ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ లోని ముఖ్య అంశాలు! 

IMG 20250526 205637

* దుర్గేశ్ గారికి ధన్యవాదాలు. ఈరోజు ఆయన ఇచిన ప్రెస్నోట్ ద్వారా స్పష్టం చేయడం సంతోషం. 

* ఎక్కడో మొదలైన సమస్య ఇప్పటితో సర్దుమణిగాయి. 

* ఏప్రిల్ 19 ఈస్ట్ గోదావరి లో exhibitors & distributors పెట్టుకున్న మీటింగ్ నుండి ఈ సమస్య మొదలైంది. 

* 90 సినిమాలు % విధానంలో ఆడుతున్నాయి. 

* ఏప్రిల్ 26న గిల్ట్ మీటింగ్ జరిగింది.  

* ఇండైరెక్ట్ గా అనుకున్నది జరగకపోతే వాళ్ళే జూన్ 1వ తేదీ నుండి ఆపాలి అనుకున్నారు. 

* వారి కష్టాలు అన్ని నాకు తెలుసు. 

* ఆ సమయంలో HHVM విడుదల తేదీ ఫిక్స్ కాలేదు. 

* 370 సింగిల్ స్క్రీన్s, 30 మాకు సంబంధించినవి. 90 ఆసియన్ సునీల్ & సురేష్ గారి దగ్గర ఉన్నాయి. మిగతావి ఎవరి థియేటర్ లు వారు నడుపుకుంటున్నారు. 

* కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయి. 

* తెలంగాణలో కూడా థియేటర్ యజమానులు ఇబ్బందులు పడుతున్నాం అని అన్నారు. 1998 నుండి మేము కలిసి వ్యాపారం చేస్తున్నాము. 

* శిరీష్ ద్వారా నా దగ్గరకు ఈ విషయం వచ్చింది. 

* నేను FDC చైర్మన్ కాబట్టి నా దగ్గరకు ఈ విషయాలు వచ్చాయి. 

IMG 20250526 205653

* జూన్ 1 నుండి థియేటర్ బంద్ అనేది కేవలం మీడియా వారు చేసిన ప్రచారం మాత్రమే. 

* ఆరోజు మీటింగులో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. 

* త్వరలోనే మరొక మీటింగ్ పెట్టుకుని ఈ విషయం గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం. 

* కానీ బయటకు వచ్చిన వార్త వేరు. అది తెలిసిన నేను ఆశ్చర్యపోయాను. 

* మేము ఇండస్ట్రీ లో పెద్ద అంటారు కదా… 

* కోవిడ్ లో కాకుండా ఇంకెప్పుడు థియేటర్ లు మూసింది లేదు. 

* డిస్ట్రిబ్యూటర్ మీటింగ్ లో బంద్ వద్దు అనుకున్నారు. 

* ఆ తరువాత నిర్మాతల మీటింగ్ జరిగింది. 

* కళ్యాణ్ గారి సినిమా మూసే దమ్ము, దైర్యం ఎవరు చేయరు. 

* దుర్గేశ్ గారికి థియేటర్ లు క్లోజ్ చేయరు అని అన్నాను. 

* కాకపోతే కొంత తప్పు కమ్యూనికేషన్ తో కళ్యాణ్ గారి సినిమా ఆపడానికి అన్నట్లు వారికి అర్థం అయింది. 

* జూన్ & జూలై లో మంచి సినిమాలు వరుసగా ఉన్నాయి. 

* గత రెండు నెలలు సినిమాలు సరిగా లేవు. 

* మిస్ కమ్యూనికేషన్ వల్ల చాలా ఇబ్బంది అయింది. 

* సినిమా వారికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ముఖ్యం. 

* కళ్యాణ్ గారిని అందరం కలిసి వెళ్ళాం. ఆయన ఇండస్ట్రీకి బాగా సపోర్ట్ చేశారు. 

* అంతేకానీ అందరం కలిసి వెళ్ళి ప్రభుత్వాన్ని కలవలేదు. ఎవరి చిత్రం కోసం వారు సెపరేట్ గా వ్యక్తిగతంగా కళ్యాణ్ గారిని కలవడం మాత్రమే జరిగింది. 

* ఉత్తరాంధ్రలో SVCCకు 20 థియేటర్ లు ఉన్నాయి. 

* నాకు ఇంకా మంచి ఆలోచనలు ఉన్నాయి. మరింత అభివృద్ధి చెందేలా ఆ ఆలోచనలు ఉన్నాయి. 

* అరవింద్ గారు ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది. అది నిజం. 

* ప్రభుత్వాలను కలుపుకుంటూ ముందుకు వెళ్తాము. 

* ఇండస్ట్రీ కి ఏం కావాలన్నా మేము ముందు ఉంటాము. 

* ఇప్పటికి అయినా తప్పు వార్తలు ఆపేయండి. 

* జరగబోయే మీటింగ్ లో అన్ని విషయాలు మాట్లాడుకుని ఒక కోణానికి వస్తాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *