అమెరికాలో ఎన్ ఆర్ ఐ  ల మద్య ‘తారక రామం ‘ పుస్తకావిష్కరణ !  

IMG 20241216 WA0260 e1734351738592

తెలుగు ప్రజల హృదయాల నేలిన విశ్వవిఖ్యాత నట చక్రవర్తి, నిత్య నీరాజనాలందుకుంటున్న తెలుగుజాతి ఆత్మగౌరవ నినాద ప్రదాత ‘అన్న’ నందమూరి తారక రామారావు గారి సినిమా వజ్రోత్సవాల సందర్భంగా అమెరికాలో ‘తారకరామం ‘ గ్రంథాన్ని ఆవిష్కరించారు .

IMG 20241216 WA0263

కనెక్టికట్ లో ఎన్ .టి .ఆర్ లిటరేచర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ వైస్ చైర్మన్ అశ్విన్ అట్లూరి సారధ్యం లో ఎన్ .టి .ఆర్ అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ సీనియర్ జర్నలిస్ట్ మరియు రచయిత భగీరథ గారి సంపాదకత్వంలో రూపొందిన “తారకరామం”. ప్రత్యేక సంచిక విడుదలైంది .

ఈ గ్రంథాన్ని ఎన్ .టి .ఆర్ లిటరేచర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు, భారత మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, సినిమారంగ ప్రముఖుల సమక్షంలో విజయవాడలో విడుదలైంది.

IMG 20241216 WA0261

ఇదే సందర్భంలో అమెరికాలో కనెక్టికట్ రాష్ట్రంలో మా మహానాడు న్యూ ఇంగ్లాండ్ టీం తో కలిసి విడుదల చెయ్యటం ఎంతో అదృష్టం గా భావిస్తున్నామని అట్లూరి అశ్విన్ తెలిపారు.

ఎన్ .టి .ఆర్ నట ప్రస్థానం “మన దేశం” తో మొదలై , “మేజర్ చంద్రకాంత్” వరకు కొనసాగిందని, ఈ మద్య కాలంలో తెలుగు సినీ రంగంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన 75 ఏళ్ల చరిత్రకు ‘తారకరామం’ వేదికైందని ఆయన తెలిపారు.

అన్న ఎన్ .టి .ఆర్ సినిమా వజ్రోత్సవ వేడుకలను అమెరికాలో జరుపుకోడం ఎంతో ఆనందం కలిగిస్తుందని అశ్విన్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *