సూర్య కొత్త సినిమా #Suriya45 దర్శకుడు ఎవరో తెలుసా? 

IMG 20241127 WA0222 e1732725268291

హీరో సూర్య నెక్స్ట్ మెగా-ఎంటర్‌టైనర్ ‘సూర్య 45‘ పూజా కార్యక్రమంతో ఆనైమలైలోని అరుల్మిగు మాసాని అమ్మన్ ఆలయంలో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.

జోకర్, అరువి, ధీరన్ అధిగారం ఒండ్రు, ఖైదీ, సుల్తాన్, ఒకే ఒక జీవితం, ఫర్హానా వంటి బ్లాక్‌బస్టర్‌లను రూపొందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రొడక్షన్ హౌస్ మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ. మల్టీ ట్యాలెంటెడ్ ఆర్జే బాలాజీ మెగా-ఎంటర్‌టైనర్ కి దర్శకత్వం వహించనున్నారు.

IMG 20241127 WA0223

ఈ చిత్రం కోయంబత్తూర్‌లో ఫస్ట్ షెడ్యూల్‌ షూటింగ్ జరగనుంది. సూర్య, ఇతర ప్రధాన నటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు.

IMG 20241127 WA0225

ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు హై బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2025 సెకండ్ హాఫ్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రంలోని మిగతా నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలని మేకర్స్ తెలియజేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *