Sound Party’ Hero VJ Sunny Special Interview: అన్ని పార్టీల మద్దతు మా సౌండ్ పార్టీకే అంటున్న VJ సన్నీ !

IMG 20231122 WA0119 e1700650700980

 

 ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా రూపొందిన చిత్రం `సౌండ్ పార్టీ`. వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా న‌టించారు. జయ శంకర్ సమర్పణలో సంజ‌య్ శేరి దర్శకత్వం వహించారు. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాత‌లు. ఇప్ప‌టికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంచ‌నాలు పెంచిన ఈ చిత్రం వ‌రల్డ్ వైడ్ గా ఈనెల 24న గ్రాండ్ గా థియేట‌ర్ల‌లో విడుదలవుతోంది.

 

ఈ సందర్భంగా సన్నీ మా 18F మూవీస్ మీడియా ప్రతినిధి తొ మాట్లాడారు. సన్నీ సౌండ్ పార్టీ సినిమా విశేషాలు తెలియజేస్తూ ఇలా అన్నారు..

IMG 20231122 WA0121

బిగ్ బాస్ తర్వాత నేను చేసిన ప్రాజెక్టులో బెస్ట్ ప్రాజెక్టు సౌండ్ పార్టీ. ఈ సినిమా కోసం 100% ఎఫెక్ట్ పెట్టాను. తండ్రి కొడుకుల మధ్య ఉండే ఫ్రెండ్షిప్ బాండింగ్ ను ఫన్నీ వేలో చూపించాం. డబ్బులు కోసం ఫాదర్ అండ్ సన్ ఏం చేశారనేది.. ఏం చేయకూడదనేది ఇందులో చూపించాం. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఇది.ఇందులో బిట్ కాయిన్ కు కూడా కీలకపాత్ర ఉంటుంది. ఈ సినిమాకు దర్శకుడు సంజయ్ నన్ను రిఫర్ చేశారు. నిర్మాతలు కొత్తవారైనా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంజయ్ స్క్రిప్ట్ ఏదైతే రాశారో అదే తెరపై వచ్చేలా తీశాడు. సినిమాలో పెద్ద సర్ప్రైజ్ కూడా ఉంటుంది. జయశంకర్ గారు ప్రెజెంటర్ గా ఈ సినిమాకు చాలా హెల్ప్ చేశారు. హ్రితిక శ్రీనివాస్ .. ఆమని గారి మేనకోడలు అని నాకు షూటింగ్ టైంలో తెలియదు. తర్వాత తెలిసి షాక్ అయ్యాను. ఆమె చాలా డౌటు ఎర్త్. చాలా డెడికేటెడ్ గా నటించింది. హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంటుంది.

IMG 20231122 WA0120

శివన్నారాయణ గారిని చూస్తే ఎవరికైనా ఇప్పటికీ అమృతం సీరియల్ గుర్తొస్తుంది. ఆయన నేను తండ్రి కొడుకులుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాం. కుబేర్ కుమార్ గా ఆయన నటన ఆకట్టుకుంటుంది. చిన్న చిన్న పంచులతో నేచురల్ కామెడీ బాగా పండింది. గతంలో చేసిన తప్పులను చేయకుండా జాగ్రత్తగా ఈ చిత్రాన్ని పూర్తి చేశాను.

వెన్నెల కిషోర్ గారు ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చి సపోర్ట్ చేస్తే.. నాని అన్న కూడా ప్రమోషన్స్ విషయం లో సపోర్ట్ గా నిలిచారు. సెన్సార్ సభ్యులు కూడా ఈ సినిమా చూసి చాలా నవ్వుకున్నామని చెప్పారు. బాగా ఎంజాయ్ చేశాం అని చెప్పి మమ్మల్ని అభినందించడం మా టీమ్ అందరికీ ఆనందాన్ని ఇచ్చింది. యూఎస్ లో ప్రీమియర్ వేస్తే వందకు వంద మార్కులు వేశారు.

IMG 20231122 WA0122

సినిమా చూసిన ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. కామెడీ జానర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంతకుముందు కొన్ని కామెడీ సినిమాలు చేసినా అవి వర్కౌట్ అవ్వలేదు. ఎక్కడ పోగొట్టుకుంది అక్కడే రా బట్టుకోవాలనే ఫార్ములాతో తిరిగి ఈ సినిమాతో హిట్ కొట్టాలనుకుంటున్న.ఎన్నికల సమయంలో వాస్తున్న మా సౌండ్ పార్టీకి

అన్ని పార్టీల మద్దతు ఉంటుంది. ప్రస్తుతానికి ఏ సినిమా చేయడం లేదు. ఈ సినిమా పూర్తయ్యాకే వేరొకటి మొదలుపెడదాం అనుకుంటున్నా. ఎక్స్పరిమెంటల్ క్యారెక్టర్ చేసి ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వాలనుకుంటున్నా”.

ఓకే థాంక్యూ అండ్ అల్ ది బెస్ట్ సన్నీ గారూ..

*కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *