Talakona Movie Pre Release event Highlights: వైభవంగా “తలకోన” ప్రి రిలీజ్ వేడుక ! విడుదల ఎప్పుడంటే!

IMG 20240321 WA0071 e1711009153970

 అక్షర క్రియేషన్ పతాకంపై నగేష్ నారదాసి దర్శకత్వంలో దేవర శ్రీధర్ రెడ్డి ( చేవెళ్ల) నిర్మాతగా అప్సర రాణి ప్రధాన పాత్రలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ “తలకోన” . ఈ చిత్రం అన్ని హంగులు పూర్తి చేసుకుని మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఫిల్మ్ ఛాంబర్ లో ప్రి రిలీజ్ వేడుక నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా ప్రముఖ నిర్మాతలు రామసత్యనారాయణ, సాయి వెంకట్, Ds రావు, ప్రముఖ హీరో రమాకాంత్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ పార్ధు రెడ్డి తదితరులు పాల్గొని చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియచేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీదర్ రెడ్డి మాట్లాడుతూ.. మా హీరోయిన్ అప్సర రాణీ ఇప్పటివరకు చేయని వెరైటీ సబెక్ట్ ఇది.అవుట్ అండ్ అవుట్ యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ కథాంశం మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. అయితే ఫారెస్ట్ అనగానే కేవలం ప్రకృతి అందాలే కాదు అందులో ఇంకో కోణం కూడా వుంటుందని చూపించాం.

IMG 20240321 WA0070

అదే విదంగా పాలిటిక్స్, మీడియాను సైతం మిక్స్ చేసి చూపించడం జరుగుతుంది. అందుకు తగ్గ టీమ్ ను, టెక్నికల్ టీమ్ కూడా సినిమాకు తీసుకోవడం జరిగింది. అలాగే థ్రిల్లింగ్ సస్పెన్స్ తో మార్చి 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు .

IMG 20240321 WA0069

దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ.. అప్సర రాణీ నీ చూస్తే కాశ్మీర్ యాపిల్ ల కనిపిస్తుంది.కానీ ఈ సినిమాలో తను కాశ్మీర్ మిర్చి లా నటించింది . చాలా వెరైటీ స్టోరీ ఇది .షూటింగ్ “తలకొనలో అద్భుతంగా జరిగింది. మా సినిమా తప్పక విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. మా లాంటి చిన్న సినిమాలకు సరైన షోస్ ఇచ్చి సినిమాలను బ్రతికించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ” అని అన్నారు

IMG 20240321 WA0068

హీరోయిన్ అప్సర రాణీ మాట్లాడుతూ“నా కెరీర్ లో ఈ చిత్రం డెఫినెట్ గా ఓ మైలు రాయి గా నిలుస్తుంది. నేనింతవరకు చేయని ఫైట్స్ ఈ చిత్రంలో చేయడం జరిగింది. మాస్ & క్లాస్ ఆడియన్స్ కు కావలసిన అన్ని అంశాలు ఈ చిత్రంలో వున్నాయి. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను” అని అన్నారు.

నటీనటులు:

అప్సర రాణి, అశోక్ కుమార్, అజయ్ ఘోష్, విజయ కరణ్, రంగ రాజన్, రాజా రాయ్ యోగి కత్రి తదితరులు నటించిన ఈ చిత్రానికి

సాంకేతిక వర్గం:

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నగేష్ నారదాసి నిర్మాత: దేవర శ్రీధర్ రెడ్డి,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాశింశెట్టి వీరబాబు, నిర్వహణ: పరిటాల రాంబాబు , డిఓపి: ప్రసాద్ , ఎడిటర్: ఆవుల వెంకటేష్ , మ్యూజిక్: సుభాష్ ఆనంద్, ఫైట్స్: విన్ చిన్ అంజి, డాన్స్: చార్లీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *