త‌మిళ ‘డా..డా’తెలుగులో ‘పా.. పా..’గా ఎప్పుడు వస్తున్నాడంటే ! 

IMG 20241130 WA0065 e1732950040356

తెలుగు తెర‌పైకి ఓ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా రాబోతోంది. తమిళ సెన్సేష‌న‌ల్ బ్లాక్ బస్టర్ ‘డా..డా’ మూవీ తెలుగులో ‘పా.. పా..’ టైటిల్‌తో జెకె ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌పై, నిర్మాత నీరజ కోట విడుద‌ల చేయ‌బోతున్నారు.

డిసెంబ‌ర్ 13న‌ ఈ చిత్రాన్నిఆంధ్ర, తెలంగాణతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా థియేట‌ర్‌ల‌లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. 

IMG 20241130 WA0067

గ‌త ఏడాది త‌మిళంలో ‘డా..డా’ మూవీ సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది. కవిన్, అపర్ణ దాస్ ప్ర‌ధాన పాత్ర‌దారులుగా, డైరెక్ట‌ర్ గణేష్ కె బాబు తెర‌కెక్కించిన‌ ‘డా..డా’ చిత్రం త‌మిళ ఆడియన్స్‌ని విప‌రీతంగా ఆకట్టుకుంది.

కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో డిస్ట్రిబ్యూట‌ర్‌ల‌కు కాసుల వ‌ర్షం కురిపించింది. అతి త‌క్కువ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా సుమారు 30 కోట్లు వసూళ్లు సాధించి బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది.

IMG 20241130 WA0064

తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కి తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘డా..డా’ చిత్రం ‘పా.. పా..’ పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను కూడా బాగా ఆక‌ట్టుకుంటుంద‌ని నిర్మాత నీరజ కోట తెలిపారు. కామెడీ, భావోద్వేగం, ప్రేమ.. ఇవ‌న్నీ సరైన స్థాయిలో మిక్స్ చేసిన ఈ ఫీల్ గుడ్ ఎమోష‌న‌ల్ డ్రామా..

IMG 20241130 WA0066

తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా బాగా క‌నెక్టు అవుతుంద‌ని, బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వడం ఖాయ‌మ‌న్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంజీఎం సంస్థ నుంచి అచ్చిబాబు విడుద‌ల చేయ‌బోతున్నార‌ని చెప్పారు.

ప్రొడక్షన్ హౌస్: JK ఎంటర్టైన్మెంట్స్

నిర్మాత: నీరజ కోట

హీరో: కవిన్,

హీరోయిన్: అపర్ణా దాస్

న‌టీన‌టులు:

భాగ్యరాజా, వీటీవీ గణేష్, ఐశ్వర్య, ప్రదీప్ శక్తి..

సాంకేతిక వర్గం: 

మ్యూజిక్: జెన్ మార్టిన్, సాహిత్యం: రవివర్మ ఆకుల, పీఆర్వో: క‌డ‌లి రాంబాబు, అశోక్ ద‌య్యాల‌.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *