Sound Party heroine Special Interview: సౌండ్ పార్టీ లో నేను క్రికెట్ లో ధోని లా ప్రవర్తిస్తాను: హ్రితిక శ్రీనివాస్

IMG 20231119 WA0188 e1700386192399

 

 ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా రూపొందిన చిత్రం `సౌండ్ పార్టీ`. వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా న‌టించారు. జయ శంకర్ సమర్పణలో సంజ‌య్ శేరి దర్శకత్వం వహించారు. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాత‌లు. ఇప్ప‌టికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంచ‌నాలు పెంచిన ఈ చిత్రం.

IMG 20231119 WA0131

ఈ సౌండ్ పార్టీ సినిమా వరల్డ్ వైడ్ గా ఈనెల 24న గ్రాండ్ గా థియేట‌ర్ల‌లో విడుదలవుతోంది.  ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ హ్రితిక శ్రీనివాస్ మా 18F మూవీస్ మీడియా ప్రతినిధి తో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాము.

“సీనియర్ నటి ఆమని మా అత్త అవటంతో చిన్నప్పుడు నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో కూడా నటించాను. హీరోయిన్ గా తెలుగులో నాకు ఇది రెండో సినిమా. అల్లంత దూరాన తర్వాత నటించిన చిత్రమిది. సంజయ్ గారు కథ చెప్పినప్పుడు ఎక్సైటింగ్ గా అనిపించింది. ఇది ఒక కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్. కామెడీ తోపాటు కంటెంట్ కూడా ఉంది.

IMG 20231119 WA0190

ప్రేక్షకులు కచ్చితంగా ఎంటర్ టైన్ అవుతారని నమ్మకం ఉంది. ఇందులో నేను సిరి అనే పాత్రలో నటించాను. సిరి చాలా తెలివైన అమ్మాయి. నా పాత్ర సినిమాలో చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. క్రికెట్ టీం లో ధోనీలా నా పాత్ర ఉంటుందని డైరెక్టర్ అంటుంటారు. సినిమా క్లైమాక్స్ లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇస్తాను. లాస్ట్ లో వచ్చి ధోని ఎలా సిక్స్ లు కొడతారో అలా నా పాత్ర ఉంటుందని.. అలా అంటారు.

సీరియస్ క్యారెక్టర్ అయినా సిచువేషన్ మాత్రం చాలా కామెడీగా ఉంటుంది. నా రియల్ లైఫ్ కి రిలేటబుల్ గా ఈ పాత్ర ఉంటుంది. అమాయకులైన తండ్రి కొడుకులు ఈజీ మనీ కోసం ఎలాంటి పనులు చేస్తారనేది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. ఈ పాయింట్ నే చాలా ఫన్నీగా దర్శకులు చూపించారు. ఇందులో బిట్ కాయిన్ గురించి కూడా ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బిట్ కాయిన్ వాల్యూను చూపించారు.

IMG 20231119 WA0187

 హీరో సన్నీకి టెలివిజన్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. బిగ్ బాస్ లో ప్రేక్షకులు తనని ఎలా చూశారో సెట్ లోనూ ఆయన అలానే ఉంటారు. చాలా జెన్యూన్ గా, ఓపెన్ గా ఉంటారు. సౌండ్ పార్టీ టైటిల్ కి కరెక్ట్ ఎగ్జాంపుల్ గా నటించారు. సెట్ లో సన్నీ చాలా సపోర్ట్ చేశారు. తెలుగులో మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు రాకపోతే ఆయనే నేర్పించారు. ఇందులో సిచువేషన్ కి తగ్గట్టుగా వచ్చే రెండు పాటలు మాత్రమే ఉంటాయి.

మనీ మనీ అంటూ వచ్చే టైటిల్ సాంగ్ తో పాటు మరో సాంగ్ ఉంటుంది. డైరెక్టర్ సంజయ్ రైటింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాం. జయశంకర్ సార్ ప్రజెంటర్ గా ఉండడం ఈ సినిమాకు ప్లస్ అయింది. నిర్మాతలు రవి సార్, మహేంద్ర గజేంద్ర గారు చాలా సపోర్ట్ చేశారు. ఈ బ్యానర్ లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.

IMG 20231119 WA0189

నాకు ఎక్స్పరిమెంట్స్ సినిమాలు చేయాలని ఉంది. తెలుగులో నాకు నచ్చిన హీరోయిన్ సాయి పల్లవి. ఆమె చేసే రోల్స్ లాంటివి చేయాలని ఉంటుంది. హీరోల విషయంలో నాని అంటే నాకిష్టం”.

 

ఓకే థాంక్యూ అండ్ అల్ ది బెస్ట్ హ్రితిక…

* కృష్ణ ప్రగడ.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *