TAGGEDE LE MOVIE TELUGU REVIEW & RATING: లవ్ రొమాన్స్ రివెంజ్ లో మీరు తగ్గేదే లే అంటే తగ్గేదే లే సినిమా మీకోసమే !

TAGGEDE LE MOVIE TELUGU REVIEW BY 18F MOVIES 1

మూవీ: తగ్గేదే లే

విడుదల తేదీ : నవంబర్ 04, 2022

నటీనటులు: నవీన్ చంద్ర .. అనన్య రాజ్ .. దివ్య పిళ్లై కనిపించనున్నారు. ఈ సినిమాకి చరణ్ అర్జున్ సంగీతాన్ని

దర్శకుడు : శ్రీనివాస్ రాజు

నిర్మాత: భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్

సంగీతం: చరణ్ అర్జున్

సినిమాటోగ్రఫీ: వెంకట్ ప్రసాద్

ప్రొమిసింగ్ నటుడు  నవీన్ చంద్ర హీరోగా ఈ శుక్ర వారం వచ్చిన ‘తగ్గేదే లే’ సినిమా కి దండుపాళ్యం సినిమా ల సృస్థి కర్త దర్శకుడు శ్రీనివాసరాజు దర్శకుడిగా వ్యవహరించాడు.

గతంలో ఆయన నుంచి వచ్చిన ‘దండుపాళ్యం’ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే దండు పాళ్యం బ్యాచ్ కి పోలీస్ డిపార్ట్మెంట్ కి మద్య  రెవెంజ్ లో చిక్కుకున్న ఓక యువ జంట తో  ఆయన చేసిన సినిమానే ‘తగ్గేదే లే’.

మరి ఈ సినిమా ఎలా ఉందో పరిశీలిస్తే:

TAGGEDE LE POSTER 4

కథ ని పరిశీలిస్తే:

NAVEEN CHANDRA (నవీన్ చంద్ర) (ఈశ్వర్) ఓ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్. ఫ్రెండ్స్ కారణంగా ఎంజాయ్ చేయడానికి ఓ ప్రైవేట్ ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ నవీన్ చంద్రకి అనన్య రాజ్ (లీజా) పరిచయం అవుతుంది.

ఆ పరిచయం ప్రేమగా మారి రొమాన్స్ లోకి వెళ్ళి ఇంకా ఇద్దరు శారీరికంగా దగ్గర అవుతారు. అయితే, ఆ విషయాన్ని ఈ ప్లేస్ నియమ నిబందనలు కారణంగా ఇక్కడే మర్చిపోమని అనన్య రాజ్ (లీజా) నవీన్ చంద్రకి చెప్తుంది.

ఆ ఫీల్ నుండి ఈశ్వర్ బయట పడే టైమ్ లో కొన్ని నాటకీయ పరిణామాల మధ్య దేవి (దివ్యా పిళ్లై)తో నవీన్ చంద్ర పెళ్లి అవుతుంది. ఇద్దరు పెళ్లి తర్వాత ప్రేమను ఎంజాయ్ చేస్తూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు.

ఇంతలో  సడెన్ గా మళ్లీ అనన్య రాజ్ (లీజా) ఎంట్రీ ఇచ్చి.. నవీన్ చంద్ర ఫ్యామిలీ లైఫ్ ను డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది.

TAGGEDE LE 1

అప్పుడు  నవీన్ చంద్ర ఎలా రియాక్ట్ అయ్యాడు ?,

ఈ మధ్యలో ‘దండుపాళ్యం’ బ్యాచ్ కధ లోకి ఎలా వచ్చరూ  ?,

అలాగే పోలీస్ ఆఫీసర్ ర‌వి శంక‌ర్ పాత్ర కథను ఎలా నడిపింది ?

రొమాన్స్ లో ఆరాగన్స్ మిక్స్ అయితే జరిగే పరిణామాలు ఏంటి ?

అనే ప్రశ్నలకు జవాబులు కావాలి అనుకొంటే మీరు తప్పకుండా ఈ తగ్గేదే లే సినిమా చూడవలసిందే.

పైన ఉన్న  ప్రశ్నలకు మీరు కనెక్ట్ అయితే మీకు సినిమా నచ్చుతుంది. కనెక్ట్ కాకపోతే ఈ సినిమా మీకు నచ్చదు.

TAGGEDE LE POSTER

నటి నటుల నటన పరిశీలిస్తే: 

ఈ కథలో తగ్గనిది తగ్గేదే లే అనే రేంజ్ లో ఉన్నది దండుపాళ్యం బ్యాచ్ తాలూకు యాక్షన్ ఎపిసోడే. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించిన ర‌వి శంక‌ర్, తన నటనతో సినిమాకే హైలైట్ గా నిలిచారు.

 

ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లోని యాక్షన్ సీక్వెన్స్ లో ర‌వి శంక‌ర్ అద్భుతంగా నటించాడు.

హీరోగా నటించిన నవీన్ చంద్ర తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇంకా తనలో కూడా టైమింగ్ తో కుడికున్న కామిక్ సెన్స్ ఉంది అని నిరూపించుకున్నాడు.

TAGGEDE LE POSTER e1667631308433

‘దండుపాళ్యం’ బ్యాచ్ మొత్తం సినిమాని తమ భుజాలపై వేసుకుంది. ముఖ్యంగా మకరంద్ దేశ్ పాండే .. పూజా గాంధీ చాలా బాగా నటించారు. ఇక హీరోయిన్ గా నటించిన దివ్యా పిళ్లై తన పాత్రలో చాలా బాగా నటించింది.

అలాగే అనన్య రాజ్ కూడా తన స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్సీ తో మెప్పించింది. ఆమె కొన్ని ఎక్స్ ప్రేషన్స్ ను కూడా చక్కగా పలికించింది.

మొత్తంగా కధానాయకి లు  తమ టైమింగ్ తో బాగా అలరించారు. ఇక మిగిలిన నటీనటులు లో గెట్ అప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్,డాక్టర్ సమరం పాత్రలో పృద్వి  కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.

TAGGEDE LE STILL 2

కధ కధనం (SCREENPLAY) పరిశీలిస్తే:

 దర్శకుడు శ్రీనివాసరాజు కథను పేపర్ మీద బాగా రాసుకున్నా కధనం కధ మొదలు  పెట్టడంలో మాత్రం చాలా నెమ్మదిగా ఉన్నట్టు అనిపించింది.

ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా బోరింగ్ గా సాగుతుంది. అయినా ఓ మర్డర్ చుట్టూ కథను నడుపుతూ కూడా, దర్శకుడు కథలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ పెట్టలేకపోయాడు.

దీనికితోడు స్క్రీన్ ప్లే లో చాలా టర్నింగ్ పాయింట్లు ఉన్నాయి గానీ, ఒక్కటి కూడా సహజంగా అండ్ ఆసక్తిగా సాగదు. సినిమా చివరి వరకూ చాలా ట్రాక్స్ ప్లాట్స్ తోనే ప్లేను సాగతీశారు. స్క్రీన్  ప్లే లో కనీస ఇంట్రెస్ట్ కూడా లేదు.

TAGGEDE LE ITEM SONG

స్క్రీన్ ప్లే చాలా బోరింగ్ గా నడపడంతో సినిమా ఎవరికీ కనెక్ట్ కాదు. దీనికి తోడు ప్రతి పాత్ర ఒకే ఎమోషన్ తో ఎలాంటి బలమైన సంఘర్షణ లేకుండా చాలా నిస్సహాయతతోటి సాగింది.

అదేవిధంగా చాలా సీన్స్ అస్సలు లాజిక్ లేకుండా సాగాయి. సెకండ్ హాఫ్ బాగా బోర్ గా సాగింది. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అయితే.. చిరాకు తెప్పిస్తాయి. సైకోలు కూడా ఆ సీన్స్ ను ఇష్టపడకపోవచ్చు.

ముఖ్యంగా రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా అసలు మెప్పిస్తుందా అనేది కోటి రూపాయల లాటరీ లాంటిది. కోటి వినడానికి ఆనందాన్ని ఇస్తుంది కానీ ఖర్చు కి పనికిరాదు.

అలాగే అందరూ తగ్గేదే లే అంటారు కానీ, రెండు గంటలు అననీమూసుకొని సినేమ చూడండి అంటే ఏదో ఎక్సయిట్మెంట్ ఉంటే కానీ చూడారు. ఆ పాయింట్ తో కధ రాసుకుంటే కుదరదు కధనం లో చూపించాలి.

TAGGEDE LE

సాంకేతిక విభాగం పనితీరు పరిశీలిస్తే:

శ్రీనివాసరాజు దర్శకుడిగా కధ రాసుకోవడం లో ఆకట్టుకున్నా.. కథనంలో మాత్రం ఫెయిల్ అయ్యారు అనిపిస్తుంది. క్రైమ్ రీవెంజ్ కి క్యూట్ లవ్ స్టోరీ కలపడం తో కొంత ఆనాశక్తి తో ఎక్కడో ఏదో మిస్ అయ్యింది అన్నట్టు ఉంది.

కెమెరామెన్ గా చేసిన వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని క్రైమ్ సన్నివేశాల్లో వెంకట్ ప్రసాద్ పనితనం చాలా బాగుంది.

సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా నైనా గంగూలీ పాట, ఆ పాటను చిత్రీకరించిన విధానం మెప్పిస్తోంది. ఎడిటర్ వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

TAGGEDE LE POSTER 3

18 ఫ్ టీం ఒపీనియన్:

‘తగ్గేదే లే’ అంటూ క్రైమ్ అండ్ యాక్షన్ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో ఇంకా రెండు రోజులు ఆగితే తెలుస్తుంది. మా టీం కి మాత్రం ఇది స్లో నేరేషన్, సినిమాలో బోరింగ్ ట్రీట్మెంట్ ఎక్కువవడం, బలమైన కాన్ ఫ్లిక్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ సీన్స్ లేకపోవడం, మరియు ఎమోషనల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు ఈ సినిమాలో మిస్  అయ్యాయి అంటున్నారు. ఐతే,

హీరో నవీన్ చంద్ర, రవి శంకర్ నటన బాగుంది అంటున్నారు .. ఈ వారం సినిమా లు ఎక్కువ రిలీజ్ అవ్వడం వలన టైమ్ లేక ఇక్కడితో ముగించి మరో  రెండు రోజులలో మరన్ని  అప్ డేట్స్ తో తగ్గేదే లే సినిమా  రివ్యూ లో  కలుద్దాము.

18F MOVIE RATING: 2.5/5

  • కృష్ణ ప్రగడ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *