మళ్ళీ పెళ్లి’ సినిమా లో ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ తో పాటు హై ఎమోషన్స్ ఉంటాయి అంటున్న పవిత్రా లోకేష్

malli pelli posters Pavitra lokesh 4 e1685022934233

నవరసరాయ డా. నరేష్ వి.కె గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్ళీ పెళ్లి’ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. యూనిక్ కథతో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ లో పవిత్ర లోకేష్ కథానాయికగా నటిస్తున్నారు. మెగా మేకర్ ఎం ఎస్ రాజు రచన, దర్శకత్వం వహించారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌ పై నరేష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

మళ్లీ పెళ్లి సినిమా ప్రపంచ వ్యాప్తంగా మే 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పవిత్ర లోకేష్ గారు మా 18f మూవీస్  ప్రతినిధి తో సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

చాలా విరామం తర్వాత ‘మళ్ళీ పెళ్లి’ లో మళ్ళీ హీరోయిన్ గా చేయడం ఎలా అనిపించింది ?

malli pelli posters Pavitra lokesh 7

నా కెరీర్ ప్రారంభం నుంచి పాత్రలపై దృష్టి పెట్టాను గానీ హీరోయిన్ గానే చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. నా కెరీర్ మొదట్లోనే సుప్రసిద్ధ దర్శకులు గిరీష్ కాసరవెల్లి గారు నన్ను కథానాయికగా చేసి రెండు సినిమాలు చేయడం నా అదృష్టం. తర్వాత నాకు వచ్చిన, నచ్చిన పాత్రలు చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మళ్ళీ పెళ్లి లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాను. నరేష్ గారు చెప్పినట్లు .. హీరో హీరోయిన్ అనుకుంటే హీరో హీరోయిన్ అనుకోవచ్చు. ఎలా కన్సిడర్ చేస్తారనేది మీ ఇష్టానికి వదిలేస్తున్నాను.

మళ్ళీ పెళ్లి బయోపిక్ అనుకోవచ్చా ?

బయోపిక్ అనేది చాలా పెద్ద వర్డ్. మళ్ళీ పెళ్లి కథ సమాజానికి అద్దం పడుతుంది. ఇలాంటి పరిస్థితులు, ఆలోచనలు సమాజంలో వున్నాయి. ఆడియన్స్ తప్పకుండా కనెక్ట్ అవుతారు.

‘మళ్ళీ పెళ్లి’ సినిమా మీరు చేయడానికి కారణం ?

malli pelli posters Pavitra lokesh 5

ఎంఎస్ రాజు గారు ఈ కథ చెప్పినప్పుడు నచ్చింది. నరేష్ గారు, నేను కలసి చేస్తేనే ఇది బాగుంటుందని అన్నారు. మా ఇద్దరికీ నచ్చి ఈ సినిమా చేశాం.

malli pelli posters Pavitra lokesh 41

ఎంఎస్ రాజు గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

ఇది చాలా అందమైన ప్రయాణం. రాజు గారి నిర్మాణంలో హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా చేశాను. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో చేయడం ఆనందంగా వుంది. ఆయన చాలా యూత్ ఫుల్,  ట్రెండీగా ఆలోచిస్తారు. ఈ కథని కూడా ట్రెండీగా ప్రజెంట్ చేశారు.

ఇందులో చాలా బోల్డ్ కంటెంట్ ఉంటుందని రాజు గారు చెప్పారు కదా ?
మనం సమాజంలో కొన్ని కండీషన్ పెట్టుకొని వుంటాం. దాన్ని దాటితే బోల్డ్ అంటాం. ఈ రకంగా చూసుకుంటే ఇందులో చాలా బోల్డ్ వుంటుంది.

ఈ మళ్ళీ పెళ్లి  నిజమైన కథనా  ?  ఫిక్షనా ?

malli pelli posters Pavitra lokesh 2

ఇది కల్పితమా? యాదార్ధమా? అనేది ఇప్పుడు చెప్పలేను. సినిమా చూసిన తర్వాత మీకే అర్థమైపోతుంది.

జీవితంలో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బావుండాలనే సందేశం లాంటిది ఇస్తున్నారా ?

అలాంటి సందేశం అయితే వుంది. ఎవరైనా అదే కోరుకుంటారు కదా.

ఇది ఎవరికైనా టార్గెట్ చేయడానికి తీసిన సినిమానా ?

లేదండీ. ఒకరిని టార్గెట్ చేయడానికి సినిమా తీయాల్సిన అవసరం లేదు.

malli pelli posters Pavitra lokesh 21 e1685023001954

నరేష్ గారిలో మీకు నచ్చిన లక్షణాలు ?

నరేష్ గారు ఎంత సీరియస్ విషయాన్ని అయినా చాలా లైట్ తీసుకొని దానికి ఏం కావాలో చాలా సీరియస్ గా చేస్తారు. ఆ క్వాలిటీ నాలో లేదు. నేను చిన్న చిన్న విషయాలని కూడా సీరియస్ గా తీసుకుంటాను. నరేష్ గారు ఈ రోజు గురించే ఆలోచిస్తారు.

ఈ రోజు తమకి ఉన్నదాంట్లో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. రేపు అనేది రాని చూసుకుందామంటారు. ఈ క్యాలిటీ ఆయనలో నేర్చుకున్నాను. అన్నిటికన్నా ఆయన నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. దీని కంటే కావాల్సింది ఏముంది. ఈ విషయంలో చాలా ఆనందంగా వుంది.

malli pelli posters

మళ్ళీ పెళ్లి అనే పదాన్ని సమాజం ఇప్పటికీ తక్కువగానే చూస్తుంది ? దీనిపై మీ అభిప్రాయం?

ఇదొక్కటే కాదు సమాజంలో చాలా నిబంధనలు ఉంటాయి. అయితే సమాజంలో ఎవరు ఎవరిని సరిచేయలేరు. ఎవరి ఆలోచన, అభిప్రాయాలతో వాళ్ళు ఉంటారు. మా విషయంలో కొన్ని సంఘటనలు జరిగాయి. నా విషయానికే వస్తే .. కొందరు పరిస్థితులని అడ్డుపెట్టుకొని చాలా తప్పుగా చూపారు. నా వ్యక్తిత్వ హననం చేసి, నా కెరీర్ పై బ్లాక్ మార్క్ పెట్టాలని చూశారు. దీని నుంచి బయటికి రావడం చాలా కష్టం.

 నేను ఒంటరిగా వుంటే ఆత్మహత్య చేసుకోవాలి లేదా ఇంట్లో కూర్చోవాలి. నేను బయటికివచ్చానంటే కారణం నరేష్ గారు..నా వెనుక బలంగా నిల్చున్నారు. నేను ఉన్నానని చెప్పారు. దేనికీ  భయపడలేదు. నేను ఒక్క అడుగు వెనకి వేసినా పరిస్థితి దారుణంగా వుండేది. నరేష్ గారు చాలా సపోర్ట్ గా వున్నారు.

malli pelli posters Pavitra lokesh 12

విజయ నిర్మల గారిని కలిశారా?

విజయ నిర్మల గారిని కలిశాను. కానీ మేము కలిసినప్పుడు విజయ నిర్మల గారి ఆరోగ్యం అంతగా బాలేదు. ఆమెతో  ఎక్కువ సమయం గడిపే అవకాశం రాలేదు. కానీ కృష్ణ గారితో చాలా సమయం గడిపాం. ఆయనతో మాట్లాడటం, ఎన్నో విషయాలని పంచుకోవడం జరిగింది. ఈ విషయంలో అదృష్టంగా భావిస్తున్నాను. మహేష్ బాబు గారిని కూడా కలిశాను. ఫ్యామిలీ మమ్మల్ని యాక్సప్ట్ చేసింది.

మళ్ళీ పెళ్లి సినిమా గురించి ప్రేక్షకులకు ఏం చెబుతారు ?

చాలా మంచి మ్యూజిక్ వుంది. సినిమాని చాలా అద్భుతంగా ప్రజంట్ చేశాం. కథ పరంగా సమాజంలోని పరిస్థితులని డీల్ చేశారు. కామెడీ, ఎంటర్ టైన్మెంట్, హై ఎమోషన్ వున్న చిత్రం మళ్ళీ పెళ్లి. ప్రేక్షకులు చాలా ఆసక్తికరంగా చూసి ఎంజాయ్ చేస్తారు.

malli pelli posters Pavitra lokesh 71 e1685023063646

విజయ కృష్ణ మూవీస్  లో మీ పాత్ర ఎలా వుంటుంది ?

ఇందులో వర్క్ చేస్తున్నాను. భవిష్యత్తులో కూడా నా భాగస్వామ్యం వుంటుంది.

మళ్ళీ ఫైనల్ కాపీ చూసిన తర్వాత ఎలా అనిపించింది ?

ఇది వరకు చాలా సార్లు చూశాను. కానీ ఫైనల్ కాపీ చూసినప్పుడు అసలు సెకండ్ హాఫ్ ఎలా వెళ్ళిపోయిందో తెలియనే తెలీదు. అంత అద్భుతంగా వచ్చింది.

malli pelli posters Pavitra lokesh 11

కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?

ఒక కన్నడ సినిమా చేస్తున్నాను. అలాగే నితిన్ సినిమా చేస్తున్నాను. ఇంకొన్ని కథలు వింటున్నాను.

థాంక్ యు అండ్ అల్ ద బెస్ట్ పవిత్ర లోకేష్ గారూ..

*కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *