మొదటి ఇండియన్ సూపర్ హీరో చిత్రంగా నిర్మిస్తున్న A – మాష్టర్ పీస్ చిత్ర దర్శకుడు సుక్కు పూర్వాజ్ తన కొత్త చిత్రం టైటిల్ ఈ రొజు విడుదల చేశారు.
సినిమా బండి ప్రొడక్షన్స్ లో షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటున్న A – మాష్టర్ పీస్ సినిమా కి దర్శకత్వం వహిస్తున్న సుక్కు పుర్వాజ్ గారూ తన తదుపరి కొత్త చిత్రం టైటిల్ బ్లాక్ బర్డ్ ( BLACK Bird) గా రిజిస్టర్ చేసుకొని మీడియా కు ఈ రోజు విడుదల చేశారు.
టైటిల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా సుక్కు పూర్వాజ్ మాట్లడుతూ: – నా సినిమా కేరియర్ లో భారీ బడ్జెట్ చిత్రంగా చేస్తున్నా ఈ బ్లాక్ బర్డ్ చిత్రం యొక్క టైటిల్ ప్రకటన సాధారణంగా చేస్తున్నా..
బ్లాక్ బర్డ్ సినిమా టైటిల్ రిజిస్టర్ చేసి పేపర్ వర్క్ ప్రారంభించాను. ఇది సినిమాటిక్ అడ్వెంచర్, హృదయాన్ని కదిలించే థ్రిల్లర్, ఇది మానవ సంస్కృతి యొక్క సుసంపన్నమైన బ్యాలెన్స్‌లో లోతుగా మునిగిపోతుంది, తెలియని అంచు, ఆకుపచ్చ ముసుగు యొక్క రహస్యాల గుండా థ్రిల్లింగ్ రైడ్, భయం, మోహం మరియు మనోహరమైన ప్రయాణం. మనుగడ కోసం పోరాడండి మరియు విశ్వంలో నిజంగా ఒంటరిగా ఉండటం అంటే ఏమిటని ప్రశ్నించే థ్రిల్లింగ్ కథనమే ఈ బ్లాక్ బర్డ్ కధ.
ఈ బ్లాక్ బర్డ్ సినిమా కి సంభందించిన మరన్ని వివరాలు , టాప్ స్టార్స్ యొక్క వివరాలు మా “ఎ మాస్టర్ పీస్” విడుదల అయిన తర్వాత తెలియజేస్తాను.
సో మనం బ్లాక్ బర్డ్ (Black Bird) మూవీ గురించిన మరికొన్ని విశేషాలు తెలుసుకోవాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే..
ప్రస్తుతానికి సుక్కు పూర్వాజ్ సినిమా బండి ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్న A – మాష్టర్ పీస్ సినిమాకీ అల్ ది బెస్ట్ చెప్పెద్దమా!