మై బేబి గా వస్తున్న తమిళ డి ఎన్ ఏ సినిమా! విడుదల ఎప్పుడంటే !

IMG 20250704 WA0263 e1751642482660

ఇటీవల విడుదలై తమిళంలో సూపర్ హిట్ అయిన డి ఎన్ ఏ సినిమాను ఎస్. కె. పిక్చర్స్ ద్వారా సురేష్ కొండేటి తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ సినిమా తెలుగులో ‘మై బేబి’ పేరుతో జూలై 11న విడుదల కానుంది.

గతంలో ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’ ‘షాపింగ్ మాల్ ‘ ‘పిజ్జా’ వంటి విజయవంతమైన 15 చిత్రాలను నిర్మాతగా విడుదల చేసిన సురేష్ కొండేటి గతంలో డిస్ట్రిబ్యూటర్ గా 85 పైగా చిత్రాలను విడుదల చేశారు. ఇప్పుడు నిర్మాతగా 16వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.

 ‘మై బేబి’ ప్రోడ్యూసర్ గా తనకు తెలుగులో 16వ చిత్రమని, ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. నెల్సన్ వెంకటేసన్ దర్శకత్వంలో తమిళంలో ఇటీవలే విడుదలై, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

మాములుగా మనం హాస్పిటల్స్ లో పిల్లల్ని మాయం చెయ్యడం వారిని వేరే చోట అమ్మేయడం వంటి వార్తలని వింటున్నాం టీవీ న్యూస్ లో చూస్తాం. ఇలాంటి వార్తలు ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాలుగా వింటూనే ఉంటున్నాం. ఈ సినిమా మరొక్కసారిగా మనం సొసైటీలో ఎంత జగ్రత్తగా ఉండాలో తెలియచేసింది.

 అధర్వ మురళి, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్, భావోద్వేగ డ్రామాతో కూడిన గ్రిప్పింగ్ కథాంశంతో ఆకట్టుకుంది. 2014లో ఒక సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *