సెవెన్ స్టార్ క్రియేషన్స్ మరియు ఆడియన్స్ పల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ద్వారా ప్లాన్ బి డైరెక్టర్ కె.వి రాజమహి మరియు సునీత రాజేందర్ దేవులపల్లి నిర్మిస్తున్న చిత్రం మూడో కన్ను.
అమెరికాలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా నిర్మిస్తున్న ఈ ఆంథాలజీ చిత్రానికి నలుగురు కొత్త దర్శకులయిన సూరత్ రాంబాబు, కె బ్రహ్మయ్య ఆచార్య, కృష్ణమోహన్, మావిటి సాయి సురేంద్రబాబు వీళ్ళని పరిచయం చేస్తున్నారు. నాలుగు కథలు, నలుగురు దర్శకులు,
ఈవెంట్లో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ప్రొడ్యూసర్ మరియు రాజ్ మహి నాకు బాగా తెలిసినవాడు ఎప్పట్నుంచో అతను నాకు తెలుసు. సినిమాల్లో కానీ కథని నమ్మి సునీత రాజేందర్,మరియు కె.వి రాజమహి నిర్మాతగా వచ్చారు .
ఈ సినిమా మీద ఒక మంచి కాన్ఫిడెన్స్ ఉంది. ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. చిన్న సినిమాలే మంచి సక్సెస్ సాధిస్తాయి. ఈ ట్రైలర్ చాల బాగుంది ఇప్పుడే చూశాను , ఈ టీంకి పనిచేసిన వాళ్లందరికీ మరియు నలుగురు డైరెక్టర్స్ కి అల్ ది బెస్ట్ చెప్పారు.
దర్శకుడు నటుడు వీరశంకర్ గారు మాట్లాడుతూ:– KV రాజమహి ఒక దర్శకుడు అయి ఉండి తాను కొత్తగా నలుగురు డైరెక్టర్స్ పరిచయం చేయటం గొప్ప విషయం తాను రాసె కథలు ఒక రియల్ ఇన్సిడెంట్ ద్వారా ఉంటాయి . మంచి మెసేజ్ తో కూడిన కథలతో ఉంటాయి , ఈ సినిమాలో నేను కూడా నటించాను. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది నమ్మకం ఉంది .
నటి మధవిలత, మాట్లాడుతూ :ఈ సినిమాలో ఒక మంచి కీ రోల్ ప్లే చేశాను ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్స్ మరియు ప్రొడ్యూసర్స్ కి థాంక్స్ చెప్పనుకుంటున్నాను.
ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన సూర్య, మహేష్ వడ్డి, నిరోష, కౌశిక్ రెడ్డి, ప్రదీప్ రుద్ర, దయానంద రెడ్డి, శశిధర్ కౌసరి, దేవి ప్రసాద్, మాధవి లత, చిత్రం శ్రీను, సత్య శ్రీ, మధు, దివ్య, వీర శంకర్, రూప, ఇంకా పలుగురు మాట్లాడుతూ ఈ చిత్రం అందరూ చూడదగిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించబోతున్న కొత్త కాన్సెప్ట్ అని, కొత్త టాలెంట్ తో వస్తున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుకున్నారు.
అలాగే ఈ చిత్ర నిర్మాతలైన కె.వి రాజమహి మరియు సునీత రాజేందర్ లు మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించిన సాయికుమార్, శ్రీనివాసరెడ్డి, కాశీ విశ్వనాథ్ మరియు ఇతర నటీనటులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రాన్ని ఆదరించాలని వేడుకున్నారు.
ఈ చిత్రానికి కథ కథనం మాటలు కె.వి రాజమహికి ఇప్పటికే టీజర్ రిలీజ్ అయి మంచి ప్రేక్షాదరణ పొందిది ఈ చిత్రం జనవరి 26న లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాము.
నటీనటులు:
సాయికుమార్ ,శ్రీనివాస్ రెడ్డి ,నిరోషా ,వీర శంకర్,కాశి విశ్వానాథ్ ,మాధవి లత,ప్రదీప్ రుద్ర ,దేవి ప్రసాద్ ,సూర్య ,మహేష్ వడ్డి ,చిత్రం శ్రీను ,దయానంద్ రెడ్డి ,శశిధర్ కౌసూరి ,కౌశిక్ ,సత్య ,సుజిత్ ( చైల్డ్ ఆర్టిస్ట్ ) ,సమన్విత ( చైల్డ్ ఆర్టిస్ట్ )
సాంకేతిక వర్గం:
ప్రొడ్యూసర్స్ : కె . వి రాజమహి ,సునీత రాజేందర్ దేవులపల్లి ,కో ప్రొడ్యూసర్స్ : సాయి సూరజ్ ,శ్రీనివాస్ కలంచ,స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ :కే. వి. రాజా మహి ,డైరెక్టర్స్ : సూరత్ రాంబాబు ,కే. బ్రహ్మయ్య ఆచార్య ,కృష్ణ మోహన్ ,మావిటి సాయి సురేంద్రబాబు ,మ్యూజిక్ డైరెక్టర్ : స్వర ,ఎడిటర్ : మహేష్ మేకల ,కెమెరామెన్స్ : ముజీర్ మాలిక్ ,అక్షయ్ శ్రీధర్ ,వెంకట్ మన్నం ,ఆర్ట్ డైరెక్టర్ :కృష్ణ చిత్తనూరు ,లిరిక్స్ : మామిడి అక్షిత ,బోయిన సంపత్ ,గడ్డం లక్ష్మయ్య ,అడిషనల్ డైలాగ్స్ ( మౌన శ్రీ మల్లిక్ ) ,రచన సహకారం :భైరి నిరంజన్ అండ్ దేవేందర్ వి ఎఫ్ ఎక్స్ ,సతీష్ కోరుకొండ ,పి.ఆర్వో. శ్రీపాల్ చొల్లేటి.