Teaser launch by Trivikram: త్రివిక్రమ్ చేతుల మీదుగా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ టీజర్ రిలీజ్ !

IMG 20231024 WA0098 e1698153794365

 

యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సినిమాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు ఈ తరం దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే ఓ యదార్థ సంఘటనను తీసుకొని ఎంతో ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. ఆ సినిమాకి ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′  టైటిల్ ఫిక్స్ చేసి యువత నచ్చేలా ఆ వాస్తవ కథకు తెరరూపమిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్దమైన క్రమంలో ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టారు మేకర్స్. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ సినిమాలో ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ముఖ్యపాత్రల్లో నటించారు.

IMG 20231024 WA0094

ఇక ప్రమోషన్స్ లో భాగంగా దసరా శుభాకంక్షల తో ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీ టీజర్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు విడుదల చెయ్యడం జరిగింది. ఈ క్రమంలో మేకర్స్ మాట్లాడుతూ ఆయన టీజర్ చూసి చాలా బాగుందన్నారు. ముఖ్యంగా మ్యూజిక్ అండ్ సినిమా ఫ్రేమింగ్ చాల బాగుందన్నారు. కొత్త వారితో చేసినా యాక్టింగ్ మెచూరిటీగా సహజంగా ఉందన్నారు.

అంతేకాకుండా టీనేజ్ లవ్ స్టోరీ లో ఉండాల్సిన ఇన్నోసెన్సీ ఇందులే కన్పిస్తుందన్నారు. ఈ సినిమా కచ్చితంగా యువతకి నచ్చుతుందని టీం అందరికి బెస్ట్ విషెస్ తెలియజేసి సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలియజేసారు అని వెల్లడించారు. ఇక ఈ సినిమా ఆడియో హక్కులను ఫాన్సీ రేటుకు టీ సిరీస్ తెలుగు సంస్థ దక్కించుకుంది. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ అన్ని హంగులు జోడించి రూపొందించిన ఈ సినిమాకు శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వ్యవహరించారు.

కార్తీక్ రోడ్రీగుజ్ స్వరాలను అందించగా కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించారు. శ్రీ సాయి కిరణ్ గారు లిరిక్స్ అందించారు. నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఎడిటింగ్ కోదాటి పవన్ కళ్యాణ్ కాగా వంశి ఉదయగిరి కో- డైరెక్టర్‌గా పని చేశారు.

IMG 20231024 WA0097

 టైటిల్:

‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ డైరెక్టర్: శ్రీనాథ్ పులకురం

నటీనటులు:

ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల

సాంకేతిక నిపుణులు:

 

మ్యూజిక్: టీ సిరీస్ తెలుగు , బ్యానర్ : బ్లాక్ ఆంట్ పిక్చర్స్ ,సమర్పణ: శ్రీమతి కొవ్వూరి అరుణ,  నిర్మాత; భువన్ రెడ్డి కొవ్వూరి సంగీతం: కార్తీక్ రోడ్రీగుజ్ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: కమ్రాన్ లిరిక్స్: శ్రీ సాయి కిరణ్ , సినిమాటోగ్రఫీ: నిఖిల్ సురేంద్రన్ ఎడిటింగ్: కోదాటి పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *