Speed 220 Movie Song Viral in social media: సోషల్ మీడియాను ఊపేస్తున్న స్పీడ్220 చిత్రం స్పెషల్ సాంగ్!

Speed 220 Movie Song Viral in social media e1714028993806

విజయలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఫణి కొండమూరి సమర్పణలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ స్పీడ్220. ఈ చిత్రానికి హర్ష బెజగం కథ-కథనం-దర్శకత్వం అందించారు. హేమంత్, గణేష్ ఇద్దరు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రీతి సుందర్, జాహ్నవి శర్మ కథానాయకులుగా నటిస్తున్నారు.

Speed 220 Movie Song Viral in social media3

ఈ చిత్రం నుంచి తాజాగా ఓ స్పెషల్ సాంగ్ విడుదల అయింది. ప్రముఖ డాన్సర్ స్నేహ గుప్తా నర్తించిన బెజవాడలో బాలా కుమారి పాట ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది.

బెజవాడలో బాలాకుమారి, మిర్యాలగూడలో మీనా కుమారి అంటూ హిట్టు హిట్టు సూపర్ హిట్టు, నా ఫిగర్ కి ఒక్క లైక్ కొట్టు అనే మాస్ బీట్ గాయని గీతామాధురి ఆలపించారు. తన అధ్బుతమైన గాత్రనికి యంగ్ టాలెంటెడ్ డాన్సర్ స్నేహ గుప్తా తోడై డాన్స్ ను ఇరకొట్టింది. సంతోష్ కుమార్ బి రాసిన ఈ పాట కచ్చితంగా ఓ ట్రెండ్ సెట్ చేస్తుంది అని పాట వింటుంటే తెలుస్తోంది.

Speed 220 Movie Song Viral in social media1

దింతో స్పీడ్ 220 సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక చిత్రం టైటిల్ లోనే స్పీడ్ ఉంది కాబట్టి, చిత్రాన్ని కూడా ప్రేక్షకులకు స్పీడ్ గా అందించేందుకు షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా హర్ష బెజగం ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. అదేవిధంగా ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా తగ్గకుండా చిత్ర నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా సినిమాను గ్రాండ్ గా రూపొందిస్తున్నారు.Speed 220 Movie Song Viral in social media2

అతి త్వరలోనే ఈ చిత్రం అన్ని పనులు ముగించుకుని ప్రేక్షకుల ముందుకు రానుంది.

చిత్రం: స్పీడ్220,

సాంకేతిక వర్గం: 

నిర్మాత: కె ఫణి, ఎమ్ సూర్యనారాయణ, ఎమ్ దుర్గ రావ్,హీరోలు: హేమంత్, గణేష్, హీరోయిన్స్: ప్రీతీ సుందర్, జాహ్నవి శర్మ, డ్యాన్సర్: స్నేహ గుప్తా, కొరియోగ్రాఫర్ : అషేర్ మామిడి, మ్యూజిక్ డైరెక్టర్: శేఖర్ మోపూరి, సింగర్ : గీతమాధురి, డీఓపీ : క్రాంతి కుమార్ కొణిదెన, పీఆర్ఓ : హరీష్, దినేష్, కథ-స్క్రీన్ ప్లే- డైరెక్షన్ : హర్ష బెజగం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *