స్లమ్ డాగ్ హజ్బెండ్’ సినిమా పూర్తి వినోదాత్మకంగా సాగే చిత్రం.. నిర్మాతలు అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి

IMG 20230724 WA0147

సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’.చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించాడు. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని జూలై 29న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలేంటంటే..

మాది సూర్యాపేట జిల్లా. మాకు ఊర్లో థియేటర్ కూడా ఉండేది. అలా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. వ్యాపారరిత్యా విదేశాలకు వెళ్లాం. మేం అక్కడే ఓ హాలీవుడ్ సినిమాను కూడా నిర్మించాం. 2016లో ఆ సినిమాను నిర్మించాం. ఆ చిత్రానికి జురాసిక్ పార్క్ డీఓపీ పని చేశారు. 2017కి ఇండియాకి వచ్చేశాం.

IMG 20230724 WA0157

స్లమ్ డాగ్ హజ్బెండ్ అనేది పూర్తి వినోదాత్మక చిత్రం. అంతర్లీనంగా ఓ సందేశాన్ని కూడా ఇస్తాం. మూఢనమ్మకాల మీద సెటైర్‌లా ఉంటుంది. మ్యూజికల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఈ కథ చాలా కొత్తగా అనిపించింది. అందరూ నవ్వుకునేలా ఉంటుంది.

 

తెలుగమ్మాయినే హీరోయిన్‌గా పెట్టాలని అనుకున్నాం. ఇద్దరి ముగ్గురిని ఆడిషన్స్ చేశాం. చివరకు ప్రణవిని తీసుకున్నాం.

IMG 20230724 WA0155

జార్జి రెడ్డి స్టోరి విన్నప్పుడు బాగా అనిపించింది. రెబల్ లాంటి స్టోరీ చెప్పాలని ఆ సినిమా చేశాం. మా సంస్థను దీర్ఘదృష్టితో ప్రారంభించాం. మంచి సినిమాలు తీయాలని పెట్టాం. మా సంస్థలో ఇంకో ఆరు ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. కొత్త దర్శకులతోనే సినిమాలు తీస్తున్నాం. కొన్ని స్టోరీలు పెద్ద హీరోలకు చెప్పించాలని చూస్తున్నాం.

 

సంజయ్ డాగ్ లవర్. ఈ సినిమానే ఆయన్ను కోరుకుంది.(నవ్వుతూ)

IMG 20230724 WA0153

ప్రతీ శుక్రవారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. బ్రో శుక్రవారం వస్తోంది. మేం శనివారం వస్తున్నాం. సినిమా ఆద్యంతం నవ్వుకునేలా ఉంటుంది. సంగీతం బాగుంటుంది. ఓ రెండు గంటల పాటు ప్రేక్షకులను నవ్విస్తాం.

 

బ్రహ్మాజీ గారు ఈ సినిమాను నమ్మారు. మా కంటే ఆయనే ముందుండి ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఆయన పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు.

 

స్లమ్ డాగ్ హజ్బెండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు శ్రీలీల, సుకుమార్ గారు ముఖ్య అతిథులుగా రాబోతోన్నారు. జూలై 27న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతోన్నాం.

 

మైక్ టీవీ ద్వారా మేం ఎంతో మందికి అవకాశం ఇచ్చాం. ఫోక్ సింగర్లను ఎంతో మందిని పరిచయం చేశాం.

IMG 20230724 WA0158

నేను ఎక్కువగా సినిమాల మీద ఫోకస్ పెడతాను. మా బ్రదర్ (వెంకట్ అన్నపరెడ్డి) వ్యాపారం మీద ఫోకస్ పెడతారు. కథ అంతా ఓకే అయినా తరువాత మా బ్రదర్‌కు చెబుతాను. మేం ఇంత వరకు ఏ దర్శకుడు, ఏ హీరో దగ్గరకు వెళ్లి కథ చెప్పలేదు. మా దగ్గరికే చాలా కథలు వస్తున్నాయి. ఈ ఏడాదిలోనే ఇంకో రెండు చిత్రాలు విడుదల చేయబోతోన్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *