Surya Purimetla’s First look from ARI Movie Out: ‘అరి’ సినిమా నుండి సూర్య పురిమెట్ల ఫస్ట్ లుక్ విడుదల !

IMG 20240122 WA01621 e1705925657433

ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “పేపర్ బాయ్” చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

‘అరి’ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన క్యారెక్టర్ లుక్స్, ట్రైలర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంగా బాల రాముని దివ్యాశిస్సులతో ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించిన సూర్య పురిమెట్ల క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేశారు. సూర్య పురిమెట్ల క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ‘అరి’ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్ధమవుతోంది.

‘అరి’ మూవీలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. ‘అరి’ సినిమా హిందీ రీమేక్ పై బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ‘అరి’ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా మూవీ టీమ్ అనౌన్స్ చేయనుంది.

నటీనటులు:

వినోద్ వర్మ , సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్, సురభి ప్రభావతి, అక్షయా శెట్టి, రిధిమా పండిట్, పి.అనిల్ కుమార్, నవీనా రెడ్డి, తమిళ బిగ్ బాస్ ఫేమ్ పావని రెడ్డి, జెమినీ సురేష్, ఐ డ్రీమ్ అంజలి, మనిక చిక్కాల, సుమన్, ఆమని, ప్రవళ్లిక చుక్కల, సురభి విజయ్, బ్యాంకు శ్రీనివాస్, సమీర్, మాణిక్ రెడ్డి, రాజ్ తిరందాస్, గాయత్రి భార్గవి, మీనా కుమారి, లావణ్య రెడ్డి, ఇంటూరి వాసు, జబర్దస్త్ సద్దాం, నీలా ప్రియ, యోగి ఖత్రి తదితరులు..

 

 

టెక్నికల్ టీమ్:

మ్యూజిక్ : అనుప్ రూబెన్స్ ,ఎడిటర్ : జి. అవినాష్ ,లిరిక్స్ : కాసర్ల శ్యాం, వనమాలి, కళ్యాణ్ చక్రవర్తి, కొరియోగ్రఫీ – భాను, జీతు ,ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్ ,స్టైలిస్ట్ : శ్రీజ రెడ్డి చిట్టిపోలు, సిరి చందన ,సినిమాటోగ్రఫీ : కృష్ణ ప్రసాద్, శివశంకర వరప్రసాద్ ,లైన్ ప్రొడ్యూసర్ : శివకాంత్ ,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వినయ్ ,పి. ఆర్. ఓ – జి యస్ కే మీడియా,సమర్పణ : ఆర్ వీ రెడ్డి ,నిర్మాతలు : శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారం రెడ్డి,రచన –దర్శకత్వం : జయశంకర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *