప్పతనం గా చెప్పుకోవచ్చు.
సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
ఈ చిత్రానికి కథనం, కథా బలం చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. అమ్మాయి కోసం ప్రాణాలు ఇస్తున్న జనరేషన్లో అమ్మకోసం ఇంత కష్టపడే కొడుకు కథగా ఈ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. . అలాగే చిత్రంలోని పాటలు, మ్యూజిక్ ఆకట్టుకుంటాయి. చిత్రంలోని యాక్షన్ సీన్స్ ఇంటెన్స్ గా ప్రేక్షకులు ను ఆకట్టుకునే విధంగా ఉంటాయి.
టెక్నికల్గా నిర్మాణపరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి విలువలతో అలాగే బిఎఫ్ ఎక్స్ కూడా అద్భుతంగా డిజైన్ చేసుకున్నారు. డిఓపి గా శ్యామ్ కె నాయుడు విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఎడిటింగ్ వర్క్ ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్ గా నిలుస్తుంది.
అమ్మ రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అనే విధంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ చిత్రం అంతా ఉత్తర ప్రదేశ్ లోని రియల్ లొకేషన్స్ లో నాచురల్ గా నిర్మించారు
18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
గతం లో ఎన్నో సినిమాలు అమ్మ సెంటిమెంట్ తో వచ్చి మంచి విజయాన్ని అందుకొన్న సందర్బాలు చాలానే ఉన్నాయి. ఆ కోవలోక ఈ తల సినిమా కూడా చేరవచ్చు. వెండితెర మీద అమ్మ సెంటిమెంట్ కి విజయం తప్ప అపజయం అనేది ఉండదు.
ఫ్యామిలీ ఆడియన్స్ ముఖ్యంగా చిన్నపిల్లలతో చూడడం కొంచెం కష్టం. ఎందుకంటే సినిమాలో వైలెన్స్ కొంచెం ఎక్కువ ఉంది. కోన సీన్స్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ డల్ గా ఉంది. కొద్దిగా బ్లడ్ సీన్స్ తగ్గించి ఉంటే ఫ్యామిలీ మొత్తం చూసి బాగా ఎంజాయ్ చేసేవారు.
చివరి మాట: సెంటిమెంటల్ మాస్ యాక్షన్ డ్రామా !
18F RATING: 3 / 5
* కృష్ణ ప్రగడ.