TANTRA Movie Teaser Review: తంత్ర టీజర్ రివ్యూ – రక్తపిశాచాలు ఉన్నాయా?  

IMG 20231208 WA0101

 

మల్లేశం, వకీల్‌సాబ్ సినిమాలతో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసిన మన తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన ‘తంత్ర ‘ మూవీ టీజర్ ఈరోజు ప్రియదర్శి చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది.

IMG 20231208 WA0102

‘ఊరిలో పుట్టిన దుష్టశక్తి రక్తదాహంతో విరుచుకుపడుతోంది..’ అంటూ చెబుతున్న డైలాగ్స్ మీద కట్ అయిన టీజర్ రకరకాల తాంత్రిక పూజలని చూపిస్తూ మైండ్-బ్లోయింగ్‌గా ఉంది. టీజర్‌ని బట్టి ఈ సినిమాలో మన పురాతన తాంత్రిక రహస్యాలని వెలికితీస్తున్నట్టు తెలుస్తోంది. అనన్య దుష్టశక్తి బారిన పడిన అమ్మాయిగా కొత్తగా కనిపిస్తోంది. అనన్య ఇంతవరకు చెయ్యని ఒక క్రేజీ రోల్ చేస్తోందని మేకర్స్ చెబుతున్నారు. క్షుద్రపూజలు చేసే తాంత్రికుడిగా ‘టెంపర్ వంశీ’ లుక్ బాగా సెట్ అయ్యింది. సలోని పాత్ర మిస్టీరియస్‌గా కనపడుతోంది.

IMG 20231208 WA0099

ప్రస్తుతం హర్రర్ ట్రెండ్ నడుస్తోంది. క్షుద్రపూజలు ఇతివృత్తంగా వస్తున్న సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్ కొడుతున్న టైమ్‌లో వస్తున్న ఈ మూవీ కూడా ప్రామిసింగ్‌గా కనపడుతోంది. శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్ రఘుముద్రి ఈ మూవీతో హీరోగా పరిచయమవుతున్నాడు. సలోని ఈ సినిమాతో గట్టిగా రీ-ఎంట్రీ ఇస్తోందని అర్ధమౌతోంది. రీసెంట్‌గా మంగళవారం సినిమాతో ఆకట్టుకున్న మీసాల లక్ష్మణ్ ఈ సినిమాలో ఒక మంచి రోల్ చేసారని తెలుస్తోంది.

IMG 20231208 WA0093

ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్స్ కలిసి రూపొందించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. వాల్ట్‌డిస్నీలో పనిచేసిన శ్రీనివాస్ గోపిశెట్టి ఈ మూవీతో దర్శకుడిగా డెబ్యూ చేస్తున్నారు. టీజర్ చూసి ఇంప్రెస్ అయిన ప్రియదర్శి దీనిని లాంచ్ చేయడానికి ముందుకొచ్చారని మేకర్స్ చెబుతున్నారు.

నటీనటులు:

అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్, కుశాలిని

 

టెక్నికల్ టీం:

బ్యానర్స్: ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, నిర్మాతలు: నరేష్ బాబు పి, రవి చైతన్య, డైరెక్టర్: శ్రీనివాస్ గోపిశెట్టి,కో-ప్రొడ్యూసర్: తేజ్ పల్లి, సినిమాటోగ్రఫి: సాయిరామ్ ఉదయ్, విజయ భాస్కర్ సద్దాల,ఆర్ట్ డైరెక్టర్: గురుమురళీ కృష్ణ, ఎడిటర్: ఎస్.బి ఉద్ధవ్, మ్యూజిక్: ఆర్ ఆర్ ధృవన్,సౌండ్ డిజైన్: జ్యోతి చేతియా, సౌండ్ మిక్సింగ్: శ్యామల్ సిక్దర్, VFX: ఎ నవీన్,DI కలరిస్ట్: పివిబి భూషణ్,పీఅర్ఓ: మధు వి ఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *