ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు.

satya kcr 2 e1671805087311

 

చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తన వైవిధ్యమైన నటన ద్వారా,మూడు తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సీఎం గుర్తుచేసుకున్నారు. కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరనిలోటని సీఎం కేసిఆర్ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

నవరస నట సార్వభౌమునిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న కైకాల అనేక అవార్డులు అందుకున్నారని, తెలుగు ప్రజలు గర్వించదగ్గ విలక్షణ నటుడుగా, లోక్ సభ సభ్యునిగా దివంగత కైకాల సత్యనారాయణ చేసిన కళాసేవ, ప్రజా సేవ గొప్పదని సీఎం అన్నారు. కైకాలతో తనకున్న అనుబంధాన్ని సిఎం కేసీఆర్ స్మరించుకున్నారు.

satya son and kcr
సినీ నటుడు మాజీ ఎంపీ కైకాల సత్యనారాయణ చేసిన సేవలకు గౌరవంగా, ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం కెసిఆర్ ఆదేశించారు.

కాగా… బంజారా హిల్స్ లోని కైకాల నివాసానికి వెల్లిన సిఎం కేసీఆర్ సినీనటుడు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించి పుష్పాంజలి ఘటించారు. వారి కుమారులను కూతుల్లను కుటుంబ సభ్యులను సిఎం ఓదార్చారు. వారికి ధైర్యవచనాలు చెప్పి కాసేపు పరామర్శించారు. అనంతరం అక్కడే వున్న మీడియా ముందుకు వచ్చి నటుడుగా ఎంపీ గా కైకాల తో తనకున్న అనుబంధాన్ని సిఎం స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారు మాట్లాడుతూ…

satya kcr
‘‘ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గారు గొప్ప వ్యక్తి. ఈరోజు వారు మరణించడం చాలా బాధాకరం. సినీ హీరోలతో పోటీపడుతూ చాలా అద్భుతంగా నటించే వారాయన. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో నటించి, అద్భుతమైన పేరు తెచ్చుకున్న వ్యక్తి. నేను కొంతకాలం వారితో కలిసి పనిచేయడం కూడా జరిగింది. ఆ కాలంలో వారితో కొన్ని అనుభవాలను కూడా పంచుకున్నాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ సీనియర్ నటుడు కైకాల గారిని కోల్పోవడం బాధాకరం..’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

పరామర్శ సందర్భంగా.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి వెంట, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు ఎస్.మధుసూధనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, బాల్క సుమన్, తో పాటు వేణు గోపాల చారి, దాసోజు శ్రవణ్, ఆంజనేయులు గౌడ్, పతాని రామకృష్ణ గౌడ్ తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *