Tantra Movie Release Date Poster Impressive : అనన్య నాగళ్ల ‘తంత్ర’ పోస్టర్ లో వార్నింగ్ చూసేరా?

IMG 20240223 WA0106 e1708696263564

 తమ సినిమాకి A సర్టిఫికేట్ రావడంపై ‘తంత్ర’ టీమ్ డిఫరెంట్‌గా రియాక్ట్ అయ్యింది. మా సినిమాకి పిల్ల బచ్చాలు రావద్దని హెచ్చరిస్తూ ‘A’ ని పెద్దగా హైలైట్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం.

నిజానికి ఇదొక సరికొత్త క్రియేటివ్ ప్రమోషనల్ స్ట్రాటజీ. అలానే తమ సినిమా మంచి హర్రర్ ఎలిమెంట్స్‌తో థ్రిల్ చేస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉన్న మేకర్స్ తమ సినిమాకి చిన్నపిల్లలు రావద్దని వారిస్తున్నారు.

ఇప్పటికే రిలీజైన్ టీజర్, సాంగ్స్‌ని యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హీరోయిన్ అనన్య నాగళ్ల పల్లెటూరి అమ్మాయిగా, క్షుద్రపూజలకి గురైన బాధితురాలిగా టీజర్‌లో కనపడితే.. ‘ధీరే ధీరే’ సాంగ్‌లో అందమైన ప్రియురాలిగా కుర్రాళ్ల మనసుల్ని కొల్లగొడుతోంది. అనన్య నాగళ్లకి జోడీగా శ్రీహరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ధనుష్ రఘుముద్రి మంచి స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు.

IMG 20240223 WA0112

వీరే కాకుండా మర్యాదరామన్న ఫేం సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ ఈ హార్డ్‌హిట్టింగ్ హర్రర్ డ్రామాకి తమదైన గాఢతని తీసుకొచ్చారని దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి తెలిపాడు. మారుమూల శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామం నుంచి వచ్చిన ఈ దర్శకుడు వాల్ట్‌డిస్నీలో పనిచేసే స్థాయికి ఎదిగి, సినిమా తీయాలన్న తన లక్ష్యాన్ని ‘తంత్ర ‘తో సాధించాడు.

ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్స్ కలిసి రూపొందించిన ఈ సినిమా ట్రైలర్‌ని త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాతలు నరేష్ బాబు, రవిచైతన్య ప్రకటించారు.

 

నటీనటులు:

అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్, కుశాలిని

టెక్నికల్ టీం:

బ్యానర్స్: ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ,నిర్మాతలు: నరేష్ బాబు పి, రవి చైతన్య,డైరెక్టర్: శ్రీనివాస్ గోపిశెట్టి,కో-ప్రొడ్యూసర్: తేజ్ పల్లి,సినిమాటోగ్రఫి: సాయిరామ్ ఉదయ్, విజయ భాస్కర్ సద్దాల,ఆర్ట్ డైరెక్టర్: గురుమురళీ కృష్ణ,ఎడిటర్: ఎస్.బి ఉద్ధవ్,మ్యూజిక్: ఆర్ ఆర్ ధృవన్,సౌండ్ డిజైన్: జ్యోతి చేతియా,సౌండ్ మిక్సింగ్: శ్యామల్ సిక్దర్, VFX: ఎ నవీన్,DI కలరిస్ట్: పివిబి భూషణ్,పీఅర్ఓ: మధు వి ఆర్, తేజస్వి సజ్జా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *