Sound Party Producers Solpecial Interview: సౌండ్ పార్టీ సిన్మా క్లీన్ కామెడీతో ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తుంది అంటున్న నిర్మాతలు!

IMG 20231120 WA0080 e1700470062624

 

 ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా రూపొందిన చిత్రం `సౌండ్ పార్టీ`. వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా న‌టించారు. జయ శంకర్ సమర్పణలో  సంజ‌య్ శేరి దర్శకత్వం వహించారు. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర  నిర్మాత‌లు.

ఇప్ప‌టికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంచ‌నాలు పెంచిన ఈ చిత్రం వ‌రల్డ్ వైడ్ గా  ఈనెల 24న గ్రాండ్ గా థియేట‌ర్ల‌లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు రవి పొలిశెట్టి, మహేంద్ర ఈ రోజు మా 18F మూవీస్ మీడియా ప్రతినిధి తో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాము..

IMG 20231120 WA0041

మేము తెలంగాణా లో పుట్టినా అమెరికా లో ఉంటూ కలసి బిజినెస్ చేస్తున్నాము. సినీమాలపై ఉన్న ప్యాషన్ తో ప్రొడ్యూసర్స్ గా మారాలనుకున్నాం. పార్ట్ నర్ షిప్ తో ఈ సినిమాని నిర్మించాం. దాదాపు 25 స్క్రిప్టులు విన్న తర్వాత ఈ కథను ఫైనల్ చేశాం.

అమెరికా లోని తెలుగు ప్రేక్షకులైనా, ఇక్కడి ఆడియన్స్ అయినా కామెడీ జానర్ సినిమాలోనే ఎక్కువగా ఇష్టపడతారు. సంజయ్ శేరి చెప్పిన స్టోరీలో ఇన్నోసెంట్ కామెడీ ఉంది. ఫిబ్రవరిలో యుఎస్ నుంచి వచ్చి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో 28 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. కాకపోతే అనుకున్న బడ్జెట్ కంటే కాస్త పెరిగింది. పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో ఇబ్బంది పడినా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వచ్చాం.

IMG 20231120 WA0076

అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. ప్రెజెంటర్ గా ఉన్న జయశంకర్ మాకు చాలా సపోర్ట్ చేశారు. కంప్లీట్ ఫ్యామిలీ అంతా చూసేలా సినిమా ఉంటుంది. సినిమాలో కామెడీ ఉంటే అమెరికా ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ చేస్తారు. ఇక్కడ 100 థియేటర్లో విడుదల చేస్తుంటే యూఎస్ లో మాత్రం 150 ప్లస్ థియేటర్స్ లో విడుదల చేస్తున్నాం.

కుటుంబంలో తండ్రి కొడుకులు ఇద్దరూ ఇన్నోసెంట్ అయితే మనీ మేకింగ్ ఎలా చేస్తారు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఫాస్ట్ గా రిచ్ అయిపోవడానికి వాళ్ళిద్దరూ ఏం చేశారనేది హిలేరియస్ గా ఉంటుంది. బిట్ కాయిన్ కాన్సెప్ట్ తోనూ దీంట్లో ఫన్ జనరేట్ చేసాం. సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తాయి. సన్నీ చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు.

IMG 20231120 WA0048

నవంబర్ 24న కాంపిటీషన్ ఉన్నా.. కథపై నమ్మకంతోనే ముందుకెళ్తున్నాం. ఫైనల్ అవుట్ పుట్ చూశాక సినిమాపై మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది. కంప్లీట్ క్లీన్ కామెడీతో రాబోతున్న చిత్రాన్ని ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్మకం ఉంది.

మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా సరే.. ప్రొడక్షన్ పరంగా 100 మందికి హెల్ప్ చేశాననే హ్యాపీనెస్ ఉంది. తెలుగులో మరిన్ని సినిమాలు చేయడానికి కథలు ఉంటున్నాం. ఫస్ట్ సినిమా అనుభవం మాకు చాలా నేర్పించింది. ఇకపై ఇకపై చేసే సినిమాలకు గ్రౌండ్ వర్క్ లా ఉపయోగపడింది. ప్రతి చిత్రాన్ని కొత్త టీం తో నిర్మించాలనుకుంటున్నాం”.

 

ఓకే థాంక్యూ అండ్ అల్ ది బెస్ట్ రవి & మహేంద్ర గారూ..

* కృష్ణ ప్రగడ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *