అమ్మ అనే పాత్రకు మొదట గుర్తు వచ్చేది అన్నపూర్ణమ్మ ..! టాలీవుడ్ లో ఎంత మంది అమ్మ పాత్రలు చేసినా సరే… అన్నపూర్ణమ్మ చేసిన అమ్మ పాత్రలు మాత్రం చిరస్థాయిలో నిలిచిపోతాయి అనేది వాస్తవ౦.
టాలీవుడ్ లో అసలు అమ్మ అంటే ఇలా ఉండాలి అంటూ ఆమె చేసిన అమ్మ పాత్రలు టాలీవుడ్ జనానికి చూపించాయి. సీనియర్ ఎన్టీఆర్ మొదలు చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్ వంటి అగ్ర హీరోలకు ఆమె అమ్మగా నటించి మెప్పించారు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన ఎంతగానో ఆకట్టుకునేది.
ముఖ్యంగా తెలుగు సినీ – జనాలకు అన్నపూర్ణమ్మ అనగానే అమ్మ పాత్ర కళ్ళ ముందు ఉంటుంది. అంతకు ముందు ఎంత మంది వచ్చినా సరే ఆమె చేసిన పాత్రలకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అప్పట్లో దర్శకులు కూడా అన్నపూర్ణమ్మ కోసం అంటూ ప్రత్యేకంగా అమ్మ పాత్రను డిజైన్ చేసేవారు అంటే అతిశయోక్తి కాదు.
టాలీవుడ్ జనాలు కూడా ఆమెను ఆదరించారు. తమిళ సినిమాల్లో ఆమెకు ఎక్కువ అవకాశాలు వచ్చినా సరే తెలుగు సినిమాలకే ఆమె ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. తన పాత్రకు న్యాయం చెయ్యాలి అనే తపనతో ఆమె నటించే వారు. తన పాత్రకు నటన ఎక్కువగా ఉంటేనే ఆమె సినిమాను అంగీకరించారు.
దాదాపు 80 సినిమాల్లో ఆమె అమ్మ పాత్రలు చేసింది. ఇక ఇప్పుడు ఆమె నటుడిగా మారిన సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొండేటికి నానమ్మ పాత్రలో నటిస్తున్నారు.
సురేష్ కొండేటి అభిమాని అనే ఒక వెబ్ ఫిలిం చేస్తున్నారు.ఆ సినిమాలో ఆమె సురేష్ కొండేటికి నానమ్మ పాత్రలో నటిస్తున్నారు. బషీర్ అమ్మ ప్రొడక్షన్స్ లో వస్తున్న అభిమాని వెబ్ మూవీకి రాంబాబు దోమకొండ దర్శకత్వం వహిస్తున్నారు.