ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా అభిమన్యు సింగ్ కీలక పాత్రలో నటించిన మూవీ ‘సూర్యాపేట్ జంక్షన్’. యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు నిర్మాణంలో, రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో రూపోందిన ఈ మూవీ ఈ నెల 25న థియేటర్ లలో విడుదల కాబోతుంది.
ప్రముఖ నటుడు అభిమన్యు సింగ్ కీలక పాత్రలో నటించారు. గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ గా విడుదల కానుంది.
ఈ సందర్భంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ… ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ కు డిజిటిల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా రిలీజైన “మ్యాచింగ్.. మ్యాచింగ్” సాంగ్ తో పాటు టీజర్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. మంచి కథ ఉంటే తెలుగు ప్రేక్షకులు అదరిస్తారు, హిట్టు చేస్తారని ఎన్నో సార్లు రుజువైంది. అందుకే ఈ సినిమా చేశాం. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా చాలా సహజంగానే ఉంటాయి.
ఈ నెల 25న రిలీజ్ అయ్యే ఈ సినిమాను థియేటర్ లలో చూసి మీరందరూ మమ్మల్ని అదరిస్తారని ఆశిస్తున్నాను.’’ అని అన్నారు.
ప్రొడ్యూసర్ అనిల్ కుమార్ కాట్రగడ్డ మాట్లాడుతూ… “మా సూర్యాపేట్ జంక్షన్ మూవీ ఈ నెల 25న ఆంధ్రా, తెలంగాణాలలో గ్లోబల్ సినిమా డిస్ట్రిబ్యూషన్ లో విడుదల కావడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా సునీల్ గారికి, రాంమోహన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా సూర్యాపేట్ జంక్షన్ సినిమాని థియేటర్ లలో ప్రతి ఒక్కరూ చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం” అని అన్నారు.
సాంకేతిక నిపుణులు:
బ్యానర్ : యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్, టైటిల్ : సూర్యాపేట జంక్షన్, నిర్మాతలు : అనిల్ కుమార్ కాట్రగడ్డ , ఎన్.ఎస్ రావు,డైరెక్టర్ : నాదెండ్ల రాజేష్, స్టోరీ : ఈశ్వర్, మ్యూజిక్ : రోషన్ సాలూరి, గౌర హరి, డి.ఓ.పి : అరుణ్ ప్రసాద్, ఎడిటర్ : ఎం.ఆర్.వర్మ, కో డైరెక్టర్ : శ్రీనివాస్ కోర, లిరిక్స్ : ఎ.రహమాన్, పోస్టర్ డిజైనర్: ధనియేలె, రైటర్స్ : సత్య, రాజేంద్ర భరద్వాజ్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఎ పాండు, పీఆర్ఓ: కడలి రాంబాబు, దయ్యాల అశోక్.