SrirangaNeethulu Movie Review & Rating: నిజాయితీ తో కూడిన నీతి కధలు ఇప్పటి జనాలకు నచ్చుతాయా! !

sriranganeethulu movie review by 18fms e1713068291643

చిత్రం: శ్రీరంగ నీతులు

విడుదల తేదీ : ఏప్రిల్ 11, 2024

నటీనటులు: సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌, కిరణ్‌, రాగ్‌ మయూర్‌, దేవి ప్రసాద్ తదితరులు

దర్శకుడు: ప్ర‌వీణ్‌ కుమార్ వీఎస్ఎస్

నిర్మాత: వెంకటేశ్వరరావు బల్మూరి

సంగీత దర్శకుడు: హర్షవర్థన్‌ రామేశ్వర్‌, అజయ్‌ అరసాడ

సినిమాటోగ్రఫీ: టీజో టామీ

ఎడిటింగ్: సశాంక్ వుప్పుటూరి

మూవీ: శ్రీరంగ నీతులు రివ్యూ  (SrirangaNeethulu Movie Review) 

డెబ్యూ దర్శకుడు ప్ర‌వీణ్‌ కుమార్ దర్శకత్వం లో వచ్చిన సినిమా ‘శ్రీరంగ నీతులు’. కాగా ఈ సినిమా పబ్లిక్ రిలీజ్ కి రెండు రోజుల ముందే మీడియాకి  ప్రీమియర్ షోలు వేశారు. వర్ధమాన సంషేశనల్ నటుడు సుహాస్, కంచరపాలెం ఫేమ్ కార్తీక్ రత్నం మరియు బేబీ ఫేమ్ విరాజ్ అశ్విన్ నటించిన ఈ శ్రీరంగనీతులు సినిమా తెలుగు ప్రేక్షకులను  ఏ మేరకు మెప్పించిందో మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకుందామా !

sriranganeethulu movie review by 18fms 2

కధ పరిశీలిస్తే (Story Line): 

ఈ ‘శ్రీరంగ నీతులు’ సినిమా కథ మూడు కధాలుగా మూడు పాత్రల చుట్టూ సాగుతుంది. బస్తీకి చెందిన శివ(సుహాస్‌) ఓ టీవీ కంపెనీలో జాబ్‌ చేస్తుంటాడు. ఐతే, స్కూల్ గ్రౌండ్ లో అతను తన ఫోటోతో పెద్ద ఫ్లెక్సీ పెడతాడు. దాన్ని ఆ గల్లీ లొని తనకు గిట్టని వాళ్ళు ఎవరో తీసేస్తారు.

పాత దాని ప్లేస్ లో కొత్త ఫ్లెక్సీ వేయించాలనే పట్టుదలతో ఉంటాడు ?,

ఫ్లేక్స్ ని తొలగించింది ఎవరు ? ఎందుకు ?, 

దాని కోసం అతను ఏం చేశాడు ? అనేది  శివ కథ.

మరో కధలొని పాత్ర విషయానికి వస్తే.. వరుణ్‌ (విరాజ్‌ అశ్విన్‌), ఐశ్వర్య(రుహానీ శర్మ) ప్రేమించుకుంటారు. తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పలేక వరుణ్‌ భాద్యపడుతుంటే…

ఐశ్వర్య ఫోర్స్ తో వరుణ్ ఏమి చేశాడు ?

ఐశ్వర్య కి వరుణ్ కి మద్య గోడవకి కారణం ఏమిటి ?

 చివరకు, ఐశ్వర్య – వరుణ్  కలిశారా? లేదా? అనేది రెండో కథ.

మూడో కధలొని పాత్ర విషయానికి వస్తే.. బాగా చదువుకొన్న కార్తిక్‌(కార్తీక్‌ రత్నం) ఫ్రెండ్స్ వలన డ్రగ్స్‌కి బానిష అయ్యి జులాయిగా తిరుగుతుంటాడు.

కార్తిక్‌ ని మార్చడానికి అతని తండ్రి (దేవి ప్రసాద్) ఎలాంటి ప్రయత్నం చేశాడు ?

అసలు కార్తీక్ డ్రగ్స్ కి అలవాటు పడడానికి కారణం ఏమిటి ?,

ఉన్నత చదువు చదివిన కార్తీక్ కి ఉన్న లోపం ఏంటి ?, అనేది మూడో కథ.

ఈ మూడు కథలలొని పాత్రధారులు చివరకు ఏమి చేశారు ?, మూడు కధలు ఎలా ముగిశాయి ? అనే విశయాలు తెలుసుకోవాలి అంటే మీకు దగ్గరలోని దియేటర్ కి వెళ్ళి సినిమా చూడవలసిందే !.

sriranganeethulu movie review by 18fms 3

కధనం పరిశీలిస్తే (Screen – Play):

‘శ్రీరంగ నీతులు’ సినిమాలో ని కధలు మన సమాజం లో రెగ్యులర్ గా జరుగుతున్నావే అయినా  సినిమా గా వ్రాసుకొన్న కథల యొక్క కధనం (స్క్రీన్ – ప్లే)  చాలా వీక్ గా ఉంది.  రెగ్యులర్ సినిమా ప్రేక్షకులను కూడా ఈ సినిమా కధనం ఏమాత్రం ఆకట్టుకునే విధంగా సాగలేదు. ముఖ్యంగా ఎమోషనల్ గా సాగే కథకు అవసరం లేని కొన్ని సినిమాటిక్ సీన్స్ ఎక్కువైపోయాయి.

పైగా ఆ సీన్స్ కూడా లాజిక్ లేకుండా సాగడం.. అలాగే కామెడీ కోసమని అనవసరమైన సీన్స్ ను ఇరికించడం కూడా సినిమాకి మైనస్ అయ్యింది. పైగా స్లో నేరేషన్ తో పాటు ఆసక్తి కలగించలేని కొన్ని కీలక సన్నివేశాల కారణంగా స్క్రీన్ -ప్లే లో సరైన ప్లో కూడా లేకుండా పోయింది.

పైగా చాలామంది సేనియర్ నటులు ఉన్నప్పటికీ, సినిమా కధనం లో బలమైన ఎమోషనల్ సీన్స్ కూడా పడలేదు.  రెండవ అంకం (సెకండ్ హాఫ్) కధనం లో చాలా టర్నింగ్ పాయింట్లు ఉన్నాయి గానీ, అవి కూడా ఆసక్తిగా అనిపించవు.

sriranganeethulu movie review by 18fms 4

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

దర్శకుడు ప్ర‌వీణ్‌కుమార్ వీఎస్ఎస్ రాసుకున్న సున్నితమైన కథలు సమహారమే ఈ సినిమాకు ప్రధాన బలం. ప్రవీణ్ భావోద్వేగమైన పాత్రలతో సమాజం లో జరుగుతున్న చిన్న చిన్న సమస్యలకు సున్నితమైన మెసేజ్ ను అంతర్లీనంగా చెప్పిన విధానం బాగుంది. అలాగే, ప్రధానంగా సాగే మూడు పాత్రలు కొన్ని చోట్ల బాగానే ఆకట్టుకున్నాయి.

వీటితో పాటు ప్ర‌వీణ్‌ కుమార్ టేకింగ్ సినిమాకు కావాల్సినంత సహజత్వాన్ని అందించింది కానీ, తాను అనుకున్న కధలను స్క్రిప్ట్ గా బాగా రాసుకొన్నా, స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేయలేకపోయారు అనిపిస్తుంది. ఇంకా కధ పరంగా ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకుడు ప్ర‌వీణ్‌ కుమార్ మాత్రం సినిమాని ఆ దిశగా నడిపలేకపోయారు.

ఇక కీలక పాత్రల్లో సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఎంతో సహజంగా నటించి మెప్పించారు. శివ, వరుణ్ మరియు కార్తీక్ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సుహాస్‌ పాత్రలోని అమాయత్వం, కార్తీక్‌ ర‌త్నం పాత్రలోని సైకోజం, రుహానిశ‌ర్మ‌ భయం, విరాజ్ అశ్విన్‌ ఆవేదనని పర్ఫెక్ట్ గా ప్రెసెంట్ చేశారు. మొత్తానికి సినిమాలో పెద్దగా బలమైన సీన్స్ లేకపోయినా పాత్రలన్నీ సమస్యలతో సాగడం వల్ల సినిమాకి ప్లస్ అయ్యింది.

ఇక మిగిలిన ప్రధాన పాత్రల్లో నటించిన రాగ్‌ మయూర్‌, దేవి ప్రసాద్ లు కూడా చాలా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

Sriranga Neethulu Trailer Launch pics 13

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:

టీజో టామీ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. కొన్ని షాట్స్ చాలా న్యాచురల్ గా పిక్ట్యూరైజ్ చేశారు.

సంగీత దర్శకులు హర్షవర్థన్‌ రామేశ్వర్‌, అజయ్‌ అరసాడ అందించిన సంగీతం పర్వాలేదు. BGM కొంతమేరకు ఆకట్టుకొంటుంది.

సశాంక్ వుప్పుటూరి ఎడిటింగ్ వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది.

నిర్మాత వెంకటేశ్వరరావు బల్మూరి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. తక్కువ బడ్జెట్ లోనైనా న్యాచురల్ గా సినిమా ని నిర్మించారు.

Sriranga Neethulu Trailer Launch pics

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

ఈ ‘శ్రీరంగ నీతులు’ సినిమా కధలు పరంగా ఓకే అనిపించినా, కధనం మాత్రం  స్లో గా కధకు సంభంధం లేని కొన్ని సీన్స్ తో నడుస్తోంది. కథాకథనాలు ఆసక్తి కరంగా సాగకపోవడం, సినిమాలో సరైన కాన్ఫ్లిక్ట్ లేకపోవడం వంటి అంశాలు తో సినిమా స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం  వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి.

అయితే కధాలలోని పాత్రలకు సరైన నటులులను తీసుకోవడం వలన వారి సహజ నటన వలన కొన్ని కీలక సన్నివేశాలు బాగున్నాయి. ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం ప్రేక్షకులని నిరాశ పరిచింది అని చెప్పవచ్చు.

Sriranga Neethulu Trailer Launch pics 11

చివరి మాట: రొటీన్ నీతి కధలు !

18F RATING: 2.25/5

   * కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *