Star Writer Abburi Ravi Special Interview’ఆ ఒక్కటీ అడక్కు రైటర్ అబ్బూరి రవి ఇంటర్వ్యు!

IMG 20240430 WA0202 e1714478993717

కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ తో రాబోతున్నారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్నారు.

స్టార్ రైటర్ అబ్బూరి రవి చిత్రానికి డైలాగ్స్ అందించారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.

మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానున్న నేపధ్యంలో డైలాగ్ రైటర్ అబ్బూరి రవి మా 18F మూవీస్ విలేకరి తో సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

IMG 20240430 WA0172

ఆ ఒక్కటీ అడక్కు’ లాంటి కథ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన అంశాలు ఏమిటి ? 

-ఈ కథ దర్శకుడు మల్లి గారిది. ప్రతి ఒక్కరి జీవితంలో సెటిల్ అవ్వడం అంటే ఉద్యోగం రావడం, పెళ్లి కావడం. అయితే ఇప్పుడు పెళ్లి విషయంలో యావరేజ్ ఏజ్ మారిపోతుంది. ఒకప్పుడు ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత చేసుకునేవారు. ఇప్పుడు ఎప్పుడు చేసుకుంటారో ఎవరికీ తెలీదు. అందరూ సెటిల్మెంట్ గురించే మాట్లాడతారు.

ఈ సినిమాలో ఒక మాట వుంటుంది. ‘సెటిల్మెంట్ అంటే ఉద్యోగం, పెళ్లి కాదు.. మనకి ఒక అవసరం వచ్చినపుడు పక్కవాడి దగ్గర చేయి చాచకపోవడం”. ఇప్పుడు కొన్నిటికి అర్ధాలు మారిపోయాయి. పెళ్లి అనేది పూర్తిగా శాస్త్రోక్తమైనది. పెళ్లిలో జీలకర్ర బెల్లం పెట్టడం వెనుక సైన్స్ వుంది. జీలకర్ర బెల్లంలో ఎలక్ట్రసిటీ ప్రవహిస్తుంది.

IMG 20240430 WA0207

ఇద్దరి ఎనర్జీని బ్యాలెన్స్ చేసే ప్రక్రియ అది. ఆ సమయంలో ఆత్మ స్థానాన్ని చూడామని చెబుతారు. ఇంత శాస్త్రం వున్న పెళ్లిని లెక్కలేకుండా చేసుకునే పరిస్థితులు చూస్తున్నాం. పైగా పెళ్లి ఆలస్యంగా జరుగుతుంటే.. మనకి ఎంత లేట్ అయితే అంత ఆనందపడేవారు వుంటారు(నవ్వుతూ). అలాగే పెళ్లి ఆలస్యమైతే మానసికంగా క్రుంగుబాటుకి గురైనవారు కూడా వుంటారు.

నిజానికి ఇది సీరియస్ ఇష్యూ. ఇలాంటి సబ్జెక్ట్ ని వినోదాత్మకంగా చెబుతూనే ఎమోషనల్ కనెక్ట్ చేసేలా చూపించడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా సందేశం ఇవ్వడం లాంటిది వుండదు. కానీ ఒక జీవిత అనుభవాన్ని పంచుకునేలా ఆలోజింపచేసేలా వుంటుంది.

ఈ కథకు ‘ఆ ఒక్కటీ అడక్కు’ లాంటి క్లాసిక్ టైటిల్ తీసుకోవడం ఎలా అనిపించింది ? 

-నిజానికి భయం వేసింది. ఈవీవీ గారి క్లాసిక్ సినిమా అది. అయితే ఈ టైటిల్ ని నరేష్ గారే ప్రతిపాదించారు. ఈ కథకు ఈ టైటిల్ సరిపొతుందని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకున్నాకే పెట్టడం జరిగింది.

IMG 20240430 WA0204

ఇందులో పెళ్లి గురించి ఎలాంటి అంశాలు చెప్పబోతున్నారు?

-పెళ్లి పవిత్రమైనది. ఒకప్పుడు ఇంట్లో పెళ్లి చూపులు జరిగేవి. అప్పుడు ఇంట్లో సాంఘిక పరిస్థితులు తెలిసేవి. కుటుంబం గురించి అర్ధమైయింది. ఇప్పుడు చాలా వరకూ హోటల్స్ లో పెళ్లి చూపులు జరగడం, సోషల్ మీడియా, రీల్స్ చూసి పెళ్లి చూపులు చూసుకునే సందర్భాలు రావడంతో అసలు పరిస్థితులు అర్ధం కావడం లేదు. పెళ్లి అనేది అంత తేలిగ్గా వుండకూడదు కదా. ఒక బంధం బలంగా నిలబడాలంటే చాలా జాగ్రత్తగా వుండాలి. ఇలాంటి చాలా ఆసక్తికరమైన అంశాలని ఇందులో ప్రేక్షకులని ఆకట్టుకునే చూపించడం జరిగింది.

కామెడీ, ఎమోషన్ ని ఎలా బ్యాలెన్స్ చేశారు ? 

-ఇందులో క్యారెక్టర్, సిట్యువేషన్ లో కామెడీ వుంది. సిట్యువేషన్, కంటెంట్ లో మేటర్ వుంటే కామెడీ అద్భుతంగా రాయొచ్చు. ఇందులో సహజంగానే కామెడీ వుంది. ప్రేక్షకుల మొహంలో సహజంగానే నవ్వు విచ్చుకుంటుంది.

