రాజాకృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు’. తెలుగులోనే కాదు ప్రపంచ సినిమా చరిత్రలోనే ఎవరు చేయని విధంగా ఒకే షాట్లో సినిమా మొత్తాన్ని తెరకెక్కించి అందరిని ఆశ్చర్యశకితులను చేశాడు ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో సూపర్ రాజా. ఈ రోజు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా హీరో సూపర్ రాజా మాట్లాడుతూ.. క్రియేటివిటీనే బ్యాగ్రౌండ్, కసినే బలం ఈ రెండు ఆయుధాలతో సినిమా పరిశ్రమలో అద్భుతాలు చేయొచ్చు అంటున్నారు. గివ్ అప్ చేయకుండా ప్రయత్నిస్తే ఒక మనిషి ఏం చేయగలడో సెప్టెంబర్ 19న థియేటర్లో చూస్తారు అన్నారు. సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణం తన పేరెంట్స్ అని చెప్పారు. అలాగే ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలిపారు.
ఎన్నో రోజులు చీకట్లో ఉండి వెలుగు కోసం ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నం ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతుందని చెప్పారు. తనను నమ్మి డబ్బులు పెట్టిన తన పేరెంట్స్ అండ్ అన్నయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆయను నమ్మి నటించిన నటీనటులకు, డిస్ట్రీబ్యూట్ చేస్తున్న మైత్రీ వాళ్లకు, ఈవెంట్ చీఫ్ గెస్ట్ గా వచ్చిన అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు.
ఈ సినిమాలో నటించడం చాలా స్పెషల్ ఫీల్ అవుతున్నట్లు హీరోయిన్ చందన పాలంకి తెలిపారు. మొదట సినిమా గురించి చెప్పినప్పుడు ఒకే షాట్ లో ఎలా తీస్తారు అనే భయం ఉండేది కానీ తరువాత సూపర్ రాజా కాన్ఫిడెన్స్ చూసిన తరువాత ఆ భయం పోయిందని, కేవలం సూపర్ రాజాను నమ్మి తన పాత్ర చేసినట్లు చెప్పారు. అలాగే సూపర్ రాజా చాలా స్పాంటీనియస్ యాక్టర్ అని చెప్పారు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని సెప్టెంబర్ 19న థియేటర్లో అందరూ చూడాలని చెప్పారు.
ఇలాంటి సినిమా ఎప్పుడు చూసి ఉండరు, ఇలాంటి ఈవెంట్ కూడా ఎప్పుడు జరిగి ఉండదు అని వంశీ గోనె అన్నారు. ఫస్ట్ రోజు నుంచి ఏ విజన్ తో ఉన్నారో, ఎంత ఎనర్జీతో ఉన్నారో సూపర్ రాజా ఇప్పటి వరకు అదే ఎనర్జీ తో ఉన్నారు.
1400 డైలాగ్స్ 100 మినట్స్ చెప్పడం అంటే మాములు విషయం కాదు. దాని కోసం చాలా కష్టపడ్డామన్నారు. దాదాపు రెండు సంవత్సరాలు సినిమా కోసం కష్టపడ్డామని వంశి చెప్పారు. సినిమా కోసం వందల సార్లు ప్రాక్టీస్ చేశామన్నారు. ఈ సినిమా తనకు ఎంతో స్పెషల్ అని చెప్పారు. కచ్చితంగా సినిమాను థియేటర్లో చూడాలని కోరారు.
మైత్రి డిస్ట్రీబ్యూటర్ శశీధర్ మాట్లాడుతూ.. సూపర్ రాజా గురించి సోషల్ మీడియాలో తెలుసుకొని ఆయనతో మాట్లాడాను. ఆయనతో మాట్లాడినప్పుడు చాలా ఎనర్జీగా, చాలా పాజిటీవ్ గా మాట్లాడారు అని చెప్పారు. సూపర్ రాజా ఎంతో మంది యువతకు ఇన్సిపిరేషన్ అవుతారని చెప్పారు.
జీవితంతో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకోని నిలబడ్డారు కాబట్టే ఈ రోజు ఇంతమంది అభిమానాన్ని చురొగొన్నారు అని చెప్పారు. సినిమా చూడడానికి ముందే సూపర్ రాజాకు సపోర్ట్ చేయాలని డిసైడ్ అయ్యాము. తరువాత సినిమా చూశాక షాక్ అయ్యాను అని శశీధర్ చెప్పారు.
సింగిల్ టేక్ లో ఈ సినిమా ఎలా చేశారు అనే ఆశ్చర్యం వేసింది అన్నారు. సూపర్ రాజా ఎఫర్ట్ కి, ఆయన క్రియేటివిటీకీ హ్యాండ్సప్ చెప్పారు. అలాగే మంచి కంటెంట్ ను మైత్రీ నవీన్, రవి, విశ్వప్రసాద్ ఎప్పుడూ ప్రొత్సహిస్తారని చెప్పారు. ఇంత కష్టపడి సూపర్ రాజా తెరకెక్కించిన ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుందని చెప్పారు. అందరూ సెప్టెంబర్ 19న థియేటర్లో సినిమా చూడాలని కోరారు.
చిత్రం : ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు
బ్యానర్ : రాజా కృష్ణ ప్రొడక్షన్స్
నటీనటులు:
సూపర్ రాజా, వంశీ గోనె, చందన పాలంకి, రమ్య ప్రియ, తదితరులు..,
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: సూపర్ రాజా, నిర్మాత: సూపర్ రాజా, మ్యూజిక్ డైరెక్టర్: సిద్దార్థ్ శివదాసని, సబు వర్గీస్.