ఇందులో నరేష్ గారికి జామి లివర్ కి మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ హిలేరియస్ గా వుంటాయి. సిట్యువేషన్ వుంటే ఆటోమేటిక్ గా ఫన్ రాయొచ్చు. ఇది పెళ్లికాని ప్రతి వారు కోరుకునే కంటెంట్. క్లీన్ ఎంటర్ టైనర్.

IMG 20240429 WA0131

నరేష్ గారు కామెడీ రోల్స్ తో పాటు ఇంటెన్స్ ఎమోషనల్ రోల్స్ కూడా చేశారు.. అప్పటికి ఇప్పటికి ఆయనకి ఏది బాగా నప్పుతుందని భావిస్తున్నారు ? 

-నరేష్ గారు అన్నీ అద్భుతంగా చేయగలరు. కాకపొతే మనం ఎక్కువ ఆయనలో అల్లరిని ఇష్టపడ్డాం. ఇప్పటికీ ఎవరిని నడిగినా ‘గాలి శీను’ అంటారు, ‘నేను’ సినిమా గురించి చెప్తారు. ఆయన అన్నీ చేయగలరు. దర్శకుడు కోరుకునే పాత్ర కోసం ఆయన ఏం కావో అది చేస్తారు. ఈ సినిమా నరేష్ గారి జోనర్. ఆయన క్యారెక్టరైజేషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది. టైమింగ్ అద్భుతంగా వుంటుంది. తప్పకుండా వర్క్ అవుట్ అవుతుంది.

IMG 20240430 WA0203

 ఈ సినిమా ఫస్ట్ కాపీ చుసుకున్నప్పుడు ఎలా అనిపించింది ?

-చాలా హ్యాపీగా అనిపించింది. ఇంటర్వెల్ అద్భుతంగా అనిపించింది. అలాగే ఈ సినిమాకి సోల్ అయిన క్లైమాక్స్ అద్భుతంగా వర్క్ అవుట్ అయ్యింది. సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా వున్నాం.

ఒక కొత్త దర్శకుడు కథతో మీ దగ్గరికి వచ్చినపుడు వారికి ఎలాంటి కంఫర్ట్ ఇస్తారు ? 

-ఒక దర్శకుడు హీరోకి, నిర్మాతకి కథ చెప్పి ఒప్పిస్తాడు. అంటే తను ప్రూవ్ చేసుకున్నట్లే. ఎవరొచ్చినా ఇదే మాట చెబుతా. మన మధ్య ఒక కథ వుంది. ఆ కథకు ఎలాంటి న్యాయం చేయాలో దాని గురించే చర్చిద్దామని స్పష్టంగా చెబుతా. కొత్త, పాత అని వుండదు. ఏ దర్శకుడితోనైనా పని చేసే విధానం ఒకేలా వుంటుంది. దర్శకుడు తీసుకొచ్చిన కథని గొప్పగా ఎలా చెప్పాలన్నదే ఆలోచిస్తాను.

IMG 20240430 WA0174

ఇందులో లవ్ ట్రాక్ ఎలా వుంటుంది ? 

-ఇందులో లవ్ ట్రాక్ ఫన్నీగా వుంటుంది. చాలా ఆసక్తికరంగా వుంటుంది. రెగ్యులర్ కి భిన్నంగా వుంటుంది.

వెన్నెల కిషోర్, వైవా హర్ష పాత్రలు కూడా హిలేరియస్ గా వుంటాయి. ఫన్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.

మీరు దర్శకత్వం ఎప్పుడు చేస్తారు ? 

-చేస్తాను. నా ప్రయత్నాల్లో నేను వున్నాను. తప్పకుండా చేస్తాను.

faria 1

ఈ సినిమా నిర్మాత గురించి ?  

-రాజీవ్ గారికి పెద్ద యానిమేషన్ కంపెనీ వుంది. దాదాపు ఆరువందలకు పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఆయన ఆఫీస్ కి వెళ్లి చూశాను. చాలా సింపుల్ గా వుంటారు. ఆయన బ్యానర్ కి మంచి జరగాలని ఎప్పుడూ కోరుకుంటాను. ఆయన మనిషిని మనిషిలా ట్రీట్ చేస్తారు. అలాంటి వ్యక్తులు పరిశ్రమలో నిలబడాలని కోరుకుంటున్నాను.

పరిశ్రమలో ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు కదా.. ఈ జర్నీ ఎలా వుంది ? 

-చాలా బావుంది. నిజానికి ఎన్ని సినిమాలు రాశానో కూడా తెలీదు.(నవ్వుతూ).

faria

గోపి సుందర్ మ్యూజిక్ గురించి ? 

-ఇందులో ఒక పాటకు తప్పించి మిగతా పాటల మ్యూజిక్ సిట్టింగ్ లో కూర్చున్నాను. కథకు కావాల్సిన పాటలు ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఒకసారి కథపై పట్టుదొరికాక ఇంక ఆయన చెప్పాల్సిన పని లేదు. దర్శకుడు మనసులో వున్న ట్యూన్ ని ఇస్తారు. ఇందులో పాటలు, నేపధ్య సంగీతం హత్తుకునేలా వుంటాయి.

IMG 20240430 WA0173

కొత్త రాస్తున్న సినిమాలు ? 

-గూఢచారి2, డెకాయిట్ జరుగుతున్నాయి.

మళ్ళీ నటించే అవకాశం ఉందా ? మీకు ఎలాంటి జానర్స్ ఇష్టం ?

ప్రస్తుతానికి నటనపై ద్రుష్టి లేదు. యాక్షన్ థ్రిల్లర్స్ ని ఇష్టపడతాను.

ఒకే థాంక్యూ అండ్ అల్ ది బెస్ట్ రవి గారు..,

   *కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *